ప్రెస్ రివ్యూ : ఊరుకుంటే ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారన్న పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, PAWAN/TWITTER
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో మహిళపై జరిగిన దాడి ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. దీనిపై ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..
పెందుర్తి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలు వివరణ కోరుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.
తాను వ్యక్తిగతంగా వచ్చి మాట్లాడితే అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఈ విషయంలో అధికారులు ప్రేక్షకపాత్ర వహించవద్దని కోరారు. అధికార టీడీపీకి చెందినవారే దీనికి బాధ్యులని ప్రచారం జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తు పరిణామాలు సమాజంలోని ఆహ్లాదకర వాతావరణాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.
ప్రజల హక్కులను కాలరాస్తున్నా అధికార యంత్రాంగం చూస్తూ ఊరుకుంటే ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి నెలకొంటుందని పవన్ హెచ్చరించారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

బాధితురాలికి అండగా నిలవాలని విశాఖ కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ను కోరారు. ఆమెకు న్యాయం చేసేందుకు గాను జనసేన కార్యకర్తల బృందాన్ని విశాఖకు పంపిస్తానని తెలిపారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

అధికారంలో ఉన్న టీడీపీ, బీజీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మాని, అందరూ ఒకేతాటిపైకి వచ్చి, అసెంబ్లీలో దీనిపై చర్చించి, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని పవన్ సూచించారు.
పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానికి?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..
రాష్ట్ర విభజన తర్వాత పోలవరం నిర్మాణాన్ని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి అప్పగించింది.
అయితే, కాంట్రాక్టు సంస్థ ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ఆశించినమేర జరగడం లేదన్న అభిప్రాయం ఉంది.
దీంతో స్పిల్ వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులలో కొంత భాగాన్ని మరో సంస్థకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. టెండర్లు కూడా పిలిచారు.
అయితే.. ఈ టెండర్ల ప్రకియను నిలిపి వేయాలంటూ కేంద్ర జల వనరుల శాఖ ఆదేశించింది.

ఫొటో సోర్స్, facebook
ఇదే సమయంలో కేంద్ర జల వనరుల శాఖ నుంచి అధికారుల బృందాలు వరుస పెట్టి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నాయి.
- పోలవరంలో ఎన్‌హెచ్‌పీసీ బృందం పర్యటించాక వాప్కోస్ బృందం వచ్చింది.
- ఆ తర్వాత.. పోలవరం ప్రాజెక్టు సీఈవో హాల్దర్ పర్యటించారు.
- ఆయన పర్యటనలో ఉండగానే కేంద్ర మంత్రి గడ్కరీ ఓఎస్డీ ఖోలాపుర్కర్ వచ్చారు.
- త్వరలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ రానున్నారు.
- జనవరి మొదటి వారంలో గడ్కరీ పోలవరంలో పర్యటించనున్నారు.
పోలవరం నిర్మాణాన్ని తన ఆధీనంలోకి తీసుకునే యోచనతోనే కేంద్రం ఇంత కసరత్తు చేస్తోందని కొందరు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, DevineniUma/Facebook
కాఫర్ డ్యామ్ నిర్మాణం నిలిపివేయాలన్న ఉత్తర్వులపైనా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర జల సంఘం అనుమతి ఇచ్చాక.. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)ని అధ్యయనం చేయాలని కోరడాన్ని రాష్ట్ర జల వనరులశాఖ వర్గాలు తప్పుబడుతున్నాయి.
మరో కొత్త సంస్థకు కాంట్రాక్టు అప్పగించేందుకు అవకాశం ఇవ్వకపోవడంపైనా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కాఫర్ డ్యామ్‌పై ఎన్‌హెచ్‌పీసీ బృందం ఇప్పటిదాకా నివేదిక ఇవ్వకపోవడాన్ని ఆ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి.
ఇవన్నీ చూస్తుంటే పోలవరం నిర్మాణాన్ని కేంద్రం తీసుకునే అవకాశం ఉందని ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.

ఆదివాసీ-లంబాడాలతో ప్రభుత్వం చర్చలు!
ఉట్నూరు సమస్యకు పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందంటూ సాక్షి ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం ఆదివాసి-లంబాడాల సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపెట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉట్నూర్‌కు తరలివచ్చింది.
ఆదివాసి-లంబాడాల వివాదంపై సివిల్ సర్వీస్ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌లు సమీక్షించారు. తర్వాత ఆదివాసీ, లంబాడీ పెద్దలతో చర్చించారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని సీఎస్ ఎస్పీ సింగ్ అన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సి ఉందన్నారు. శాంతి స్థాపన కోసం ఇరువర్గాల పెద్దలు సహకరిస్తామని చెప్పారని తెలిపారు.
చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన తెలిపారు.
అయితే, చర్చలపై ఆదివాసీ, లంబాడాలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
చర్చలతో ఎలాంటి ఫలితం దక్కలేదని ఆదివాసీ సంఘం నేత నైతం రవి అన్నారు.
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని, అందుకోసం శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు.
లంబాడాలతో చర్చలకు ఒప్పుకునేది లేదన్నారు.
45 రోజులుగా తమ వర్గం ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లడం లేదని, పరిష్కారం లేనప్పుడు చర్చలు ఎలా ఫలప్రదమవుతాయని లంబాడీ నాయకులు ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఈనాడు ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ స్వీట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తారని పేర్కొంది.
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు.
పర్యాటకులను ఆకర్షించేందుకే ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు పర్యాటక శాఖ అధికారులు చెప్పారు.
దీనికి సీఎం కేసీఆర్ కూడా అంగీకరించినట్లు వారు వివరించారు.
- దాదాపు వందకు పైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తారు.
- దుకాణాలు, హోటళ్లు, బేకరీల నుంచి తెచ్చిన వాటిని కాకుండా సొంతంగా తయారు చేసిన పదార్థాలనే ఇక్కడ ప్రదర్శనకు అనుమతి ఇస్తారు.
- హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలలకు చెందిన వారికీ అవకాశం కల్పిస్తారు.
- విదేశీయులు, హైదరాబాద్‌లో స్థిరపడిన మార్వాడీలు సహా ఇతర రాష్ట్రాలు వారూ ఇందులో పాల్గొనవచ్చు.
- అక్కడే ఆయా పదార్థాలను తయారు చేసి ప్రదర్శించడంతో పాటు వాటిని విక్రయించుకోవచ్చు.
ఒక్కో స్టాల్‌లో 5 నుంచి 10 రకాల స్వీట్స్‌ను దుకాణాల్లో కంటే తక్కువ ధరకు విక్రయిస్తారని ఈనాడు తన కథనంలో పేర్కొంది.
మా ఇతర కథనాలు:
- #గమ్యం: ఏం చదివితే Job గ్యారెంటీ!
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- బాబ్రీ విధ్వంసానికి 'రిహార్సల్స్' ఇలా జరిగాయి..
- ఇన్‌స్టాగ్రామ్‌తో డబ్బులు సంపాదించడం ఎలా?
- మీ ద్వేషమే మీకు రక్ష!!
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
- అనుపమా పరమేశ్వరన్ : కాలేజీ రోజుల్లో నన్నూ వేధించారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








