కాలిఫోర్నియా కార్చిచ్చులో 31కి చేరిన మృతుల సంఖ్య

కాలిఫోర్నియాలో కార్చిచ్చు మృతుల సంఖ్య 31కి పెరిగింది. వివిధ ప్రాంతాల్లో ఖైదీలు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. కాలిఫోర్నియా చరిత్రలో అత్యంత తీవ్రమైన కార్చిచ్చుల్లో ఇది ఒకటి.

అగ్ని కీలల నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆదివారం రాత్రి నుంచి కొనసాగుతున్న కార్చిచ్చు తీవ్రతరం అయ్యింది. ఇప్పటికి 3,500కు పైగా భవనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. 25 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
మంటల్లో చిక్కుకుని తగలబడుతున్న ఒక భవనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంచుమించు ఐదు వేల జనాభా ఉండే కాలిస్టోగా పట్టణం(నపా కౌంటీ) మొత్తాన్నీ ఖాళీ చేయించేందుకు అధికార యంత్రాంగం బుధవారం ఆదేశాలిచ్చింది. దాదాపు 800 మంది ఉండే గేసర్ విల్లే నుంచి కూడా అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కార్చిచ్చు కారణంగా ధ్వంసమైన మరో భవనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సొనోమా, నపా, మరో ఐదు కౌంటీల్లో కాలిఫోర్నియా గవర్నర్ జెర్రీ బ్రౌన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
సొనోమా కౌంటీలో ఉన్న శాంటా రోసాలోని అన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు సృష్టించిన విధ్వంసం

ఫొటో సోర్స్, AFP/Getty

ఫొటో క్యాప్షన్, సొనోమా కౌంటీలో ఉన్న శాంటా రోసాలోని అన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు విధ్వంసం సృష్టించింది. ఈ కౌంటీలో 463 మంది ఆచూకీ తెలియడం లేదు.
శాంటా రోసాలో హిల్టన్ హోటల్ ధ్వంసమైంది. హోటల్ పరిస్థితి అక్టోబరు 9కి ముందు, తర్వాత...

ఫొటో సోర్స్, Google/Getty

ఫొటో క్యాప్షన్, శాంటా రోసాలో హిల్టన్ హోటల్ ధ్వంసమైంది. (చిత్రంలో హోటల్ పరిస్థితి.. కార్చిచ్చుకు ముందు, తర్వాత...)
శాంటా రోసాలో జర్నీస్ ఎండ్ ట్రైలర్ ప్రాంతం.. కార్చిచ్చుకు ముందు, తర్వాత పరిస్థితి.

ఫొటో సోర్స్, Google/Getty

ఫొటో క్యాప్షన్, శాంటా రోసా: జర్నీస్ ఎండ్ ట్రైలర్ ప్రాంతం.. కార్చిచ్చుకు ముందు, తర్వాత...
కార్చిచ్చుతో ధ్వంసమైన కారు గురించి మాట్లాడుతున్న ఒక వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సొనోమా కౌంటీలో ఆస్తి నష్టం తీవ్రంగా ఉంది. 40 వేల నివాసాలకు విద్యుత్ నిలిచిపోయింది.
రహదారిపైకి పెద్దయెత్తున వ్యాపించిన పొగ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాలిఫోర్నియా చరిత్రలో అత్యంత తీవ్రమైన కార్చిచ్చుల్లో ఇది ఒకటి. అడవుల్లో మంటలు రేగిన చోట నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరం వరకు పొగ అలముకొంది.
సహాయ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శాంటా రోసాలో పీటర్ లాంగ్ అనే వ్యక్తికి చెందిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో వెయ్యికి పైగా జంతువులు ఉన్నాయి. ఒకవైపు ఈ కేంద్రం, మరోవైపు ఆయన ఇల్లు అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి. పీటర్ జంతువులన్నింటినీ కాపాడుకొన్నారు. ఇల్లు దగ్ధమైపోయింది. ఆయనకు 77 ఏళ్లు.
కార్చిచ్చు సహాయ చర్యల్లో పాల్గొంటున్న హెలికాప్టర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాలిఫోర్నియాకు అత్యవసర సహాయ నిధులు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు.