కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు, 10 మంది మృతి

ఫొటో సోర్స్, AFP/GETTY
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని అడవుల్లో చెలరేగిన భారీ కార్చిచ్చు కారణంగా 10 మంది మృతి చెందారు. ద్రాక్ష తోటలకు నెలవైన సొనోమా, నప, యూబా ప్రాంతాల్లోని అడవుల్లో మంటలు విస్తరించాయి.
ఒక్క సనోమా ప్రాంతంలోనే ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మంటలు వేగంగా విస్తరిస్తుండటంతో సమీప ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు.
పలువురికి గాయాలయ్యాయి, మరికొందరి ఆచూకీ దొరకట్లేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఆదివారం రాత్రి అంటుకున్న ఈ అగ్నికీలలకు ఇప్పటికే వేలాది ఎకరాల అడవి కాలి బూడదయ్యింది. దాదాపు 1500 నివాసాలు దగ్ధమయ్యాయి.
దీంతో కాలిఫోర్నియా గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ కార్చిచ్చు ఇప్పటికే తీవ్ర నష్టం కలిగించింది. వేలాది మందికి ప్రమాదం పొంచివుంది. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని గవర్నర్ కోరారు.

ఫొటో సోర్స్, AFP/GETTY
కాలిఫోర్నియాలో చెలరేగిన అత్యంత ప్రమాదకర కార్చిచ్చుల్లో ఇదొకటని రాష్ట్ర అగ్నిమాపక అధికారులు తెలిపారు.
మా వెబ్‌సైట్‌పై ఇతర ప్రముఖ కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)









