డెంగీ రోగికి ప్లాస్మాకు బదులు ఆరెంజ్ జ్యూస్ ఎక్కించారు

ఫొటో సోర్స్, Reuters
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి రసం ఎక్కించారు.
ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్ హాస్పిటల్ అండ్ ట్రామా సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. డెంగ్యూ చికిత్స కోసం వచ్చిన వ్యక్తికి డ్రిప్ ద్వారా ప్లాస్మా బదులు బత్తాయి రసం ఎక్కించారని, దానివల్లే రోగి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ప్లాస్మా ఉండాల్సిన ప్యాకెట్‌లో బత్తాయి రసం ఉందని చెబుతున్న ఓ వీడియో బయటకు వచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దర్యాప్తు చేయాలని ఆదేశాలు
ఈ విషయంపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ఈ ఘటన తెరపైకి రావడంతో, ఆస్పత్రికి సీల్ వేయాలని రాష్ట్ర ప్రధాన ఆరోగ్య అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలోని రోగులందరినీ మరో ఆస్పత్రిలో చేర్చారు.
ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఝల్వాలో ఉన్న గ్లోబల్ హాస్పిటల్‌లో డెంగ్యూ రోగికి ప్లేట్‌లెట్‌లకు బదులు బత్తాయి రసం ఎక్కించారంటూ వైరల్ అవుతున్న వీడియోను పరిగణనలోకి తీసుకుని, తక్షణమే ఆస్పత్రికి సీలు వేయించాం. ప్లేట్‌లెట్ల ప్యాకెట్లను పరీక్ష కోసం పంపారు. దోషులుగా తేలితే ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని బ్రజేష్ పాఠక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
చీఫ్ మెడికల్ ఆఫీసర్‌తో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఘటనా స్థలానికి పంపినట్లు ఆయన తెలిపారు. మరికొద్ది గంటల్లోనే నివేదిక అందుతుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఫొటో సోర్స్, PRAMOTE POLYAMATE
ప్లేట్‌లెట్స్ ఎక్కిస్తున్నప్పుడే రియాక్షన్ కనిపించింది
ప్రదీప్ కుమార్ అక్టోబర్ 17న గ్లోబల్ హాస్పిటల్‌లో చేరారు. ఆయనకు డెంగ్యూ సోకినట్లు గుర్తించి, చికిత్స ఇవ్వడం ప్రారంభించారు. కానీ, రెండు రోజులకే ప్రదీప్ చనిపోయారు.
డెంగ్యూ సోకితే రక్తంలోని ప్లేట్‌లెట్స్ తగ్గిపోతాయి. వాటిని భర్తీ చేసేందుకు రోగికి ప్లాస్మా ఎక్కిస్తారు. ప్లాస్మా రంగు బత్తాయి రసం లాగే గాఢమైన పసుపు రంగులో ఉంటుంది.
ప్రదీప్‌కు ప్లేట్‌లెట్స్‌కు బదులు ఆరెంజ్ జ్యూస్ ఎక్కించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్లాస్మా బాటిల్‌లో జ్యూస్ ఉందా, లేదా.. ఒకవేళ ఉంటే ఇంత పెద్ద నిర్లక్ష్యం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
ఐజీ రాకేష్ సింగ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా ఎక్కిస్తున్నట్లు నివేదికలు రావడంతో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం. కొద్ది రోజుల క్రితం ఒక నకిలీ బ్లడ్ బ్యాంక్ కూడా పట్టుబడింది. ప్రస్తుత కేసులో ప్యాకెట్‌లో ఉన్నది బత్తాయి రసామా, కాదా అన్నది స్పష్టంగా తెలీదు. దానిపై దర్యాప్తు జరుగుతోంది" అని చెప్పారు.
ఆస్పత్రి యజమాని సౌరభ్ మిశ్రా పీటీఐతో మాట్లాడుతూ, "ప్రదీప్ పాండే ప్లేట్‌లెట్స్ 17 వేలకు పడిపోయాయి. ఆయనకు ప్లేట్‌లెట్స్ ఎక్కించాలని, అందుకు ఏర్పాటు చేయమని రోగి కుటుంబ సభ్యులను కోరాం. వాళ్లు ఎస్‌ఆర్‌ఎన్ ఆస్పత్రి నుంచి అయిదు యూనిట్ల ప్లేట్‌లెట్లను తీసుకొచ్చారు. రోగికి అవి ఎక్కిస్తుంటే రియాక్షన్ వచ్చింది. వెంటనే ఆపేశాం" అని చెప్పారు.
ప్లేట్‌లెట్ల ప్యాకెట్‌పై ఎస్‌ఆర్‌ఎన్ హాస్పిటల్ అనే స్టిక్కర్ ఉందని చెబుతూ, ప్లేట్‌లెట్స్‌పై, వాటిని తీసుకువచ్చిన ఆస్పత్రిపై దర్యాప్తు చేయాలని ఆయన అన్నారు.
అయితే దీనిపై ఎస్‌ఆర్‌ఎన్ ఆస్పత్రి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఇవి కూడా చదవండి:
- లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా? ఈ వైరస్ మనుషులకూ సోకుతోందా? దేశంలో ఎందుకిన్ని వదంతులు?
- మురిగిపోయిన కరోనా వ్యాక్సీన్లు.. 10 కోట్ల డోసుల టీకాలను పారేసిన సీరమ్ సంస్థ
- గ్రహణం సమయంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు? నమ్మకాలేంటి, వాటి శాస్త్రీయత ఎంత?
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













