సైనికుల భార్యలను అవమానించేలా అభ్యంతరకర దృశ్యాలు.. ఏక్తా కపూర్‌పై అరెస్ట్ వారెంట్

ఫొటో సోర్స్, Getty Images
ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్‌లపై బిహార్‌లోని బెగూసరాయ్ జిల్లాకు చెందిన ఒక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
వెబ్ సిరీస్ 'XXX' రెండో సీజన్‌లో సైనికులను అవమానపరచడంతో పాటు, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో ఆమెపై ఈ చర్య తీసుకున్నారు.
పీటీఐ వార్త సంస్థ ప్రకారం... మాజీ సైనికుడు, బెగూసరాయ్ నివాసి అయిన శంభూ కుమార్ చేసిన ఫిర్యాదు ఆధారంగా జస్టిస్ వికాస్ కుమార్ ఈ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు.
ట్రిపుల్ ఎక్స్ సిరీస్ రెండో సీజన్‌లో ఆర్మీ సైనికుల భార్యలకు సంబంధించిన చాలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని 2020లో నమోదు చేసిన ఫిర్యాదులో శంభు కుమార్ ఆరోపించారు.
సమన్లు జారీ చేసిన తర్వాత కూడా ఏక్తా కపూర్, శోభా కపూర్‌లు హాజరు కాకపోవడంతో కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఫిర్యాదుదారుడు ఏం చెప్పారు?
శుంభు కుమార్ లాయర్ హృషికేశ్ పాఠక్ మాట్లాడుతూ... ''ఈ సిరీస్ ఆల్ట్ బాలాజీ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వచ్చింది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏక్తా కపూర్‌కు చెందిన బాలాజీ టెలీఫిల్స్మ్ లిమిటెడ్‌కు చెందినది. శోభా కపూర్‌కు కూడా బాలాజీ టెలీఫిల్మ్స్‌తో సంబంధం ఉంది.
ఏక్తా కపూర్, శోభా కపూర్‌లకు కోర్టు సమన్లు పంపింది. ఈ కేసులో కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, సిరీస్‌లో అభ్యంతరకరంగా ఉన్న కొన్ని సన్నివేశాలను తొలిగించినట్లు వారు కోర్టుకు సమాచారం అందించారు. కానీ, కోర్టు విచారణకు హాజరు కాలేదు. దీని తర్వాతే, వారిద్దరిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది'' అని ఆయన చెప్పారు.
ఏక్తా కపూర్‌కు చెందిన ఈ వెబ్ సిరీస్‌పై వివాదాలు రావడం కొత్తేమీ కాదు. ఆల్ట్ బాలాజీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చాలా అడల్ట్ సిరీస్‌లు వచ్చాయి.
ట్రిపుల్ ఎక్స్-2 సిరీస్‌లో ఒక సన్నివేశంలో ఆర్మీ అధికారి భార్య తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్నట్లు చిత్రించారు. ఈ సన్నివేశంతో సోషల్ మీడియాలో ఏక్తా కపూర్‌తో తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది.
ఈ వెబ్ సిరీస్ ద్వారా భారతీయ సైన్యాన్ని, యూనిఫామ్‌ను ఏక్తా కపూర్ అవమానించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఆమెను అరెస్ట్ చేయాలనే డిమాండ్లు కూడా వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించి ఇతర ప్రాంతాల్లో కూడా ఏక్తా కపూర్‌పై ఫిర్యాదులు నమోదయ్యాయి.
మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, సైనికులను అవమానించడం, జాతీయ చిహ్నాన్ని అనుచిత పద్ధతిలో ఉపయోగించడం అనే ఆరోపణలతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
వెబ్‌సిరీస్‌లో ఆర్మీ యూనిఫామ్‌ను, జాతీయ చిహ్నాన్ని అభ్యంతరకరీతిలో ఉపయోగించడాన్ని చూసి ఫిర్యాదు చేసినట్లు ఫిర్యాదుదారుడు నీరజ్ యాజ్ఞ్నిక్ చెప్పారు.
బిహార్‌లోని ముజఫర్ కోర్టులో కూడా ఇలాంటి ఆరోపణలతోనే మరో ఫిర్యాదు నమోదైంది.
బిగ్ బాస్ సీజన్ 13లో పాల్గొన్న వికాస్ పాథక్ (హిందుస్థానీ భావు) కూడా ఏక్తా కపూర్‌పై ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గురుగ్రామ్‌లోని పాలమ్ విహార్ పోలీస్ స్టేషన్‌లో 'మార్టర్ వెల్ఫేర్ ఫౌండేషన్' అధ్యక్షుడు, మాజీ సైనికుడు మేజర్ టి. రావు కూడా ఆమెపై కేసు పెట్టారు.
ఈ సిరీస్‌లో, విధుల కోసం సైనికులు తమ ఇంటికి దూరంగా ఉన్న సమయంలో వారి భార్యలు, ఇతర వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పచుకున్నట్లు ఉన్న సన్నివేశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సైన్యాన్ని చూపించిన విధానంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాక, కొంతమంది దీన్ని తప్పుబడుతున్నారు.
మరోవైపు ఏక్తా కపూర్ నుంచి పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని కొంతమంది సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏక్తా కపూర్ ఏం అన్నారు?
ఈ వివాదంపై సోషల్ మీడియాలో చాలా చర్చ నడిచింది. తర్వాత దీని గురించి ఏక్తా కపూర్ వివరణ ఇచ్చారు.
''ఒక పౌరురాలిగా, ఒక సంస్థగా భారత సైన్యంపై మాకు చాలా గౌరవం ఉంది. దేశ సంరక్షణ, భద్రతలో సైనికులు కీలక పాత్ర పోషిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో గుర్తింపు ఉన్న ఏ ఆర్మీ సంస్థ అయినా మానుంచి క్షమాపణ కోరితే, మేం బేషరతుగా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం'' అని ఆమె చెప్పారు.
ఆ వివాదం తర్వాత, అత్యాచారం చేస్తామంటూ తనకు వస్తోన్న బెదిరింపుల గురించి ఆమె శోభా డేతో మాట్లాడారు. ''అనాగరిక సైబర్ బుల్లీయింగ్, సంఘ వ్యతిరేక శక్తులు చేసే బెదిరింపులకు నేను తలొగ్గను'' అని అన్నారు. ఈ సన్నివేశానికి సంబంధించి తనతో పాటు తన 76 ఏళ్ల తల్లిని కూడా అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నామని శోభా డేతో సంభాషణలో ఆమె చెప్పారు. ఈ ట్రోల్స్ చాలా సిగ్గు చేటు అని ఆమె వ్యాఖ్యానించారు.
''సిరీస్‌లో వివాదాస్పదమైన ఆ సన్నివేశం ఒక కల్పిత సన్నివేశం. మా వైపు నుంచి తప్పు జరిగింది. మేం దాన్ని సరిదిద్దుకున్నాం. ఈ విషయంలో క్షమాపణ చెప్పడం నాకు పెద్ద విషయం కాదు. కానీ, మాకు వస్తోన్న బెదిరింపులు మాత్రం చాలా సిగ్గుచేటు'' అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- Gas flaring: చమురు వెలికితీసే సంస్థలు గ్యాస్‌కు మంట పెడుతున్నాయి ఎందుకు
- ‘ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడులు’ - ఖర్జూరం పండిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతులు
- కొడుకు కళ్ల ముందే తిరుగుతున్నాడు, కానీ బతికి ఉన్నట్లు సర్టిఫికెట్ లేదు, మరి ఆ తల్లి ఏం చేసింది?
- క్యాన్సర్ సహా పలు వ్యాధులకు కారణమయ్యే కర్బన ఉద్గారాల వివరాలను దాస్తున్న చమురు కంపెనీలు- బీబీసీ పరిశోధన
- లాటరీకి భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆమోదం, కొన్ని రాష్ట్రాల్లో నిషేధం ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












