‘పాకిస్తాన్ జిందాబాద్’ అన్న యువతిని రాహుల్ హత్తుకున్నారా? ఇలాంటి వార్తలను ఎవరు వ్యాప్తిచేస్తారు

మివా జోలీ

ఫొటో సోర్స్, MIVA_ANDRELEO

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచమంతా క్షణాల్లో అరచేతిలో కనిపిస్తోంది. మొబైల్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ తెరిచేటప్పటికి కొన్ని గిగాబైట్ల సమాచారం అందుబాటులో ఉంటోంది.

ఏది చదవాలో, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్ధం చేసుకోవడం డిజిటల్ యుగంలో కష్టంగా ఉంటోంది.

గత నాలుగైదు రోజుల్లోనే ఇలాంటి విషయాలు రెండు చోటు చేసుకున్నాయి.

"చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హౌస్ అరెస్టు. అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం", "దేశవ్యతిరేక శక్తులను కలుస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ" లాంటి శీర్షికలు, ఇందుకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో, కొన్ని వార్తా మాధ్యమాల్లో కూడా కనిపించింది.

ఇలాంటి వదంతులు రాగానే, నిజానిజాల ధృవీకరణ జరగకముందే, సోషల్ మీడియాలో చర్చలు మొదలైపోతాయి. కొన్ని టీవీ చానెళ్లు డిబేట్లను మొదలుపెడతాయి.

వదంతులెక్కడి నుంచి పుట్టాయో తెలుసుకునే ప్రయత్నం జరగదు. ఇంతలో ఇదే సమాచారం వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి మాధ్యమాల్లో షేర్ అవుతూ ఉంటుంది.

ఇదే సమాచారాన్ని కొంత మంది ప్రముఖులు, సెలెబ్రిటీలు షేర్ చేస్తారు. దీంతో, వదంతులకు విశ్వసనీయత చేకూరుతుంది.

షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

అసలేం జరిగింది?

ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను హౌస్ అరెస్ట్ చేసి సైన్యం అధికారాన్ని చేపట్టిందంటూ తప్పుడు సమాచారం వ్యాప్తి చెందింది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యతిరేక శక్తులను కలిశారంటూ మరొక సమాచారం గత రెండు రోజులుగా ట్విటర్‌లో వైరల్ అయింది.

నిజానికి ఇవి రెండూ వార్తలు కావు. కానీ, ఈ సమాచారం మాత్రం వార్తా శీర్షికలను ఆక్రమించింది.

ప్రముఖుల ట్వీట్లు

ఇదే వదంతులను బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి ట్విటర్ లో షేర్ చేస్తూ "బీజింగ్‌లో జిన్‌పింగ్‌ను హౌస్ అరెస్టు చేసినట్లుగా వస్తున్న వదంతులను పరిశీలించాలి" అంటూ ఒక ట్వీట్ చేశారు.

"జిన్‌పింగ్ సమర్‌ఖండ్‌లో ఉండగా చైనీస్ కమ్మూనిస్టు పార్టీ నాయకులు ఆయనను పదవి నుంచి తొలగించి ఉండవచ్చు. ఆ తర్వాత ఆయనను హౌస్ అరెస్టు చేసినట్లు వదంతులు వచ్చాయి" అంటూ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మీరు ఈ వదంతులను మరింత వ్యాప్తి చేస్తున్నారా? అంటూ కొందరు యూజర్లు ఆయనను ప్రశ్నించారు.

సుబ్రహ్మణ్యం స్వామి చైనీస్ రచయత గోర్డన్ చాంగ్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.

"చైనాలో విమానాలను నిలిపేసిన తర్వాత సైనిక వాహనాలు బీజింగ్ వైపు వెళుతున్నాయి. సీనియర్ అధికారులను జైలులో బంధించారు. చాలా పొగ వస్తోంది. అంటే సీసీపీలో మంటలు చెలరేగాయి. చైనా సుస్థిరత దెబ్బతింది" అని గోర్డన్ చాంగ్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఆయన ట్వీట్‌తో పాటు విదేశాల్లో ఉంటున్న చైనీస్ యూ ట్యూబర్ జెన్నిఫర్ జెంగ్ సెప్టెంబరు 23న ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియో కూడా బాగా వైరల్ అయింది.

ఆమె చేసిన ట్వీట్‌లో "పీఎల్‌ఏ మిలిటరీ వాహనాలు బీజింగ్ వైపు వెళుతున్నాయి" అని ఉంది. ఈమె చేసిన ట్వీట్‌ను పలువురు రీట్వీట్ కూడా చేశారు.

అయితే, అతి తక్కువ మంది ఫాలోవర్లు ఉండే హ్యాండిళ్ల ద్వారా చైనా కూప్ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయినట్లు ‘లాజికల్లీ ఏఐ’ సంస్థలో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు అతాంద్ర రే ట్విటర్‌లో పేర్కొన్నారు.

"చైనా కూప్ అనే హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేసిన 2000కు పైగా అకౌంట్లను పరిశీలించినప్పుడు, 30 -700 మంది ఫాలోవర్లు ఉన్న అకౌంట్లు ఈ సమాచారాన్ని వ్యాప్తి చెందించడంలో కీలక పాత్ర పోషించాయని తేలింది" అతాంద్ర రే బీబీసీతో చెప్పారు.

"ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు, చైనా రాజకీయ నాయకత్వం పై ఉన్న అభిప్రాయం కూడా ఈ వార్తను మరింత ప్రచారమయ్యేలా చేసింది".

"ఒక ట్విటర్ యూజర్ 'చైనాలో సుమారు 60% విమానాలు రద్దయ్యాయి' అని లేవనెత్తిన వదంతిని సమాచారానికి విశ్వసనీయత కల్పించేందుకు ఆధారంగా చేసుకున్నారు" అని రే చెప్పారు. .

"ఆఫ్రికాకు చెందిన యూజర్లు కూడా చైనా కూప్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఈ సమాచారాన్ని మరింత వ్యాప్తి చేశారు. కొంత మంది తమ సొంత సందేశాలను ప్రచారం చేసుకోవడం కోసం కూడా ట్రెండింగ్‌లో ఉన్న ఈ కోడ్ వాడుకున్నారు" అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

భారత్ నుంచి ఈ ట్వీట్లు ఎక్కువగా జరిగాయని ఆయన అన్నారు.

ఈ వార్త ప్రముఖ అంతర్జాతీయ వార్తా మాధ్యమాల్లో కనిపించలేదు. చైనా ప్రభుత్వం లేదా సైన్యం ఈ విషయాన్ని ఎక్కడా ధ్రువీకరించలేదు, ఖండించలేదు.

కానీ, ఈ వదంతి చాలా పత్రికలకు వార్తగా మారిపోయింది.

చైనాలో మాజీ భద్రతా అధికారికి జైలు శిక్ష విధించారనే వార్త వచ్చిన తర్వాత ఈ వదంతులు రావడం మొదలయింది.

కొన్ని మీడియా సంస్థలు ఈ వదంతులను ఎక్కువగా రిపోర్ట్ చేశాయని బీబీసీ మానిటరింగ్ పేర్కొంది.

రిపబ్లిక్ టీవీ

ఫొటో సోర్స్, Republic TV Screen grab

ఈ ట్వీట్లను ఆధారంగా చేసుకుని భారతదేశంలో ప్రముఖ టీవీ చానెల్ రిపబ్లిక్ టీవీ ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ట్విటర్ లో ఒక జర్నలిస్ట్ షేర్ చేసిన ఫుటేజీని తమ సొంత ఫుటేజీ గా చెప్పుకుంది.

దీనికి ఆజ్యం పోస్తూ చైనాలో ఉన్న చానెల్ రిపోర్టర్ చైనా 10వేల విమానాలను రద్దు చేసిందని, ప్రభుత్వ మీడియా పూర్తిగా నిశ్శబ్దమైపోయిందని అన్నారు.

ఇవి వదంతులు మాత్రమేనంటూ కొన్ని మీడియా సంస్థలు ఈ వార్తలను తిప్పికొట్టాయి.

ఈ సమాచారాన్ని మొదట ఎవరు షేర్ చేశారనే విషయం పై స్పష్టత లేదు.

అమెరికాలో ఉండే చైనా యూట్యూబర్ జెన్నిఫర్ జెంగ్ షేర్ చేసిన వీడియో ట్విటర్‌లో ఎక్కువగా కనిపించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

సైనిక తిరుగుబాటు చేసి షీ జిన్‌పింగ్‌ని అరెస్టు చేసినట్లు విదేశాల్లో ఉన్న చైనీస్ మీడియా ప్రచురించడంతో ఈ వదంతులు మొదలైనట్లు సెప్టెంబరు 23న ది ప్రింట్ ప్రచురించింది.

రైట్ వింగ్ పత్రిక ఆప్ ఇండియా మాత్రం ఇవన్నీ వదంతులైనప్పటికీ చైనాలో ఈ దిశగా రాజకీయ సెగ రగులుతూ ఉండి ఉండొచ్చని రాసింది. విశ్లేషకులు వ్యాఖ్యానాలు కూడా చేశారు.

ప్రముఖ టీవీ చానెల్ 'టైమ్స్ నౌ' కూడా ఇవి వదంతుల్లా కనిపిస్తున్నాయి అంటూ రిపోర్ట్ చేసింది.

చైనాలో తిరుగుబాటు జరిగినట్లు ఆధారాలేవీ లేవని అవుట్‌లుక్ పత్రిక ఈ వదంతులను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది.

ట్వీట్

ఫొటో సోర్స్, AlTNEWS

ఎస్‌సీఓ సదస్సు తరువాత తొలిసారి బయట కనిపించిన షీ జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమర్కండ్ ఎస్‌సీఓ సదస్సు తరువాత తొలిసారి బహిరంగంగా కనిపించారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చూడటానికి ఆయన వచ్చారు.

ఊహాగానాలకు భిన్నంగా ఆయన బహిరంగంగా కనిపించడంతో ఆయన అరెస్టు కేవలం వదంతేనని తేలింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

రాహుల్ గాంధీ ఫొటో ఏంటి?

ఇదే మాదిరిగా సెప్టెంబరు 23న ఉత్తరప్రదేశ్ బీజేపీ ఐటీ సెల్ కో- కన్వీనర్ శశి కుమార్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి ఒక ట్వీట్ చేశారు.

ఇది కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించిన ట్వీట్.

భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కలిసిన ఒక అమ్మాయి ఫొటోను తప్పుడు సమాచారంతో ట్వీట్ చేశారు.

"రాహుల్ గాంధీతో కలిసి పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన అమ్మాయి నడుస్తోంది. ఆయన ఆ అమ్మాయిని దగ్గరగా హత్తుకున్నారు" అంటూ ట్వీట్ చేశారు.

సీఏఏ నిరసనల సమయంలో 2020లో బెంగళూరులో 'పాకిస్తాన్ జిందాబాద్' అని నినాదాలు చేసిన అమూల్య పాత వీడియోతో పాటు రాహుల్ కలిసిన అమ్మాయి ఫోటోను ట్వీట్ చేస్తూ, "రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా దేశ వ్యతిరేక శక్తులను కలుస్తున్నట్లున్నారు" అంటూ ట్వీట్ చేశారు.

ఈ ఫొటో శరవేగంగా వైరల్ అయింది. ఆ అమ్మాయి అమూల్య లియోనా అంటూ వదంతులు వ్యాప్తి చెందాయి.

బీజేపీ నేతలు, మద్దతుదారులు శశి కుమార్‌ను అనుసరించారు.

వీడియో క్యాప్షన్, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో ఎలా మోసం చేస్తున్నారు? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రీతి గాంధీ ట్వీట్

ఫొటో సోర్స్, AlTNEWS

"ఈ యాత్ర భారత్‌ ను ఐక్యపరిచేది కాకుండా విభజించేదిగా ఉంది" అంటూ బీజీపీ కార్యకర్త ప్రీతి గాంధీ ట్వీట్ చేశారు.

బీజేపీ దిల్లీ ఐటీ విభాగం అధిపతి పునీత్ అగర్వాల్ కూడా ఇదే మాదిరి ట్వీట్ చేశారు. మరో కార్యకర్త అశుతోష్ దూబె ఆయనను అనుసరించారు.

ట్వీట్

ఫొటో సోర్స్, AlTNEWS

రైట్ వింగ్ వెబ్ సైట్ క్రియేట్లీ మీడియా కూడా ఇదే సమాచారాన్ని ప్రచురించింది.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, RAHULGANDHI/FACEBOOK

రాహుల్ అమూల్యను కలవడం నిజమేనా?

ఈ సమాచారం తప్పని ఆల్ట్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్ తేల్చింది.

ఈ సమాచారం ఆధారంగా ఆల్ట్ న్యూస్ సెర్చ్ నిర్వహించినప్పుడు ఆ అమ్మాయి పేరు మివా జోలీ అని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిసింది.

ఆమె రాహుల్ గాంధీతో కలిసి ఉన్న ఫొటోను సెప్టెంబరు 21న తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఆమె కేరళ కాంగ్రెస్ స్టూడెంట్స్ యూనియన్ సభ్యురాలు.

విషయం నిజం కాదని తెలియడంతో ఈ ట్వీట్‌ను తర్వాత శశికుమార్ డిలీట్ చేశారు. కానీ, అప్పటికే ఆయన ట్వీట్ 136 సార్లు రీట్వీట్ అయింది. ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తే ఆ ట్వీట్ పూర్తిగా కనిపించకుండా పోయే అవకాశం లేదు.

వీటిని పరిశీలించే దృష్టి లేని వారు వీటిని నిజాలుగా భావించి అభిప్రాయాలను ఏర్పరుచుకునేందుకు ఎక్కువ సమయం పట్టదని విశ్లేషకులు అంటారు.

తప్పుడు సమాచారం తప్పా, ఒప్పా అని తేల్చుకునే ప్రయత్నం జరగదు.

ఫొటో సోర్స్, Getty Images

వీటి ప్రభావం ఎలా ఉంటుంది?

ట్వీట్లు చేసిన వారు తిరిగి వాటిని డిలీట్ చేసే సమయానికే కొన్ని వేల మందికి ఈ తప్పుడు సమాచారం షేర్ అయిపోతుంది. ఇది తప్పా, ఒప్పా అని తేల్చుకునే ప్రయత్నం జరగదు.

నేతలు, ప్రముఖులు ఏదైనా విషయాన్ని షేర్ చేసినప్పుడు, సాధారణ యూజర్లు షేర్ చేసినప్పటి కంటే ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఫ్యాక్ట్లీ మీడియా అండ్ రీసెర్చ్ వ్యవస్థాపకులు రాకేశ్ దుబ్బిడి అన్నారు.

"ప్రముఖులు షేర్ చేసే సమాచారనికుండే విశ్వసనీయత వల్ల వీరు షేర్ చేసిన సమాచారమంతా సరైందే అనే అభిప్రాయంతో ఉంటారు"

"ఈ వదంతులు రకరకాల రూపాలు మారి వాట్సాప్ లాంటి మాధ్యమాల్లో షేర్ అవుతాయి. వీటి ఆధారంగా వ్యాసాలు తయారవుతాయి. అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. ఒక్కొక్కసారి ద్వేషాన్ని కూడా పెంచుకునే అవకాశముంది" అని అన్నారు.

అవగాహన మాత్రమే పరిష్కారం

ఫొటో సోర్స్, Getty Images

"అవగాహన మాత్రమే పరిష్కారం"

"డిజిటల్ అవగాహన మాత్రమే వీటిని నిరోధించేందుకు మంత్రం. కానీ, దీనికొక సింగిల్ పరిష్కారం చెప్పలేం" అని రాకేష్ అన్నారు.

తప్పుడు సమాచారం షేర్ అయినప్పుడు కలిగే ప్రభావం గురించి ఆయన బీబీసీతో మాట్లాడారు.

"సమాచారాన్ని చదువుతున్నప్పుడు, షేర్ చేస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరం. సాధారణ పౌరులు ఈ సమాచారాన్ని షేర్ చేస్తున్నప్పుడు వీటి పరిణామాల గురించి ఆలోచించరు".

కానీ, ఎటువంటి మెసేజీని షేర్ చేసేటప్పుడైనా ఆ సమాచార మూలాలు తెలుసుకోవడం అవసరం. ఏదైనా విషయం అనుమానాస్పదంగా ఉన్నప్పుడు షేర్ చేసే ముందు పీఏఆర్‌ఐ(PARI) ఫార్ములాను పాటించడం అవసరమని అంటారు.

"పీ- పాజ్... అనుమానం వచ్చినప్పుడు ఆగడం, ఏ - ఆస్క్ - సమాచారం నిజమా కాదో తెలుసుకోవడం, ఆర్ - రీడ్ అండ్ రివ్యూ - చదవడం, సమీక్షించడం, ఐ - ఇంఫార్మ్ - నిజమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలి" అని సూచించారు.

"తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా సాధారణ ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసేందుకు ప్రచార సాధనాలుగా వాడుకునే ప్రమాదం ఉంది. ఇది సమాజంలో విభజనలకు దారి తీస్తుంది" అని రే అన్నారు.

ప్రముఖులు, నేతలు కూడా చేసిన ట్వీట్లు తప్పని తేలినప్పుడు ఆ ట్వీట్లను డిలీట్ చేస్తారు కానీ, అవి తప్పు అనే విషయాన్ని చెబుతూ మరొక ట్వీట్ చేయరు. దీంతో ప్రజలకు నిజమేంటో తెలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)