చైనా సైబర్ ఆర్మీ దాడులను భారత్ ఎదుర్కోగలదా?

ఫొటో సోర్స్, Getty Images
గత ఏడాది జూన్‌లో గల్వాన్ దగ్గర భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరగడానికి, ఆ తరువాత నాలుగు నెలలకు అంటే అక్టోబర్‌లో ముంబయిలోని ఒక పెద్ద పవర్ గ్రిడ్ ఫెయిలవడానికి మధ్య సంబంధం ఉందని, దీని వెనుక చైనా హస్తం కూడా ఉందనే విషయం తెర ముందుకు వచ్చింది.
"చైనా ప్రభుత్వానికి సంబంధించిన ఒక హాకర్ల గ్రూప్ మాల్‌వేర్ ద్వారా భారత్‌లో కీలకమైన పవర్ గ్రిడ్లను టార్గెట్ చేసుకుంది" అని అమెరికా, మసాచుసెట్స్‌లోని రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ తన రిపోర్టులో చెప్పింది.
రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ. వివిధ దేశాల ఇంటర్నెట్ వినియోగంపై ఇది అధ్యయనం చేస్తుంది. న్యూయార్క్ టైమ్స్ ఆ వార్తను ప్రచురించిన తర్వాత భారత్, చైనా రెండూ దానిపై స్పందించాయి.
కేంద్రం, మహారాష్ట్ర ఏం చెబుతున్నాయి
2020 అక్టోబర్‌లో ముంబయిలో పవర్ బ్లాకవుట్ కావడానికి చైనా లేదా పాకిస్తాన్‌కు చెందిన ఏదైనా సైబర్ దాడే కారణం అనడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"చైనా లేదా పాకిస్తాన్ సైబర్ దాడి చేశాయనడానికి మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కొంతమంది ఈ దాడులకు చైనా గ్రూప్ కారణం అంటున్నారు. కానీ, మా దగ్గర దానికి ఎలాంటి ఆధారం లేదు. చైనా కూడా దీనిని కచ్చితంగా ఒప్పుకోదు" అని ఆయన ఏఎన్ఐతో అన్నారు.
మరోవైపు, ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దర్యాప్తు చేసింది.
దీనిపై తమ సైబర్ పోలీసుల దర్యాప్తు నివేదికను బుధవారం అసెంబ్లీలో ఉంచనున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ చెప్పారు.
ఈ ఘటనకు సైబర్ దాడి కారణం కావచ్చని, మాల్‌వేర్ ద్వారా పవర్ గ్రిడ్‌ను టార్గెట్ చేశారని ఆ రిపోర్టులో చెప్పారు. దానితోపాటూ విదేశీ సర్వర్ లాగిన్ అయిన విషయాన్ని కూడా అంగీకరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"ఆ సైబర్ దాడి ముంబయి వరకే పరిమితం కాలేదు. దాని పరిధి దేశవ్యాప్తంగా ఉంది. మేం ఈ అంశాన్ని రాజకీయం చేయాలనుకోవడం లేదు. నేను మొత్తం అంశం మీద కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌తో మాట్లాడాను. ఆయన దీని గురించి సమాచారం అడిగారు. మమ్మల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు" అని దేశ్‌ముఖ్ అన్నారు.
గత ఏడాది అక్టోబర్ 12న ముంబయిలోని ఒక పెద్ద ఏరియాలో పవర్ గ్రిడ్ ఫెయిలవడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దాంతో ముంబయి చుట్టుపక్కల మెట్రో పరిధిలో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడింది. కరెంటు పోవడంతో లోకల్ రైళ్లకు, ఆస్పత్రుల్లో వైద్య సేవలకు, ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ఎలా స్పందించింది
ఈ ఆరోపణలపై చైనా కూడా తన వాదన వినిపించింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి దీనిపై ఒక ప్రకటన జారీ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"ఎలాంటి ఆధారాలూ లేకుండా ఒకరిపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. చైనా ఎప్పుడూ సైబర్ సెక్యూరిటీ పక్షాన నిలుస్తుంది. ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తుంది. సైబర్ సెక్యూరిటీ అంశంలో ఊహాగానాలకు ఎలాంటి పాత్రా ఉండకూడదు" అన్నారు.
చైనాపై అమెరికా ఆరోపణలు
చైనా మీద సైబర్ దాడుల ఆరోపణలు కొత్త కాదు. అమెరికా ఇంతకు ముందు కూడా చైనా సైబర్ దాడులకు పాల్పడిందని ఆరోపించింది.
తమ దేశంలోని ఐదు ప్రైవేటు కంపెనీలు, ఒక కార్మిక సంస్థకు సంబంధించిన అంతర్గత పత్రాలు, వ్యాపార రహస్యాలను చైనా ఆర్మీ అధికారులు దొంగిలించారని 2014లో అమెరికా ఆరోపించింది.
అంతే కాదు, అమెరికా విదేశాంగ శాఖ గత ఏడాది జులైలో హ్యూస్టన్, టెక్సస్‌లోని చైనా కాన్సులేట్లను మూసివేసింది. చైనా తమ మేథోసంపత్తిని చోరీ చేస్తోందని అమెరికా ఆరోపించింది.
చైనా ప్రభుత్వం చేసిన గూఢచర్యం, డేటా చోరీ అమెరికా భవిష్యత్తుకు అతిపెద్ద దీర్ఘకాలిక ముప్పుగా అప్పటి అమెరికా నిఘా ఏజెన్సీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ వర్ణించారు.
అమెరికాతోపాటూ ఆస్ట్రేలియా, వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు కూడా చైనా రకరకాల సైబర్ దాడులు చేసినట్లు ఆరోపించాయి.
ఇలాంటి సమయంలో, చైనా దగ్గర అంత సులభంగా సైబర్ దాడులు చేయగలిగేలా అసలు ఏముంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
చైనా సైబర్ ఆర్మీ
భారత్, చైనా సైబర్ ఆర్మీ గురించి విశ్లేషిస్తూ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన కార్తీక్ బొమాకాంతిక్ ఒక రీసెర్చ్ పేపర్ రాశారు.
చైనా దగ్గర ఇలాంటి సైబర్ దాడులు చేయడానికి ఒక ప్రత్యేకమైన దళం ఉందని, దానిని పీఎల్ఏ-ఎస్ఎస్ఎప్ అంటారని కార్తీక్ బీబీసీకి చెప్పారు.
"పీఎల్ఏ-ఎస్ఎస్ఎఫ్ అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్. 2015లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆర్మీలో ఎన్నో మార్పులు చేశారు. అప్పుడే దీనిని ఏర్పాటు చేశారు. ఎస్ఎస్ఎఫ్‌కు ఇలాంటి దాడులు చేసే పూర్తి పూర్తి సామర్థ్యం ఉంది. సెక్యూరిటీ ట్రెయిల్స్, టూల్స్, అనలిటిక్స్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ సాయంతో వాళ్లు అది చేస్తుంటారు" అన్నారు.
ఈ ఫోర్స్‌లో ఎంతమంది ఉన్నారు, దానికి హెడ్ ఎవరనే వాటిపై పక్కా సమాచారం బయటకు తెలీదు. ఒక అంచనా ప్రకారం ఈ ఫోర్స్‌లో ఉన్న వారి సంఖ్య వేలల్లో ఉంది.
"పీఎల్ఏలో జనరల్ స్థాయి అధికారి ఈ వింగ్‌కు హెడ్‌గా ఉన్నారు. రకరకాల వనరుల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఎస్ఎస్ఎఫ్‌తో నేరుగా సంబంధం లేకపోయినా, వారి ఆదేశాలతో పనిచేసే వారు కూడా ఆ దళంతో ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లలో హ్యాకర్స్ కూడా ఉంటారు. వారిని సైబర్ దాడులకు ఉపయోగిస్తారు. అందుకే, మనం సైబర్ దాడుల గురించి మాట్లాడితే, కొన్ని దాడుల్లో ఎస్ఎస్ఎఫ్ ఆర్మీకి ప్రత్యక్ష ప్రమేయం ఉండకపోవచ్చు అనేది కూడా గుర్తుంచుకోవాలి. కానీ, వారి అంగీకారంతో, మిగతా సాయంతో వాళ్లు ఆ దాడులు చేసుండవచ్చు" అన్నారు కార్తీక్.

ఫొటో సోర్స్, Getty Images
పవర్ గ్రిడ్‌పై సైబర్ దాడి
ముంబయిలో గత ఏడాది అక్టోబర్ 12న జరిగిన సైబర్ దాడి గురించి కూడా కార్తీక్ వివరించారు.
"దేశంలోని ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌లో చైనా వస్తువులు, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఉపయోగించినంత కాలం భారత్‌కు ఇలాంటి సైబర్ దాడుల ముప్పు ఉంటుంది. ముంబయి స్టేట్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌లో చైనా వస్తువులు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, మనం ఇలాంటి దాడులు చేయవచ్చని చైనాకు ఒక సంకేతం అందింది. మాల్‌వేర్ రూపొందించి, ఇలాంటి దాడులు చేయాలంటే, హ్యాకర్స్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్లు ఒక కోడ్ జెనరేట్ చేయాల్సుంటుంది" అని చెప్పారు.
నిజానికి మహారాష్ట్ర ప్రభుత్వ నివేదికలో కూడా మాల్‌వేర్, ట్రోజన్ లాంటి పదాలు ఉపయోగించారు. కేంద్ర విద్యుత్ మంత్రి కూడా తన ప్రకటనలో వీటి గురించి ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
మాల్‌వేర్ అంటే ఏంటి
ఇది ఒక సైబర్ హ్యాకింగ్ పద్ధతి
మాల్‌వేర్ అంటే ఒక సిస్టంలోని సమాచారం లేదా గణాంకాలను చోరీ చేయడానికి రూపొందించే ఒక సాఫ్ట్‌వేర్. ఈ ప్రోగ్రాంను సున్నితమైన గణాంకాలను చోరీ చేయడం, వాటిని డెలిట్ చేయడం, సిస్టం పనితీరు మార్చేయడం, ఆ సిస్టమ్‌తో పనిచేసే వ్యక్తిపై నిఘా పెట్టడం లాంటివి చేయవచ్చు.
ట్రోజన్ అనేది ఒక రకమైన మాల్‌వేర్. అది సెక్యూరిటీ సిస్టమ్‌ను దాటి బ్యాక్ డోర్ ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారా హ్యాకర్ మీ సిస్టమ్ మీద నిఘా పెట్టవచ్చు. అది స్వయంగా ఒక సాఫ్ట్‌వేర్‌లాగే కనిపిస్తుంది. ఏవైనా టాంపర్డ్ సాఫ్ట్‌వేర్‌లో కలిసిపోతుంది.
న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్‌లో భారత సైబర్ పీస్ ఫౌండేషన్ ప్రస్తావన కూడా ఉంది. గల్వాన్‌లో భారత-చైనా దళాల మధ్య హింసాత్మక ఘర్షణ తర్వాత దేశంలో సైబర్ దాడులు పెరిగాయని ఆ సంస్థ చెప్పింది.
సైబర్ పీస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ వినీత్ కుమార్‌తో బీబీసీ సైబర్ దాడుల గురించి మాట్లాడింది.
2020 నవంబర్ 20 నుంచి 2021 ఫిబ్రవరి 17 మధ్య తన పరిశోధనలో చైనా ఐపీ అడ్రస్ నుంచి క్రిటికల్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(పవర్ గ్రిడ్, ఆస్పత్రులు, రిపైనరీలు లాంటివి)పై సైబర్ దాడులు ఎక్కువయ్యాయని ఆయన చెప్పారు.
నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య అలాంటి 2 లక్షల 90 వేల హిట్స్ చూసినట్లు వినీత్ చెప్పారు. వాటి ద్వారా ఏ ఐపీ అడ్రస్ నుంచి సైబర్ దాడులకు ప్రయత్నిస్తున్నారో తాము గమనించామని, వాటిలో ఎక్కువగా చైనా ఐపీ అడ్రస్‌లు ఉన్నాయని తెలిపారు.
"ఈ రీసెర్చ్ సమయంలో కంప్యూటర్ల మీద సెన్సర్స్ పెడతాం. తర్వాత పూర్తిగా ఆస్పత్రి, పవర్ గ్రిడ్ లేదా రిఫైనరీ, రైల్వేల సర్వర్ లేదా వెబ్‌సైట్‌లాగే కనిపించే సర్వర్, నెట్‌వర్క్ లేదా వెబ్ సైట్లు రూపొందిస్తాం. వాటిపై దాడులు జరిగినపుడు, మా సెన్సర్ల ద్వారా ఏ దేశానికి చెందిన హ్యాకర్, దేనిని టార్గెట్ చేస్తున్నాడు అనేది తెలుస్తుంది" అని వినీత్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సైబర్ దాడులను అడ్డుకునే సత్తా భారత్‌కు ఉందా
ఇలాంటి సైబర్ దాడులను తిప్పికొట్టడానికి భారత్ దగ్గర రెండు సంస్థలు ఉన్నాయి.
వీటిలో ఒకటి భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ). దీనిని 2004లో ఏర్పాటుచేశారు. క్రిటికల్ ఇన్‌ఫర్మేషన్(ప్రభుత్వం నడపడానికి అవసరమైన సమాచారం) పరిధిలోకి రాని సైబర్ దాడులపై ఈ సంస్థ తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక రెండోది నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్(ఎన్‌సీఐఐపీసీ). ఇది 2014 నుంచి దేశంలో పనిచేస్తోంది. ఇది క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద జరిగే దాడులపై దర్యాప్తు చేయడం, వాటికి స్పందించడం చేస్తుంది.
భారత సైబర్ సెక్యూరిటీ చట్టాల గురించి అబ్జర్వర్ రీసెర్చ్ పౌండేషన్‌కు చెందిన తృషా వివరించారు.
"భారత్‌లో సైబర్ సెక్యూరిటీ చట్టం అని ప్రత్యేకంగా ఏదీ లేదు. ప్రస్తుతం ఐటీ యాక్ట్ కింద ఇలాంటి కేసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కాకుండా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ కింద కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవి సైబర్ సెక్యూరిటీకి అనుబంధంగా ఉన్నాయి. కానీ వాటిని కూడా చట్టం చేయడం మిగిలుంది. ఇవి కాకుండా, దేశం కోసం ఒక సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీని రూపొందించడం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ బాధ్యత. 2020 నాటికే అది పూర్తై ఉండాలి. కానీ ఇప్పటివరకూ అలా జరగలేదు. 2013లో చివరిసారి ఇలాంటి స్ట్రాటజీని రూపొందించారు. కానీ అప్పటికి, ఇప్పటికీ.. ఇలాంటి సైబర్ దాడుల టెక్నాలజీ చాలా మారిపోయింది" అన్నారు.

ఇవి కూడా చదవండి:
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం నమోదు: కోవిన్ యాప్, వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇలా.. ఏఏ ధ్రువపత్రాలు కావాలంటే
- కరోనావైరస్: ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సీన్ అందిస్తున్న భారతీయ కంపెనీ
- హాథ్రస్: కూతురిని వేధించారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపేశారు
- కరోనావైరస్: ఇండియాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి కారణమేమిటి.. మరో వేవ్ మొదలైందా
- కోవిడ్-19 టీకా వేయించుకున్న ప్రధాని మోదీ
- ఇథియోపియా టిగ్రే సంక్షోభం: బీబీసీ విలేకరిని నిర్బంధించిన సైన్యం
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








