సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదం: ఇక కారు వెనుక సీట్లో కూర్చున్న వారికి కూడా సీట్ బెల్ట్ తప్పనిసరి చేస్తారా?

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల కారు ప్రమాదంలో టాటా సంస్థల మాజీ అధినేత సైరస్ మిస్త్రీ మరణం తర్వాత రోడ్డు భద్రత, దానికి సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేసే అంశాలు చర్చలోకి వచ్చాయి. దేశంలో రోడ్డు రవాణా నిబంధనల ప్రకారం, ప్రస్తుతం కారు ముందు సీటులో కూర్చుంటున్న వారు మాత్రమే సీటు బెల్టు ధరించాల్సి ఉంది.
కానీ, కారు వెనుక సీటులో కూర్చుని ప్రయాణిస్తున్న వారు కూడా సీటు బెల్టులు ధరించకపోతే జరీమానా విధిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం అన్నారు. కార్ల ఉత్పత్తిదారులకు కూడా వెనుక సీట్లలో వారు బెల్టులు ధరించేందుకు అలారంలను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
"సైరస్ ప్రమాదానికి గురైన తర్వాత మేమీ నిర్ణయాన్ని తీసుకున్నాం. వెనుక సీట్లలో కూర్చున్న వారు బెల్టులు ధరించేవరకూ అలారం మోగుతూనే ఉంటుంది" అని గడ్కరీ అన్నారు.
ఆదివారం 54 ఏళ్ల సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఆయన ప్రమాదానికి గురై మరణించారు. ఆయన గుజరాత్ నుంచి ముంబయికు వెళుతున్నారు.
మిస్త్రీతో పాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా సీటు బెల్టు ధరించలేదని పోలీసు అధికారులు చెప్పినట్లు స్థానిక మీడియా కథనాలు చెప్పాయి.

ఫొటో సోర్స్, Getty Images
కారులో ప్రయాణం చేసేవారందరూ సీటు బెల్టులు ధరించాలని చట్టాలు చెబుతున్నాయి. కానీ, కారు వెనుక సీట్లలో కూర్చునే వారు బెల్టులు ధరించడం చాలా అరుదు.
ప్రతీ ఏటా భారత్ లో కొన్ని వందల వేల మంది రోడ్డు ప్రమాదాలకు గురై మరణిస్తూ ఉంటారు. 2021లో రోడ్డు ప్రమాదాలకు గురై 150,000 మందికి పైగా మరణించారు. దేశంలో సగటున గంటకు 18 మంది మరణిస్తున్నట్లు ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి.
ఈ సంఖ్య ఆందోళన కలిగించేదిగా ఉన్నప్పటికీ, రోడ్డు, వాహన భద్రత పై జాతీయ స్థాయి చర్చ మాత్రం అరుదుగా జరుగుతోంది
కానీ, మిస్త్రీ మరణం తర్వాత కొన్ని వేల మంది సోషల్ మీడియా యూజర్లు 3 సెకండ్ల వీడియో షేర్ చేశారు. వెనుక సీటులో కూర్చున్న ప్రయాణీకులు బెల్టు లేకుండా ఉండటం వల్ల ఏర్పడే ప్రభావం ఈ వీడియోలో కనిపిస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"నేను వెనుక సీటులో కూర్చున్నా కూడా సీటు బెల్టు ధరిస్తాను" అని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
రోడ్డు భద్రత ప్రాముఖ్యతను చెప్పినందుకు రవాణా మంత్రిత్వ శాఖ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలిపింది.
కానీ, రోడ్డు భద్రత విషయంలో తక్షణమే సరిదిద్దాల్సిన అంశాలను కొంత మంది హై లైట్ చేశారు.
"రోడ్ల నిర్మాణంలో ఉన్న లోపాలే" ఈ రోడ్డు ప్రమాదానికి కారణం అని డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి అన్నారు. వెడల్పుగా ఉన్న ఫ్లై ఓవర్ పై ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా మెలికలు తిరిగిన ఇరుకు సందులోకి రావడంతో డ్రైవర్ అయోమయానికి గురై ఉంటారని అన్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న హైవేలన్నిటి డిజైన్ ఒకేలా ఉండేలా చూస్తూ అవసరమైన చోట సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని మరి కొంత మంది నిపుణులు సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో రోడ్డు భద్రత అంత తేలికగా అర్ధమయ్యే అంశం కాదు.
అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులను ఉంచడాన్ని తప్పని సరి చేయాలని అనుకున్న ప్రభుత్వ ప్రణాళికలను భారతదేశంలో అత్యధికంగా కార్లను ఉత్పత్తి చేసే సంస్థ కూడా అంగీకరించలేదు. ఇలా చేయడం వారి ఉత్పత్తి ధరలను పెంచి చిన్న కార్ల మార్కెట్ ను దెబ్బ తీస్తుందని వాదించారు.
కానీ, మిస్త్రీ మరణం తర్వాత గడ్కరీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, వీటిని త్వరలోనే అమలు చేయవచ్చని అనిపిస్తోంది.
ఈ ప్రతిపాదనలు అమలైతే, కిక్కిరిసిన వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణం చేసే లక్షలాది మంది భారతీయుల ఆలోచనా ధోరణిని మార్చుకోమని పిలుపునిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- 269 మంది ప్రయాణీకులతో వెళ్తోన్న కొరియన్ విమానాన్ని సోవియట్ యూనియన్ పొరపాటున కూల్చినప్పుడు..
- హైటిజం: ఎత్తుగా ఉన్నవారికే ప్రమోషన్లు వస్తాయా, జాబ్లో ఎదగాలంటే ఎంత ఎత్తు ఉండాలి?
- నరేంద్ర మోదీని రాజులా, యోగిలా కొలిచిన నేపాలీ హిందువులు ఇప్పుడు ఏమంటున్నారు?
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













