స్క్విడ్ గేమ్ స్ఫూర్తితో ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రతపై ముంబయి పోలీసుల వినూత్న ప్రయత్నం

ఫొటో సోర్స్, NETFLIX
ఈమధ్యే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన కొరియన్ డ్రామా సిరీస్ 'స్క్విడ్ గేమ్' స్ఫూర్తితో ముంబయి పోలీసులు రోడ్డు భద్రతకు సంబంధించి ఓ సందేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఈ సిరీస్‌లో కొందరు వ్యక్తులు చిన్నపిల్లలు ఆడే గేమ్స్ ఆడుతుంటారు. మొదటి గేమ్‌లో ఒక పెద్ద బొమ్మ "రెడ్ లైట్", "గ్రీన్ లైట్" అని అరుస్తూ ఉంటుంది. 'రెడ్ లైట్' అని చెప్పిన తరువాత కదిలే ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోతారు.
ఈ గేమ్‌ను రోడ్డు ప్రమాదాల గురించి చెప్పేందుకు అనుగుణంగా వాడుకున్నారు ముంబయి పోలీసులు.
స్క్విడ్ గేమ్‌లో వచ్చే ఆట వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసి.."ఈ ఆటలో రోడ్డు మీద మీరే 'ఫ్రంట్‌మ్యాన్'. మిమ్మల్ని మీరే కాపాడుకోవచ్చు. రెడ్ లైట్ల దగ్గర ఆగండి" అనే సందేశాన్ని జతచేశారు.
ముంబయి పోలీసుల పోస్టు విపరీతంగా వైరల్ అయింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇది చాలా తెలివైన ఆలోచన అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
"సీసీటీవీ కెమేరాలకు బదులు ఈ బొమ్మ పెట్టండి.. అందరూ ట్రాఫిల్ నియమాలు కచ్చితంగా పాటిస్తారు" అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు.
స్క్విడ్ గేమ్ సిరీస్ సూపర్ హిట్ అయింది. ఇందులో చిన్నపిల్లల ఆటలా కనిపించే ఈ ప్రాణాంతకమైన ఆటను ఒక బృందం ఆడుతూ ఉంటుంది.
ఇది విడుదలైన తొలి 28 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 కోట్ల మంది వీక్షించారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
ముంబయి పోలీసులు ట్రెండ్‌ను పట్టుకున్నారు. ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతల గురించి హెచ్చరించేందుకు ఈ సిరీస్‌లో ఆటను బాగా ఉపయోగించుకున్నారు.
గతంలో కూడా ముంబయ్ పోలీసు శాఖ, టీవీ షోలను వినియోగించి భద్రతా సందేశాలను పంచుకున్న దాఖలాలు ఉన్నాయి.
పాపులర్ అమెరికన్ సిట్‌కామ్, ఫ్రెండ్స్, హ్యారీ పోటర్, రాపర్ డ్రేక్ ఆరవ స్టూడియో ఆల్బమ్, సర్టిఫైడ్ లవ్ బాన్‌తో సహా అనేక భారతీయ చలనచిత్రాలు, టీవీ షోలలోని క్లిప్స్ ఉపయోగించి ట్రాఫిక్ నియమాల గురించి, కోవిడ్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ గురించి సందేశాలు షేర్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- దసరా స్పెషల్: అమలాపురం వీధుల్లో కత్తులు, కర్రల ప్రదర్శన... ఈ ఆచారం ఏనాటిది, ఎలా వచ్చింది?
- రైతుల ఆందోళన: సింఘు బోర్డర్లో బారికేడ్లకు వేలాడుతూ కనిపించిన శవం
- సావర్కర్ బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోరాలని గాంధీ చెప్పారా? - BBC Fact Check
- బ్రిటన్ కన్సర్వేటివ్ ఎంపీ సర్ డేవిడ్ ఆమెస్కు కత్తిపోట్లు
- ఆంధ్రప్రదేశ్: విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందా, కరెంటు కోతలు ఇంకా పెరుగుతాయా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- జీ-20 సదస్సులో నరేంద్ర మోదీ: 'అఫ్గానిస్తాన్‌ను తీవ్రవాదానికి కేంద్రంగా మారనివ్వద్దు'
- వాతావరణ మార్పులు: కాప్-26లో భారత్, చైనా చేతులు కలిపి అమెరికానే ప్రతిఘటిస్తాయా?
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








