మునావర్ ఫారూఖీ కామెడీ షో రద్దు చేయాలంటూ హైదరాబాద్‌లో నిరసనలు.. ఇంతకీ ఎవరీ కమెడియన్, ఎందుకీ వివాదం?

కంగనా రాణావత్ నిర్వహించే ‘లాకప్’ షోలో మునావర్ విజేతగా నిలిచారు

ఫొటో సోర్స్, ALT BALAJI/TWITTER

ఫొటో క్యాప్షన్, కంగనా రాణావత్ నిర్వహించే 'లాకప్' షోలో మునావర్ విజేతగా నిలిచారు
    • రచయిత, పృథ్వీరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్‌లో శనివారం నిర్వహించనున్న ప్రదర్శన నేపథ్యంలో నగరంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రదర్శన జరిగే శిల్ప కళావేదిక వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు.

మునావర్ ఫారూఖీ గత ప్రదర్శనల్లో హిందూ దేవుళ్లను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. ఆయన షోను రద్దు చేయాలని కొన్ని సంస్థలు, కొందరు నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ తీవ్ర హెచ్చరికలు కూడా చేశారు.

షోను రద్దు చేయకపోతే దానిని అడ్డుకుంటామని, వేదికను దగ్ధం చేస్తామని కూడా ఆయన బెదిరించారు.

రాజాసింగ్ ఇంటివద్ద పోలీసులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

''ఏం జరుగుతుందో చూడండి. ఆ ప్రోగ్రాం ఎక్కడ జరిగినా మేం వెళ్లి అతడిని కొడతాం. అతడికి ఎవరు వేదికను ఇచ్చినా ఆ వేదికను దగ్ధం చేస్తాం. ఏదైనా జరగకూడదని జరిగితే అందుకు కేటీఆర్ (రాష్ట్ర మంత్రి), ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది'' అన్నారు.

ఆ షోను అడ్డుకోవటానికి టికెట్లు కొని వేదికలోకి వెళ్లాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఆయనను తెలంగాణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు కూడా తరలించారు.

శనివారం నాడు శిల్పకళావేదిక చుట్టూ సైబరాబాద్ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ బృందాలు, మాదాపూర్ జోన్ పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వు ప్లటూన్లను వేదిక వద్ద మోహరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మునావర్ ఫారూఖీ షోకు అనుమతివ్వటం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ''తెలంగాణలో కొందరు జోకర్ల బృందం నడుపుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ కామెడీ సర్కస్ చాలదన్నట్లుగా.. వాళ్లిప్పుడు మునావర్ ఫారూఖీని తెస్తున్నారు'' అని ఆయన ట్వీట్ చేశారు.

కామెడీ పేరుతో మునావర్, 'దేవుళ్లయిన రాముడు, సీతల'ను అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన కామెడీ షోకు అనుమతి ఇవ్వటం ద్వారా హిందువులకు ఇస్తున్న సందేశం ఏమిటని ప్రశ్నించారు.

''హిందూ దేవుళ్లను వెక్కిరించే ఈ షోను బహిష్కరించండి'' అన్నారాయన.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లో మునావర్ ఫారూఖీ షో రద్దయినట్లు రూమర్స్ వచ్చాయి. కానీ, శిల్పకళా వేదిక వద్ద పోలీసుల భద్రత కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో తన షో యధావిధిగా జరుగుతుందని మునావర్ ఫారూఖీ ధ్రువీకరించినట్లు కొందరు విలేకరులు సోషల్ మీడియాలో చెప్పారు.

అయితే.. శనివారం సాయంత్రం 6 గంటలకు మొదలుకావలసిన మునావర్ షోను భద్రతా కారణాల రీత్యా ఒక గంట ముందుకు జరిపినట్లు చెబుతున్నారు. అంటే, సాయంత్రం 5 గంటలకే షో ప్రారంభించారని బీబీసీ ప్రతినిధి అబ్బూరి సురేఖ బీబీసీ ఎఫ్‌బీ లైవ్‌లో ధ్రువీకరించారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

ఎవరీ మునావర్ ఫారూఖీ... ఏమిటీ వివాదం?

మునావర్ ఫారూఖీ వయసు 30 ఏళ్లు. గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఒక ముస్లిం కుటుంబంలో 1992లో పుట్టారు. 2002 గుజరాత్ అల్లర్లలో ధ్వంసమైన ఇళ్లలో తన ఇల్లు కూడా ఉందని మునావర్ కొన్ని వీడియోల్లో చెప్పారు.

2002 గుజరాత్ అల్లర్ల తర్వాత మునావర్ కుటుంబం ముంబైలోని డోంగ్రీకి వలస వెళ్లింది.

ఆ తర్వాత కొన్న రోజులకే మునావర్ తల్లి చనిపోయారు. తండ్రి కూడా జబ్బుపడటంతో 17 ఏళ్ల వయసులో చదువుకుంటూనే చిన్న చిన్న వస్తువులు అమ్మటం, గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేయటం చేసేవాడినని మునావర్ చెప్పారు.

ఆ క్రమంలో ఒక కామెడీ షో నిర్వహణ సంస్థ 'ద హెరిటేజ్' నిర్వహించిన ఒక ప్రదర్శన వద్ద.. వేదిక మీదకు ఎక్కి జోకులు వేయటానికి ఎవరూ సిద్ధంగా లేనపుడు మునావర్‌ను పిలిచారు. ఆయన చెప్పిన జోకులు హిట్ అయ్యాయి. దీంతో స్టాండప్ కమెడియన్‌గా మారారు.

మునావర్ ఫారుఖి

ఫొటో సోర్స్, ALTBALAJI

అతి స్వల్ప కాలంలోనే ఆయనకు సోషల్ మీడియాలో అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. ఆయన కామెడీ షో వీడియోలకు కోట్ల సంఖ్యలో వ్యూస్ ఉన్నాయి.

ముంబైలోని డోంగ్రీ ప్రాంతం మొదలుకుని, గుజరాత్ అల్లర్ల వరకూ అనేక అంశాలను మునావర్ ఫారూఖీ తన కామెడీ షోల్లో ప్రస్తావిస్తూ జోకులు వేస్తుంటారు. రాజకీయాలు, మతాలు, సామాజిక అంశాలను కూడా తన జోకులకు ఉపయోగించుకుంటారు.

ఆయన జోకుల్లో హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారంటూ పలు హిందుత్వ సంస్థలు నిరసనలు చేపట్టాయి. 2021 జనవరిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక కెఫేలో ప్రదర్శన ఇస్తున్న మునావర్‌ను ఇలాంటి ఫిర్యాదు మీద అరెస్ట్ చేశారు. ఆ తర్వాతి నెలలో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

అప్పటి నుంచీ ఆయన కామెడీ షోలు కొన్నిటిని పలు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పేరుతో రద్దు చేశారు.

మునావర్ ఫారుఖి

ఫొటో సోర్స్, INSTA/MUNAWAR FARUQUI

2022లో.. కంగనా రాణావత్ నిర్వహించే రియాలిటీ టెలివిజన్ షో 'లాకప్'లో పాల్గొన్న మునావర్ ఫారూఖీ ఆ షోలో విజేతగా నిలిచారు.

దేశంలోని పలు నగరాల్లో తన కామెడీ షోలు నిర్వహిస్తూ 'డోంగ్రీ టు నోవేర్' పేరుతో చేపట్టిన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో శనివారం నాడు ఆయన కామెడీ షో జరగాల్సి ఉంది.

దీనికి ముందు శుక్రవారం నాడు కర్ణాటకలోని బెంగళూరులో మునావర్ కామెడీ షో నిర్వహించాల్సి ఉంది.

అయితే.. ఈ షో హిందువుల మత మనోభావాలను గాయపరుస్తున్నాయని ఆరోపిస్తూ జైశ్రీరామ్ సేన సంఘటన్ అనే హిందుత్వ సంస్థ ఫిర్యాదు చేయటంతో కర్ణాటక పోలీసులు బెంగళూరు షోను రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి.

కానీ తన ఆరోగ్య కారణాల రీత్యా బెంగళూరు షోను రద్దయినట్లు మునావర్ పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

మునావర్ కామెడీ షోకు బెంగళూరు పోలీసులు అనుమతి నిరాకరించారని వార్తలు వస్తున్నప్పటికీ.. ఆరోగ్య కారణాల రీత్యా సమయానికి విమానం ఎక్కలేకపోయానని, కనుక తన షోను వచ్చే వారానికి రీషెడ్యూల్ చేస్తున్నామని ఆ కమెడియన్ చెప్పారు.

ఇక శనివారం నాడు జరగాల్సిన మునావర్ హైదరాబాద్‌ షోను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు తీవ్ర హెచ్చరికలు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

భారతీయ యువ మోర్చా కార్యకర్తలు శిల్పకళా వేదిక సమీపంలో నిరసనకు దిగటంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో.. ఇక్కడి పరిణామాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)