అగ్నిపథ్: అగ్నివీరులకు ఉద్యోగాలిస్తామన్న ఆనంద్ మహీంద్రాపై మాజీ సైనికాధికారులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?

ఫొటో సోర్స్, REUTERS/ANI
అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరే అగ్నివీరులకు నియామకాల్లో మహీంద్రా గ్రూప్ ప్రాధాన్యం ఇస్తుందన్న ఆనంద్ మహీంద్రాను మాజీ సైనికాధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు ఎంత మంది మాజీ సైనికులకు ఉద్యోగాలు ఇచ్చారో ఆ గణాంకాలు ఉంటే చెప్పండని అడిగారు.
'అగ్నిపథ్ పథకం కేంద్రంగా జరుగుతున్న హింసను చూస్తుంటే బాధేస్తోంది. అగ్నివీరులు పొందే నైపుణ్యాలు, అలవర్చుకునే క్రమశిక్షణ వారికి మెరుగైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఈ పథకం మీద పోయిన ఏడాది చర్చ మొదలైనప్పుడే నేను చెప్పా. అగ్నిపథ్ కింద శిక్షణ పొందే యువ అగ్నివీరులను రిక్రూట్ చేసుకునేందుకు మహీంద్రా గ్రూప్ సిద్ధంగా ఉంది' అంటూ ఆనంద్ మహీంద్రా ఇటీవల ట్వీట్ చేశారు.
కార్పొరేట్ సెక్టార్‌లో అగ్నివీరులకు భారీగా అవకాశాలున్నాయని ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు. 'లీడర్‌షిప్, టీం వర్క్, ఫిజికల్ ట్రైనింగ్‌తో రాటుతేలే అగ్నివీరులు కంపెనీల్లో పని చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ ఇలా అన్ని విభాగాల్లో వీరు సేవలందించగలుగుతారు.' అని ఆయన వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2
‘మేము సైతం...’
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు బదులిస్తూ తాము కూడా అగ్నివీరులకు ఉద్యోగాలిస్తామంటూ ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా తెలిపారు.
'అగ్నివీరులకు ఆర్‌పీజీ గ్రూప్ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఇతర కార్పొరేట్ కంపెనీలు కూడా మాలాగే అగ్నివీరులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చి, వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తాయని ఆశిస్తున్నా.' అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఆ తరువాత హర్ష గోయెంకా ట్వీట్‌పై బయోకాన్ సారథి కిరణ్ మజుందార్ షా స్పందించారు. 'జాబ్ మార్కెట్‌లో అగ్నివీరులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నా.' అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

ఫొటో సోర్స్, ANI
'మరి ఇంతవరకు ఎంత మందికి ఇచ్చారు?'
అగ్నివీరులకు ఉద్యోగాలిస్తామంటూ ఆనంద్ మహీంద్రా వంటి వారు చెప్పడం భిన్న స్పందనలు వస్తున్నాయి. ఇంత వరకు ఎంత మంది మాజీ సైనికులకు లేదా అధికారులకు ఉద్యోగాలిచ్చారంటూ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నించే వారిలో మాజీ సైనిక అధికారులు కూడా ఉన్నారు.
'ఇంత వరకు ఎంత మంది మాజీ సైనికులకు ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు చెబుతారా?' అంటూ ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించారు మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్.
'ఎందుకు ఈ కొత్త స్కీం కోసం వచ్చేదాక ఆగడం? ప్రతి ఏడాది రిటైర్ అవుతూ మరొక ఉద్యోగం కోసం ఎంతగానో ఎదురు చూసే... క్రమశిక్షణ, నైపుణ్యాలున్న వేలాది మాజీ సైనికులు లేదా ఆఫీసర్లకు మహీంద్రా గ్రూప్ అవకాశాలు కల్పిస్తోందా? అందుకు సంబంధించిన లెక్కలు చూపిస్తే బాగుంటుంది.' అంటూ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఇదే విషయంపై మాజీ ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహుదూర్ కూడా స్పందించారు. 'ఆనంద్ మహీంద్రా గారు, మాజీ నేవీ చీఫ్ అడిగినట్లుగా లెక్కలు చెప్పగలరా? ఇలాంటి మాటలు వింటూ 40 ఏళ్లపాటు పని చేసి నేను రిటైర్ అయ్యాను.' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANI
‘కనీసం స్పందన కూడా లేదు...’
తాను ఉద్యోగం కోసం మహీంద్రా గ్రూప్‌ను సంప్రదించినా కనీసం స్పందన కూడా లభించలేదని అభిషేక్ కుమార్ అనే ట్విటర్ యూజర్ ఆరోపించారు.
'నేనొక మాజీ నేవీ ఇంజినీర్. 2017 జులై 31న రిలీవ్ అయ్యా. నాకు తగిన ఉద్యోగం లభిస్తుందేమోనని మహీంద్రా గ్రూప్‌ను కలిశా. కానీ వాళ్లు నాకు జవాబు ఇవ్వలేదు. అయిదేళ్ల తరువాత నేటికీ నేను నిరుద్యోగిగానే ఉన్నా. ఇప్పుడు అకస్మాత్తుగా అగ్నివీరులకు ఉద్యోగాలిస్తామంటూ అన్ని కంపెనీలు చెబుతున్నాయి. వాట్ ఏ జోక్...' అంటూ అభిషేక్ కుమార్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
'మహీంద్రా గారు, ప్రతి ఏడాది 60 నుంచి 70వేల మంది సుశిక్షితులైన సైనికులు రిటైర్ అవుతున్నారు. వీరిలో ఎంత మందికి మీరు ఉద్యోగాలిచ్చారో చెప్పగలరా? మీ వద్ద ఏవైనా లెక్కలున్నాయా? అగ్నివీరులకు ఉద్యోగాలు ఇవ్వడం గురించి తరువాత మాట్లాడుకుందాం.' అంటూ కల్నల్ సలీం దుర్రానీ ప్రశ్నించారు.
'మహీంద్రా గారు, అమెరికా కార్పొరేట్ కంపెనీలను చూసి నేర్చుకోండి. మాజీ సైనికులకు వాళ్లు ఎలా సాయపడుతున్నారో చూడండి. మోదీ చెప్పడం వల్లే మీరు ఇప్పుడు ఈ మాటలు చెబుతున్నారు?' అంటూ మాజీ కల్నల్ అశోక్ కుమార్ సింగ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
లెక్కలు చెబుతున్న కథ వేరు...
ప్రభుత్వ విభాగాల్లో మాజీ సైనికులకు కేటాయించిన కోటాకు, వాస్తవంగా జరుగుతున్న రిక్రూట్‌మెంటుకు సంబంధం లేదని ది టెలిగ్రాఫ్ కథనం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్-సి ఉద్యోగాలకు 10శాతం, గ్రూప్-డి ఉద్యోగాలకు 20శాతం కోటాను మాజీ సైనికులకు కేటాయించారు.
కానీ 2021 జూన్ 30 నాటికి గ్రూప్-సిలో 1.29శాతం, గ్రూప్-డిలో 2.66శాతం మాత్రమే భర్తీ చేశారని డైరెక్టర్ జనరల్ రీసెటిల్‌మెంట్ గణాంకాలు చెబుతున్నాయి.
గత ఏడాది జూన్ 30 నాటికి దేశంలో 26 లక్షల 39వేల 20 మంది మాజీ సైనికులున్నారు. వీరిలో 22 లక్షల 93 వేల 378 మంది ఆర్మీ నుంచి, 2 లక్షల 7 వేల 534 మంది ఎయిర్‌ఫోర్స్ నుంచి, 1 లక్ష 38వేల 108 మంది నేవీ నుంచి రిటైర్ అయ్యారు.
ఇవి కూడా చదవండి:
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ముంబయిలోని కమాఠీపురా రెడ్ లైట్ ఏరియాలో ఒకప్పటి జీవితం ఇలా ఉండేది...
- యోగా ఎవరెవరు చేయొచ్చు.. ఎవరు చేయకూడదు.. అసలు దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి
- అగ్నిపథ్: ఇలాంటి సైనిక నియామకాల పథకం ఏఏ దేశాల్లో ఉంది? అక్కడి నియమ నిబంధనలు ఏమిటి
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)