మధ్యప్రదేశ్: గుక్కెడు నీళ్ల కోసం ప్రాణాలకు తెగిస్తున్న మహిళలు... వైరల్ వీడియో చెప్పిన వాస్తవం

వీడియో క్యాప్షన్, గుక్కెడు నీటి కోసం ప్రాణాలకు తెగిస్తున్న మహిళలు

ఎండిపోయిన బావిలో అట్టడుగున ఉన్న గుక్కెడు నీళ్ల కోసం ఇద్దరు మహిళలు మెట్లు లేని ఆ బావి గోడను పట్టుకుని పైకి ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

మధ్యప్రదేశ్‌ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కొరత ఎంత తీవ్రంగా ఉందనే విషయాన్ని.. ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్న ఈ మహిళల వీడియో కళ్లకు కడుతోంది.

మెట్లు లేని బావిలోకి నీటి కోసం దిగిన ఈ మహిళలు ఎలాంటి తాడు కూడా లేకుండా గోడను పట్టుకుని పైకి ఎక్కుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

ఈ వేసవిలో బావులు, చెరువులు ఎండిపోవటంతో ఘుసియా గ్రామ ప్రజలు తాగునీటి కోసం ఇలా ప్రాణాలకు తెగించాల్సి వస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

దేశంలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహాలో తీవ్ర నీటి కొరత నెలకొంది.

భారతీయులు, ముఖ్యంగా మహిళలు తాగు నీరు సంపాదించటం కోసం ప్రాణాలకు తెగించే ఇటువంటి వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి.

ఏప్రిల్ నెలలో కూడా మహారాష్ట్రలో ఒక మహిళ తాగు నీరు తేవటం కోసం ఒక బావిలోకి దిగుతున్న వీడియో వైరల్ అయింది.

2019లో విడుదలైన ఒక అంతర్జాతీయ నివేదిక ప్రకారం.. నీటి ఎద్దడి 'అత్యంత తీవ్రంగా' ఉన్న 17 దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది.

మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, హరియాణా రాష్ట్రాల్లో తాగునీటి సంక్షోభం అత్యధికంగా ఉన్నట్లు ఆ నివేదిక చెప్తోంది.

వైరల్ వీడియో

ఫొటో సోర్స్, ANI

మధ్యప్రదేశ్‌లో ప్రతి ఏటా నీటి కొరత తలెత్తుతూనే ఉంటుంది. 2024 సంవత్సరానికల్లా ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరు సరఫరా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ కోట్లాది మందికి తాగు నీరు అందుబాటులో లేదు.

ఈ పరిస్థితిపై ఘుసియా గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయటం కోసం.. ఈ ఏడాది జరుగబోయే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని వారు చెప్పారు.

''నీళ్లు తెచ్చుకోవటానికి మేం బావిలోకి దిగాల్సి వస్తోంది. ఇక్కడ మూడు బావులున్నాయి. అన్నీ దాదాపుగా ఎండిపోయాయి. చేతి పంపులు వేటిలోనూ నీళ్లు లేవు'' అని ఒక మహిళ ఏఎన్ఐ వార్తా సంస్థకు వివరించారు.

''ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడికి వస్తారు. ఈసారి మాకు నీటి సరఫరా సక్రమంగా జరిగే వరకూ ఓట్లు వేయకూడదని మేం నిర్ణయించుకున్నాం'' అని ఆమె తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

నీటి కోసం ఎన్నో అవస్థలు పడుతున్న ఈ మహిళల వీడియో గుండెలను పిండి చేస్తోందని సోషల్ మీడియాలో చాలా మంది భారతీయులు స్పందించారు. ఈ గ్రామానికి తక్షణమే సాయం చేయాలని అధికారులను కోరారు.

ప్రపంచంలో భూగర్భ నీటిని అత్యధికంగా తోడుతున్న దేశం భారతదేశమే. చాలా మంది ఇప్పటికీ తమ రోజువారీ నీటి అవసరాల కోసం భూగర్భ నీటి మీదే ఆధారపడి ఉన్నారు.

అయితే దేశంలోని మూడింట రెండు వంతుల జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయని ప్రపంచ బ్యాంక్ చెప్తోంది.

2050 నాటికి భారతదేశం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుందని.. దేశంలోని 30 ప్రధాన నగరాలు అధిక రిస్క్ ఉన్న ప్రాంతాల జాబితాలో చేరుతాయని అంచనా వేసింది.

వీడియో క్యాప్షన్, ‘నీటి వసతి లేని ఊరికి పిల్లనివ్వం’ అంటున్న జనం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)