చేతనా రాజ్: బరువు తగ్గించుకునే శస్త్రచికిత్స తరువాత మరణించిన కన్నడ నటి, అసలేం జరిగింది?

చేతనా రాజ్

ఫొటో సోర్స్, Bangalore News Photos

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ హిందీ కోసం

కన్నడ టీవీ నటి చేతనా రాజ్ బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. ఆమె బరువు తగ్గించుకునేందుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది.

గత సోమవారం ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత ఆమె ఊపిరితిత్తుల్లోకి నీరు చేరింది. ఫలితంగా ఆమె ఆరోగ్యం దెబ్బతింది.

‘‘ఆమెను ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేం కేసును దర్యాప్తు చేపడుతున్నాం’’అని బెంగళూరు పోలీస్ (ఉత్తర విభాగం) డిప్యూటీ కమిషనర్ అవినాశ్ పాటిల్ బీబీసీతో చెప్పారు.

‘‘ఫిర్యాదులో వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు వారు ఆరోపించారు. దీంతో సీఆర్‌పీసీలోని సెక్షన్ 174 కింద కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపడుతున్నాం’’అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, సిక్స్ ప్యాక్‌తో అబ్బురపరుస్తున్న 11 ఏళ్ళ అమ్మాయి

అసలేం జరిగింది?

‘‘గీత’’, ‘‘దొరస్వామి’’లాంటి సీరియల్స్‌లో నటించి చేతన గుర్తింపు తెచ్చుకున్నారు.

మొదట చేతనా రాజ్ పరిస్థితి గురించి ఒక వైద్యుడు పోలీసులకు సమాచారం అందించారు.

‘‘ఒక అనష్తీషియా నిపుణుడు అపస్మారక స్థితిలోనున్న చేతనను మా ఆసుపత్రికి తీసుకొచ్చారు’’అని ఆ వైద్యుడు పోలీసులతో చెప్పారు.

‘‘ఆమెకు గుండెపోటు వచ్చిందని మాత్రమే ఆ అనష్తీషియా నిపుణుడు చెప్పారు. వెంటనే మేం ఆమెకు వైద్యం అందించేందుకు ప్రయత్నించాం. అప్పటికే ఆమె మరణించారు’’అని ఒక డాక్టర్ చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, చేతనా గత సోమవారం బరువును తగ్గించుకునేందుకు లైపోసక్షన్ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.

వీడియో క్యాప్షన్, మీరు ఎన్నిరోజులకు ఒకసారి బెడ్‌షీట్లను మారుస్తారు/ఉతుకుతారు?

లైపోసక్షన్ అంటే ఏమిటి?

ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు లేదా శరీరంలో పేరుకున్న కొవ్వును తొలగించుకునేందుకు లైపోసక్షన్ శస్త్రచికిత్సను ఆశ్రయిస్తుంటారు.

ఈ శస్త్రచికిత్సతో దుష్ప్రభావాలు కూడా ఉంటాయని ఎప్పటికప్పుడే వైద్యులు హెచ్చరిస్తుంటారు.

లైపోసక్షన్ వల్ల కొవ్వు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ముప్పు ఉంటుంది.

ఈ శస్త్రచికిత్సలో భాగంగా శరీరంలోని భిన్న భాగాల్లో పేరుకున్న కొవ్వును వైద్యులు తొలగించేందుకు ప్రయత్నిస్తారు.

ముఖ్యంగా కొవ్వు వేరే ప్రాంతానికి వెళ్లే అవకాశంలేని తొడలు, కడుపు, పిరుదులు లాంటి శరీర భాగాల్లోని కొవ్వును శస్త్రచికిత్సతో తొలగిస్తుంటారు.

అయితే, కొన్నిసార్లు ఈ చికిత్సలు విఫలమై రోగి ప్రాణాలకే ముప్పు ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)