పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం, రాష్ట్రాలు ఎందుకు గొడవ పడుతున్నాయి, అసలు తగ్గించాల్సింది ఎవరు?

పెట్రోలు పై రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని మోదీ అన్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పెట్రోలు పై రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని మోదీ అన్నారు
    • రచయిత, అనంత్ ప్రకాశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు.

బుధవారం ముఖ్యమంత్రులతో సమావేశమైన మోదీ ''కేంద్రం గత ఏడాది నవంబర్‌లో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పన్ను తగ్గించాలని రాష్ట్రాలను అభ్యర్థించింది. నేను ఎవరినీ విమర్శించడం లేదు. కానీ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఝార్ఖండ్, తమిళనాడులను వ్యాట్ తగ్గించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను'' అని ప్రధాని అన్నారు.

ప్రధాని మోదీ ఈ ప్రకటన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కేంద్రం, రాష్ట్రాల మధ్య విమర్శలు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మల్లికార్జున్‌ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ పాలిత రాష్ట్రాలను కూడా కోరాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎక్సైజ్ సుంకాన్ని గరిష్టంగా పెంచడం ద్వారా ప్రధాని మోదీ 27 లక్షల కోట్ల రూపాయలు సంపాదించారని, కేంద్రం చమరుపై సబ్సిడీ ఇవ్వాలని, యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రతి సంవత్సరం లక్ష కోట్ల రూపాయల సబ్సిడీని ఇచ్చారని ఖర్గే అన్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ గురువారం ఈ అంశంపై తన వైఖరిని వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

''నిజం చేదుగా ఉంటుంది. కానీ, వాస్తవాలు అసలు కథ చెబుతాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 2018 సంవత్సరం నుండి రూ. 79, 412 కోట్లు పన్నుగా సంపాదించింది. ఈ సంవత్సరం రూ.33 వేల కోట్లు పొందుతుంది. (ఈ మొత్తం కలిపి రూ. 1,12,757 కోట్లు). పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగించలేదా?'' అని ట్విటర్ లో ప్రశ్నించారు.

''బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ లీటరుకు రూ.14.50 నుంచి రూ.17.50 వరకు ఉంది. కానీ ఇతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇది లీటరుకు రూ.26 నుంచి రూ.32 మధ్య ఉంటుంది. తేడా స్పష్టంగా కనిపిస్తోంది. వారి లక్ష్యం కేంద్రాన్ని విమర్శించడం తప్ప ప్రజలకు ఉపశమనం కలిగించడం కాదు'' అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, రూ.500 పెట్టి టికెట్ కొంటే, రూ.2.5 కోట్ల లాటరీ తగిలింది..
ఇంధనం మీ దగ్గరకు ఎలా వస్తుంది?

దీనితో పాటు, కొన్ని రాష్ట్రాల్లో మద్యం తక్కువ ధరలకు లభించడాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. విపక్షాల పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు తాము దిగుమతి చేసుకునే మద్యంపై కాకుండా ఇంధనంపై పన్నును తగ్గిస్తే పెట్రోల్ చౌకగా మారుతుందని ఆయన అన్నారు.

''మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.32.15, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో లీటరుకు రూ.29.10 పన్ను విధించింది. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ లీటరుకు రూ. 14.51 పన్ను విధించగా, ఉత్తర్‌ప్రదేశ్ లీటరుకు రూ.16.50 పన్ను విధించింది. విమర్శలు వాస్తవాలను మార్చలేవు" అన్నారాయన.

అయితే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గింపుకు బాధ్యత ఎవరిది? రాష్ట్రాలదా లేక కేంద్ర ప్రభుత్వానిదా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

పెట్రోల్ ధర ఎవరు తగ్గించగలరు?

ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా నిర్ణయిస్తాయో అర్థం చేసుకోవాలి. వివిధ రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

భారతదేశం ప్రతి సంవత్సరం తన ఇంధన వినియోగంలో 80 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు, అక్కడ నుంచి పెట్రోల్ పంపులకు చేరి అక్కడ రిటైల్ అమ్మకాలు జరుగుతున్నాయి.

పెట్రోల్‌ను కొనుగోలు చేసే బేస్ ధర, పంపుల దగ్గర విక్రయించే దగ్గరికి వచ్చేసరికి రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు, ఏప్రిల్ 16న దిల్లీలో పెట్రోల్ బేస్ ధర రూ.56.32 కాగా, రిటైల్ విక్రయ ధర లీటరుకు రూ.105.41గా ఉంది. పెట్రోల్ ధర రూ.56.32 నుండి రూ.105.41కి చేరుకోవడానికి ఫార్ములా క్రింది విధంగా ఉంది

బేస్ ప్రైస్ + ఎక్సైజ్ డ్యూటీ + వాల్యూ యాడెడ్ ట్యాక్స్ = పెట్రోల్ పంపుల దగ్గర పెట్రోల్ లేదా డీజిల్ ధర

ఈ విధంగా ఒక లీటరు పెట్రోలు అమ్మితే, ఎక్సైజ్ సుంకం రూపంలో వచ్చే డబ్బు కేంద్ర ప్రభుత్వానికి, వ్యాట్ ద్వారా వచ్చే డబ్బు అంటే విలువ ఆధారిత పన్ను రాష్ట్ర ప్రభుత్వాలకు వెళుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినందున, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించాలని, తద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

పెట్రోల్ ధరలు బేస్ ధర నుంచి కస్టమర్ దగ్గరికొచ్చేసరికి రెట్టింపు అవుతాయి

ఫొటో సోర్స్, EPA

రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదు?

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వ్యాట్‌ను తగ్గించలేకపోతున్నాయనే ప్రశ్న వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా విలువ ఆధారిత పన్ను(వ్యాట్), ఆస్తి పన్ను, మద్యంపై పన్నులు మొదలైన వాటి నుండి ఆదాయాన్ని పొందుతాయి. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ ద్వారా ఆదాయం వస్తుంది.

కానీ, జీఎస్టీ కింద వచ్చే ఆదాయం మొదట కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఆ తర్వాత కేంద్రం దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంచుతుంది. ఈ డబ్బును తిరిగి రాష్ట్రాలకు పంపిణీ చేసే విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది.

వీడియో క్యాప్షన్, ప్రాణాలు తీసే, విధ్వంసం సృష్టించే వడగళ్లు ఎలా ఏర్పడతాయో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన జీఎస్టీ సొమ్ము సకాలంలో అందడం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి.

''పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి రాష్ట్రాలు, కేంద్రం ఒకదానికొకటి సహకరించుకోవడం లేదు. రాష్ట్రాలు తమ స్థాయిలో ఎక్సైజ్, వ్యాట్ సుంకాన్ని తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించవచ్చు'' అని ఆర్ధిక వ్యవహారాల నిపుణుడు యోగేంద్ర కపూర్ అన్నారు.

కానీ, ఆ పన్నులను వదులుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడవని ఆయన అన్నారు.

''అది వారికి పాలిచ్చే ఆవు లాంటిది. దాన్ని వదులుకోవడం వారికి ఇష్టం ఉండదు'' అని ఆయన అన్నారు.

ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా పన్నుల రాబడి పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు

ఫొటో సోర్స్, Reuters

పరిష్కారం ఏమిటి?

జీఎస్టీ బకాయిల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఇది పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఈ ప్రశ్నకు యోగేంద్ర కపూర్ సమాధానమిస్తూ, తగ్గుతున్న ప్రజల ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

''దేశంలో ప్రజల సగటు ఆదాయం తగ్గిపోయిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. దాదాపు 4 కోట్లమంది జనాభా ఎగువ మధ్యతరగతి నుండి దిగువ తరగతికి చేరుకున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ప్రజలకు ఉపాధి, ఆదాయ మార్గాలను సృష్టించాలి. తద్వారా ప్రభుత్వ సహాయ పథకాలపై ప్రజల ఆధారపడటం తగ్గుతుంది'' అని కపూర్ అన్నారు.

పెట్రోలు, డీజిల్ వంటి వాటి ద్వారా ఆదాయాన్ని ఆర్జించడానికి ప్రయత్నించే బదులు, వారి ఆదాయం పెరిగేలా చేసి, జీఎస్‌టీ వసూళ్ల యంత్రాంగాన్ని వాటి స్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)