బ్రెజిల్: చుక్క కూడా మిగలకుండా పెట్రోల్ కొనేస్తున్న ప్రజలు.. ఖాళీ అయిపోతున్న బంకులు

ఫొటో సోర్స్, LAZAR WALL
పెట్రోలు బంకులో ఆయిల్ కొట్టించుకోవాంటే ఎంత సేపు పడుతుంది? ధరలు పెరిగినప్పుడు తప్పా సాధారణంగా అయితే పది నిమిషాలకు అటుఇటు.
ఇదంతా మన దగ్గర.
బ్రెజిల్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ ప్రజలు ఇంధనం కోసం గంటల తరబడి క్యూలలో నిరీక్షించాల్సి వస్తోంది. కొన్ని బంకులకు ఇంధనం సరఫరా కూడా ఆగిపోయింది. బ్రెజిల్‌లో పెట్రోలు ధరలపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలే ఇందుకు ప్రధాన కారణం.

ఫొటో సోర్స్, PAOLITA GONZALEZ
బంకులు ఖాళీ
బ్రెజిల్‌లో ఇంధన ధరలపై ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. 2016 నుంచి నేటి వరకు డీజిల్ ధరలు రెట్టింపయ్యాయి. దీనిపై లారీ డ్రైవర్లు స్ట్రైక్ చేస్తున్నారు. ఇంధనం కోసం రెండు మూడు పెట్రోలు బంకులు తిరిగినట్లు ఒక వ్యక్తి బీబీసీతో చెప్పారు.
లీమా నుంచి సౌ పోలోకు బస్సులో ప్రయాణించేటప్పుడు అక్కడి పరిస్థితులను పౌలిటా గోంజాలెజ్ ప్రత్యక్షంగా చూశారు. "ప్రజలు వీధుల్లో నిరసనలకు దిగారు. వారు దొరికిన వరకు పెట్రోలు అంతా కొనుగోలు చేస్తున్నారు. మేం మూడు బంకులకు వెళ్లాం. ఒకదానిలో ఇంధనమే లేదు. ఒక బంకు వద్దకు మేం వెళ్లిన పది నిమిషాల్లో 20 కార్లు, 40 బైకులు వచ్చాయి" అని పౌలిటా చెప్పారు.
బంకుల్లో ఇంధనం ఎంత లభిస్తే అంత కొనుగోలు చేసేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నట్లు పౌలిటా తెలిపారు.

ఫొటో సోర్స్, LAZAR WALL
15శాతం బంకుల్లోనే..
అయితే పరిస్థితిలో మెల్లగా మార్పులు వస్తున్నాయని రియో ది జనీరో నగర సమీపంలో గల ఇపనీమాలో నివసించే లజార్ వాల్ అంటున్నారు. పెట్రోలు బంకులను నిరంతరం నింపుతూ ఉన్నారని తెలిపారు. "ప్రస్తుతం 15 శాతం పెట్రోలు బంకుల్లోనే ఇంధనం ఉన్నట్లు, స్థానిక పత్రికల్లో వచ్చినట్లు" లజార్ చెప్పారు.
"నాణ్యత తక్కువగా ఉండే పెట్రోలు వెంటనే అమ్ముడుపోతోంది. నా కారులో ఇంధనం అయిపోవడం వల్ల, నేను పెద్దగా తిరగలేదు. వాహనాలు లేకపోవడంతో రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దుకాణాల్లో కూరగాయాలు, పండ్లు అయిపోతున్నాయి." అని లజార్ వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆన్‌లైన్‌లో మద్దతు
"#Isupportthetruckers'strike" అనే హ్యాష్ ట్యాగ్‌తో నిరసనలకు ఆన్‌లైన్‌లో కొందరు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు 5 లక్షలకుపై ట్వీట్లు వచ్చాయి. ధర్నాలు చేపట్టాక ప్రజల జీవితాలు కాస్త మెరుగుపడినట్లు ఒకరు ట్వీట్ చేశారు. పాలు, పండ్లు, కూరగాయల వంటి నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాల డ్రైవర్లు వాటిని ఉచితంగా పంచి పెడుతున్న చిత్రాలను మరొకరు ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇవి కూడా చదవండి
- పోలవరం: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?
- #UnseenLives: ఊళ్లలో కుల వివక్షను పేపర్ కప్ బద్దలుకొడుతోందా?
- #BeingDalit: హైదరాబాద్- 'దళితుడినైతే ఇల్లు ఇవ్వరా?'
- మహిళా రిపోర్టర్‌కు లైవ్‌లో ముద్దుపెట్టిన ఆటగాడు.. మహిళా రిపోర్టర్ల ఆగ్రహం
- అక్కడ లీటరు పెట్రోలు 67 పైసలే
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








