తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ @JaiTDP హ్యాక్.. ‘గ్రేట్ జాబ్’, ‘లవ్ దిస్’, ‘ఆసమ్’ అంటూ వందలాది స్పామ్ ట్వీట్లు

తెలుగుదేశం పార్టీ ట్విటర్ అకౌంట్ హ్యాక్
    • రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలుగుదేశం పార్టీ ట్విటర్ అధికారిక అకౌంట్ హ్యాక్ అయినట్లు ఆపార్టీ ప్రకటించింది. మార్చి 19వ తేదీ అర్థరాత్రి 2 గంటల 13 నిమిషాల నుంచి 23 నిమిషాల వరకు వందలాది స్పామ్ ట్వీట్లు ఈ ఖాతా నుంచి చేశారు. స్పేస్ ఎక్స్ ట్వీట్‌కు కామెంట్ల రూపంలో ఇవన్నీ చేసినట్లు కనిపిస్తోంది.

Presentational grey line

అకౌంట్ రీస్టోర్ చేస్తుండగా డీయాక్టివేట్ చేసిన ట్విటర్ - టీడీపీ ప్రకటన

తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో హ్యాక్ అయినట్టు ఆపార్టీ చెబుతోంది. దానిని గమనించిన టీమ్ వెంటనే అప్రమత్తమయ్యిందని వెల్లడించింది. పది నిమిషాల్లోనే అకౌంట్ తిరిగి కంట్రోల్‌కి తీసుకురాగలిగామని అంటోంది. హ్యాకర్స్ చేసిన మెసేజ్‌లు డిలీట్ చేస్తూ, అకౌంట్ రీస్టోర్ చేసే ప్రయత్నం చేశామని వివరించింది. ఈ నేపథ్యంలోనే ఆ అకౌంట్ హ్యాకింగ్‌కి గురయ్యిందనే విషయాన్ని గుర్తించిన ట్విటర్ తమ ఖాతాను అధికారికంగా డీయాక్టివేట్ చేసినట్టు వెల్లడించింది. దీంతో టీడీపీ అడ్మిన్ టీమ్‌కు కూడా యాక్సెస్ పోయిందని టీడీపీ శనివారం ఉదయం జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

అకౌంట్ మొత్తం రీస్టోర్ జరగాల్సి ఉండగా, డీ యాక్టివేట్ అయినందున ఆలస్యం అవుతోందని, వీకెండ్ కావడంతో ట్విటర్ సపోర్ట్ టీమ్ నుంచి కొంత జాప్యం జరిగిందని వెల్లడించింది. ట్విటర్ సపోర్ట్ టీమ్ తో కోఆర్డినేషన్ చేసుకుని అకౌంట్ రీస్టోరేషన్ ప్రక్రియ జరుగుతోందని, కొన్ని గంటల్లోనే అది పూర్తవుతుందని తెలిపింది.

Presentational grey line
తెలుగుదేశం పార్టీ ట్విటర్ అకౌంట్ హ్యాక్

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ట్విటర్ ఖాతా నుంచి స్టార్‌షిప్‌కు సంబంధించిన నాలుగు ఫొటోలను భారత కాలమానం ప్రకారం మే 19వ తేదీ అర్థరాత్రి 2.05 గంటలకు ట్వీట్ చేసింది.

తెలుగుదేశం పార్టీ ట్విటర్ అకౌంట్ హ్యాక్
తెలుగుదేశం పార్టీ ట్విటర్ అకౌంట్ హ్యాక్

ఆ ట్వీట్‌కు టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ‘గ్రేట్ జాబ్’, ‘లవ్ దిస్’, ‘ఆసమ్’ అంటూ కొన్ని వందల కామెంట్లు చేశారు. ప్రతి కామెంట్‌లోనూ ఆ రెండు ఇంగ్లీష్ పదాలతో పాటు నాలుగు ఇంగ్లీష్ అక్షరాలు ర్యాండమ్‌గా ఉన్నాయి. ఒకచోట అవి ‘ఆసమ్ ఇరాక్’ అని, మరొక చోట ‘ఆసమ్ సోము’ అని కనిపించాయి.

తెలుగుదేశం పార్టీ ట్విటర్ అకౌంట్ హ్యాక్

‘బ్రేకింగ్ న్యూస్, హర్రీ అప్’ అంటూ ఒక స్పామ్ లింక్‌ను కూడా పెట్టి ట్వీట్లు చేశారు.

తెలుగుదేశం పార్టీ 2011 మార్చిలో ఈ ట్విటర్ ఖాతాను ప్రారంభించింది. అప్పటి నుంచి 39 వేలకు పైగా ట్వీట్లు చేసింది. ఆ ట్వీట్లు ఏమీ ఇప్పుడు పేజీ ట్విటర్ ఫీడ్‌లో కనిపించట్లేదు.

ట్వీట్స్, రిప్లైస్ విభాగంలో మాత్రం మార్చి 18వ తేదీ రాత్రి 9 గంటల 11 నిమిషాలకు విజయవాడలో పాఠశాలల పరిస్థితులపై ఒక దినపత్రికలో ప్రచురించిన కథనాన్ని ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది.

నారా లోకేశ్ స్పందించారు

పునరుద్ధరిస్తున్నాం - నారా లోకేశ్

దీనిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూర్ సభ్యుడు నారా లోకేశ్ స్పందించారు.

తమ పార్టీ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, దీనిని తిరిగి పునరుద్ధరించేందుకు ట్విటర్ ఇండియాతో కలసి పనిచేస్తున్నామని ప్రకటించారు.

ఉదయం 7 గంటలకు ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేస్తూ.. ‘‘కొన్ని దుర్మార్గపు శక్తులు జైటీడీపీ (తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ పేరు)ని హ్యాక్ చేశాయి. దయచేసి గమనించండి’’ అని పేర్కొన్నారు.

పోలీసు కేసు గురించి ఆలోచించలేదన్న టీడీపీ

‘‘ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని తెలియగానే ట్విట్టర్ ఇండియాను అప్రమత్తం చేశాం. పునరుద్దరణ జరుగుతోంది. హ్యాకింగ్ ఎవరు పాల్పడ్డారు? అందుకు కారణాలేంటనేది తెలుసుకునే పనిలో ఉన్నాం. హ్యాకింగ్ ఎక్కడి నుంచి జరిగిందనేది నిర్ధరణ లేదు. పోలీస్ కేసు గురించి ఆలోచించలేదు. రాజకీయంగా టీడీపీ ఎదుగుదలను అడ్డుకునే యత్నాలు ఉన్నాయా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నాం. ఇటీవల మా పార్టీ కి సోషల్ మీడియాలో ఆదరణ పెరిగింది. దానిని సహించలేని వాళ్లే ఈ కుట్రకు పాల్పడి ఉంటారనే అభిప్రాయం ఉంది. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత స్పందిస్తాం’’ అని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి బీబీసీతో అన్నారు.

అదనపు రిపోర్టింగ్: శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం..

వీడియో క్యాప్షన్, హ్యాకర్ శాంటియాగో లోపెజ్ లక్షాధికారి ఎలా అయ్యారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)