కర్ణాటక: ‘రేప్‌ను ఎంజాయ్ చేయాలి’ అంటూ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రమేశ్ కుమార్ క్షమాపణలు

ఫొటో సోర్స్, Ani
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన రేప్ వ్యాఖ్యలపై మహిళా సభ్యుల నుంచి ఆగ్రహం వెల్లువెత్తడంతో క్షమాపణ కోరారు.
"లైంగికదాడి నుంచి తప్పించుకోలేం అని తెలిశాక, ఎంజాయ్ చేయాలి అని ఒక సామెత చెబుతారు. ఇప్పుడు మీరు కూడా సరిగ్గా అదే స్థితిలో ఉన్నారు" అని బుధవారం ఆయన అసెంబ్లీలో స్పీకరుతో అన్నారు.
ఇటీవలి వరదలతో పంటలకు జరిగిన నష్టం గురించి సభ్యులు మాట్లాడిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగెరీ సభలోని గందరగోళ పరిస్థితులపై నిస్సహాయత వ్యక్తం చేసినప్పుడు రమేశ్ కుమార్ ఈ రేప్ వ్యాఖ్య చేశారు.
"మీకు తెలుసా, రమేశ్ కుమార్. ఇప్పుడు జరుగుతున్నదంతా నేను ఆస్వాదించాల్సి ఉంటుంది. నేను ఈ స్థితిని చక్కదిద్దడానికి, మెరుగు పరచడానికి ప్రయత్నించకూడదని నిర్ణయించుకున్నా. నేను దీని ఫలితాన్ని చూస్తాను" అని స్పీకర్ అన్నారు.
అదే సమయంలో లేచి నిలబడిన రమేశ్ కుమార్ ఈ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దాంతో అసెంబ్లీ స్పీకర్ సహా సభలో ఉన్న సభ్యులందరూ పగలబడి నవ్వారు.
అయితే, దీనిపై సభలోని మహిళా సభ్యులు ఆగ్రహించడం, సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఆయన గురువారం క్షమాపణలు చెప్పారు.

ఫొటో సోర్స్, Ani
గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రమేశ్ కుమార్
రమేశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో సభలోని ఒక్క సభ్యుడు కూడా అభ్యంతరం లేవనెత్తలేదు. సరిగ్గా 2019 ఫిబ్రవరిలో కూడా ఇలాగే జరిగింది. అప్పడు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న రమేశ్ కుమార్ సరిగ్గా ఇలాగే కామెంట్ చేశారు.
అప్పట్లో ఒక అవినీతి కేసులో తన పేరు బయటికి రావడంతో రమేశ్ కుమార్ "తన పరిస్థితి ఒక అత్యాచార బాధితురాలిలా ఉంది" అన్నారు.
"ఆ రోజు నాపై ఒకసారి రేప్ జరిగింది. కానీ అత్యాచార బాధితులు అందరిలాగే నాకు కూడా మళ్లీ మళ్లీ రేప్‌కు గురైనట్లు అనిపిస్తోంది" అన్నారు.
రమేశ్ కుమార్ తాజా వ్యాఖ్య తర్వాత కాంగ్రెస్ సభ్యులు అంజలి నింబాల్కర్ లిఖిత పూర్వకంగా ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆయన సభలో క్షమాపణ కోరారు.
ఆయన తన క్షమాపణలో "నా వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీసుంటే, క్షమాపణలు అడగడానికి నాకు ఏ ఇబ్బందీ లేదు" అన్నారు.
"రమేశ్ కుమార్ తన వ్యాఖ్యకు క్షమాపణ కోరారని.. ఇక దీనిని మరింత పెద్దది చేయవద్దని" స్పీకర్ కాగెరీ అన్నారు.

ఫొటో సోర్స్, Ani
రమేశ్ కుమార్ వ్యాఖ్యపై ఎవరేమన్నారంటే..
అయితే, ఈ వ్యాఖ్యపై శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఒక ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"నిజంగా చాలా బాధేస్తోంది. ఇది క్షమాపణా". ఈ వ్యాఖ్యకు నవ్వుతూ దొరికిపోయారు కాబట్టి "దీనిని పెద్దది చేయకండి." అని స్పీకర్ కూడా అంటున్నారు" అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా దీనిపై ఒక ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మధ్య జరిగిన అభ్యంతరకరమైన సంభాషణను, అనుచిత వ్యాఖ్యను కాంగ్రెస్ పూర్తిగా ఖండిస్తోంది. కస్టోడియన్‌గా స్పీకర్, సీనియర్ నేతలు రోల్ మోడల్స్‌గా ఉండాలని భావిస్తారు. వారు ఇలాంటి ప్రవర్తనకు దూరంగా ఉండాలి" అన్నారు.
రమేష్ కుమార్ క్షమాపణ ఏమని అడిగారు.
"సభలో మాట్లాడేవారి సంఖ్య పెరిగిందని, మీకు కూడా బాధ కలుగుతోందని నిన్న మీరు అన్నారు. అందుకే, మీరన్న దానికి నేను మనం కూర్చుని దానిని ఆస్వాదించాలని ఒక ఇంగ్లిష్ సామెత చెప్పాను.. మహిళను అవమానించడం, లేదా సభ మర్యాదను కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. దానిపై జోకులు వేయాలని కూడా అనుకోలేదు. నాకు ఎలాంటి పరోక్ష ఉద్దేశం లేదు. కానీ నేను ఏ సందర్భంలో ఆ వ్యాఖ్య చేశానో దాని గురించి మర్చిపోయారు" అన్నారు.
"నన్ను నేను సమర్థించుకోను. అలాంటి పరిస్థితుల్లో మనకు తెలీకుండానే కొన్ని అనేస్తాం. నేను ఏది మాట్లాడినా ఎవరినీ నొప్పించాలని కాదు. కన్ఫ్యూషియస్ చెప్పినట్లు.. ఒక మనిషి తన తప్పును సరిదిద్దుకోకపోతే అతడు మరో తప్పు చేస్తాడు. నేను నా వ్యాఖ్యతో మనోభాలు దెబ్బతిన్న మహిళల సహా వారిని క్షమాపణ అడగడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. మనస్ఫూర్తిగా , బేషరతుగా ఇది చెబుతున్నాను" అన్నారు.
ఇందులో మిమ్మల్ని (స్పీకర్) కూడా ఇందులో తప్పు ఉందని చెబుతున్నారు. నన్ను దోషిగా గుర్తించి, తీర్పు కూడా ఇచ్చారు కాబట్టి క్షమాపణ అడుగుతున్నా. ఇక ఈ అంశాన్ని ఇక్కడితో ముగిద్దాం. దురదృష్టవశాత్తూ ఇందులో మీ పేరు కూడా ఉంది. అవసరమనిపిస్తే, మీరు కూడా దీనిపై మీ ప్రకటన చేయవచ్చు" అన్నారు.
సభలో చర్చ జరగలేదు
ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ కాగెరీ వెంటనే సభను సంభోదించడం ప్రారంభించారు. ఒక మహిళ మధ్యలో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు, ఆయన ఆమె అభ్యర్థన తోసిపుచ్చారు.
"ఆయన క్షమాపణ కోరారు. మనం సభ్యులందరం ఒక కుటుంబం లాంటి వాళ్లం. నిన్న నేను 'మనం పరిస్థితిని ఆస్వాదించాలి( చాలా మంది సభ్యులు మాట్లాడాలని అనుకుంటున్నారు కాబట్టి) అన్నాను. అప్పుడు రమేష్ కుమార్ ఆ వ్యాఖ్యలు చేశారు. అవి వివాదాస్పదం అయ్యాయి"
"మనమంతా మహిళలను గౌరవిస్తాం. మనం వారి గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకోడానికి ప్రయత్నిద్దాం. ఈ అంశాన్ని మరింత పెద్దదిచేసి, వివాదం సృష్టించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. మీరు బయట కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోరుతున్నా. సరే ఇక క్వశ్చన్ అవర్ ప్రారంభిద్దాం" అని స్పీకర్ అన్నారు.
కొందరు మహిళా సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తాలని ప్రయత్నించారు. కానీ, స్పీకర్ క్వశ్చన్ అవర్ సమయంలో ప్రశ్నలు అడగడానికి ముందు జాబితాలోని పేర్లు పిలవడం కొనసాగించారు.
దాంతో బీజేపీ, కాంగ్రెస్ మహిళా సభ్యులు సభలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ కలకలం సృష్టించారు.
రమేష్ కుమార్ వ్యాఖ్యపై కాంగ్రెస్ మహిళా సభ్యులు అంజలి నింబాల్కర్ బీబీసీతో మాట్లాడారు.
"ఇది సిగ్గుచేటు. ప్రజా ప్రతినిధులే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ప్రశ్న బీజేపీ లేదా కాంగ్రెస్ అనేది కాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇక పూర్తిగా ఆపేయాలి" అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు.
"రమేష్ కుమార్ మహిళల పట్ల చాలా అవమానకరమైన వ్యాఖ్య చేశారు. వాటిని ఖండిస్తున్నాం. ఆయన బహిరంగంగా క్షమాపణ అడగాలి" అన్నారు.
"స్పీకర్ కూడా ఆయన వ్యాఖ్యకు నవ్వారు కదా" అని మీడియా ఆయన్ను అడిగినప్పుడు "ఈ వ్యాఖ్యకు రమేష్ కుమారే బాధ్యుడు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ ఎమ్మెల్యే పూర్ణిమా శ్రీనివాస్ దీనిపై మీడియాతో మాట్లాడారు.
"మేం అసెంబ్లీలోకి వచ్చినపుడు సభ గురించి అవగాహన కోసం వారి వైపు చూస్తుంటాం. ఇప్పుడు ఆయన మనసులో మహిళల పట్ల ఎలాంటి గౌరవం లేదని అనిపిస్తోంది. స్పీకర్ కూడా నవ్వకుండా ఉండాల్సిందని నాకు అనిపిస్తోంది" అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రూపా శశిధర్ కూడా దీనిపై స్పందించారు.
"ఆయన అలాంటి మాటలు ఎందుకు ఉపయోగించారో నాకు తెలీదు. అలాంటి పరిస్థితిలో వారు బాధకు, షాక్‌కు గురవుతారు కాబట్టి మహిళలు దానిని స్వీకరించడం అంత సులభం కాదు. సభలో ఉన్నా, బయట ఉన్నా ఇలా మాట్లాడ్డం అలవాటు చేసుకుంటే, పదే పదే ఇలాంటివి జరుగుతాయి" అన్నారు.
ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు (సీసీ పాటిల్, లక్ష్మణ్ సావదీ, కృష్ణ పాలేమర్) తమ మొబైల్ ఫోన్లో సభలోనే పోర్నోగ్రఫీ చూస్తూ పట్టుబడిన ఘటనకు కూడా కర్ణాటక అసెంబ్లీ సాక్ష్యంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
- ఒమిక్రాన్: 11 రాష్ట్రాలకు పాకిన కొత్త వేరియంట్, బయటపడే మార్గం లేదా
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- రైతుల ఉద్యమం వాయిదాపడింది.. కానీ మోదీ ఇమేజ్ పెరిగిందా.. తగ్గిందా
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- మనుషులు నడవడం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎందుకు నడిచారు?
- ‘నీ సెక్స్ జీవితం ఎలా ఉంది అని అడిగారు, రేప్ చేసి చంపేస్తామనీ బెదిరించారు’
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు.. విశాఖపట్నంలో ఐసోలేషన్‌లో 30 మంది
- ఒక బాలిక యదార్థ గాధ: "నా చేతులు పట్టుకుని అసభ్యంగా... నేను వారికి అభ్యంతరం చెప్పలేక.."
- ‘రాత్రి 12 గంటలకు ‘బతికే ఉన్నావా’ అని మెసేజ్ పెట్టాను.. జవాబు రాలేదని ఫోన్ చేస్తే ఆయన స్నేహితులు ఎత్తారు’
- ‘నేను భారతీయ పైలట్‌నని తెలిసిన తరువాత కూడా ఆ పాకిస్తాన్ గ్రామస్థులు చికెన్‌తో భోజనం పెట్టారు’
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














