బెంగళూరు‌లో బొమ్మ పోలీసులతో ట్రాఫిక్ నియంత్రణ

ట్రాఫిక్ కానిస్టేబుల్ బొమ్మ

ఫొటో సోర్స్, ASIF SAUD

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ హిందీ, బెంగళూరు

భారతదేశంలోని రద్దీ నగరాల్లో ఒకటైన బెంగళూరులో నిబంధనలు పాటించని డ్రైవర్లను నియంత్రించడానికి వినూత్నమైన విధానాన్ని పరీక్షిస్తున్నారు.

ట్రాఫిక్ పోలీసుల యూనిఫాంలలో ఉన్న బొమ్మలను రోడ్లపై ఏర్పాటుచేస్తున్నారు.

పోలీసు టోపీ, తెల్ల చొక్కా, ఖాకీ రంగు ప్యాంట్, నల్ల కళ్లద్దాలున్న బొమ్మలు ఇప్పుడు రద్దీ కూడళ్లలో దర్శనమిస్తున్నాయి. దూరం నుంచి వాటిని చూడగానే పోలీసులున్నారని భావించి వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించడానికి వెనుకాడుతారని భావిస్తున్నారు.

భారత్‌లో ఐటీ ఇండస్ట్రీకి చిరునామా అయిన బెంగళూరులో 80 లక్షల రిజిస్టర్డ్ వాహనాలు తిరుగుతుంటాయి. 2022 నాటికి ఈ సంఖ్య కోటి దాటుతుందని అంచనా.

రద్దీ కారణంగా అతి తక్కువ వేగంతో వాహనాలు కదిలే భారత నగరాల్లో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. మూవిన్ సింక్ టెక్నాలజీస్ అధ్యయనం ప్రకారం ఇక్కడ సగటున గంటకు 18.7 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వాహనాలు కదులుతాయి. గంటకు 18.5 కి.మీ. సగటు వేగం ఉన్న ముంబయి తరువాత బెంగళూరే వాహనాలు నెమ్మదిగా కదిలే రెండో నగరం.

బెంగళూరులోని రహదారులు, కూడళ్లలో అమర్చిన సీసీ కెమేరాల్లో రోజుకు 20 వేలకు పైగా నిబంధనల ఉల్లంఘనలు కనిపిస్తాయి.

ట్రాఫిక్ కానిస్టేబుల్ బొమ్మ

ఫొటో సోర్స్, ASIF SAUD

అయితే, ఈ పోలీసు బొమ్మలు నిజంగానే ట్రాఫిక్ ఉల్లంఘనల సమస్యను పరిష్కరించగలవా..? అసలు పోలీసులకు ప్రత్యామ్నాయం కాగలవా అన్న విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

''ఈ బొమ్మలు బాగున్నాయి. బాగా దగ్గర నుంచి చూస్తేనే నిజం పోలీసు కానిస్టేబుళ్లు కాదని తెలుస్తాయి. కాబట్టి పోలీసులున్నారన్న భయంతో వాహనదారులు హెల్మెట్లు పెట్టుకుంటారు'' అన్నారు టి.గౌతమ్ అనే విద్యార్థి.

గౌతమ్, ఆయన సహ విద్యార్థి తలాహ్ ఫజల్‌లు ఇలాంటి ఒక కానిస్టేబుల్ బొమ్మతో సెల్ఫీ దిగారు.

శరవణ అనే ఆటో డ్రైవర్ తన ఆటోను 'నో పార్కింగ్' బోర్డు పక్కనే నిలిపారు.. ఆ పక్కనే ఈ కానిస్టేబుల్ బొమ్మ ఉంది. అయితే, సిగ్నల్ జంప్ చేయడం తగ్గుతుందని ఆయన అన్నారు.

ట్విటర్‌లో మాత్రం దీనిపై చలోక్తులు కురిపిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

సలీలా కప్పన్ అనే ఉద్యోగిని వీటి గురించి మాట్లాడుతూ ఇదంతా హాస్యాస్పదంగా ఉందన్నారు. ''రోడ్లపై ఉండే పోలీసులకు భిన్నంగా ఈ బొమ్మలు చాలా ఫిట్‌గా ఉన్నాయి'' అన్నారామె.

''ట్రాఫిక్ కానిస్టేబుళ్లుంటేనే ప్రజలు పట్టించుకోరు.. అలాంటిది ఈ బొమ్మలు చూసి వారు మారుతారనుకోను'' అన్నారామె.

బెంగళూరులోని సీనియర్ ట్రాఫిక్ పోలీసుల్లో ఒకరైన బీఆర్ రవికాంతె గౌడ మాట్లాడుతూ.. ''ఏదైనా కూడలిలో పోలీసు కనిపిస్తే ప్రజలు వ్యవహరించే తీరు వేరేగా ఉంటుంది. పోలీసులు ఉన్నప్పుడు, లేనప్పుడు వారి ప్రవర్తన పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా రోజుకో చోట పెడతాం'' అన్నారు.

కొన్నివారాలుగా వీటిని వాడుతున్నాం. ఇవి కనిపిస్తే ప్రజలు సిగ్నల్ జంప్ చేయడానికి కాస్త తటపటాయిస్తున్నారని మరో పోలీసు అధికారి తెలిపారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)