దిల్లీ: స్కూలు బ్యాగుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం... 43 మంది మృతి

ఫొటో సోర్స్, EPA
దిల్లీలోని రాణీ ఝాన్సీ రోడ్డులో ఉన్న అనాజ్ మండీలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ప్రమాదస్థలం నుంచి తమ సిబ్బంది మొత్తం 63 మందిని బయటకు తీసుకువచ్చారని, వారిలో 43 మంది చనిపోయారని దిల్లీ అగ్నిమాపక శాఖ చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గర్గ్ తెలిపారు.
మృతుల్లో ఎక్కువ మంది 15 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న యువకులేనని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదానికి గురైన భవనంలో స్కూలు బ్యాగుల తయారీ కేంద్రం నడుస్తున్నట్లు ఘటనాస్థలానికి వెళ్లిన బీబీసీ ప్రతినిధి దిగవల్లి పవన్ తెలిపారు.
ఘటనాస్థలానికి 26 అంబులెన్స్‌లు చేరుకున్నాయని, క్షతగాత్రులైన 46 మందిని దిల్లీలోని నాలుగు ఆసుపత్రులకు తరలించాయని వైద్య శాఖ వెల్లడించింది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన అన్నారు.
గాయపడ్డవారి వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్ర గాయాలపాలైనవారికి రూ.50 వేల చొప్పున ప్రధాని మోదీ సాయం ప్రకటించారు.
సదార్ బజార్ అనే పెద్ద మార్కెట్‌లోని ఇరుకైన వీధుల్లో ఈ భవనం ఉంది. దీంతో అక్కడికి చేరుకుని, మంటలు ఆర్పడం అగ్నిమాపక సిబ్బందికి కష్టమైంది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. భవన యజమానిపై సెక్షన్ 304-ఎ కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రమాదం గురించి తెల్లవారు జామున 5.22కి తమకు మొదటగా సమాచారం వచ్చినట్లు అగ్నిమాపకశాఖ సిబ్బంది చెప్పారు.
మంటలను అదుపు చేసేందుకు దాదాపు 25 అగ్నిమాపక వాహనాలు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందం కూడా రంగంలోకి దిగిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఘటనాస్థలంలోపలికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండటంతో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు చేరుకోవడం కష్టమైందని అతుల్ గర్గ్ అన్నారు.
ప్రమాదంలో చిక్కుకున్నవారిని అగ్నిమాపక సిబ్బంది భుజాలపై బయటకు మోసుకురావాల్సి వచ్చిందని చెప్పారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో సహాయ చర్యలకు ఇబ్బంది కలిగిందని వివరించారు.
మంటలను నియంత్రించామని సహాయ చర్యల్లో పాలుపంచుకున్న ఓ అధికారి మీడియాకు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ అగ్ని ప్రమాద ఘటన తీవ్ర విషాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, ఘటనాస్థలంలో అవసరమైన సహాయ చర్యలను సంబంధిత శాఖలు అందిస్తున్నాయని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మృతుల కుటుంబాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో ఉన్నవారికి తక్షణమే సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ప్రమాద ఘటనపై విచారణ జరుగుతుందని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని దిల్లీ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు.
ఇవి కూడా చదవండి.
- హైదరాబాద్ ‘ఎన్కౌంటర్’: సీన్ రీ-కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెలంగాణలో రేప్ నిందితుల వరకు.. ఎన్కౌంటర్లలో నిజమెంత
- నిందితులను చంపేస్తే దేశమంతటా ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు
- హైదరాబాద్ ఎన్కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు
- పెళ్లి వేడుకలో డాన్స్ మధ్యలో ఆపినందుకు యువతి ముఖంపై తుపాకీతో కాల్చారు
- మహాసముద్రాల్లో ఆక్సిజన్ తగ్గిపోతోంది
- BBC Exclusive: ఎయిర్టెల్ సమాచార వ్యవస్థలో లోపం.. 32 కోట్ల మంది సమాచారం లీకయ్యే ప్రమాదాన్ని సరిదిద్దామన్న సంస్థ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)