పెళ్లి వేడుకలో డాన్స్ మధ్యలో ఆపినందుకు యువతి ముఖంపై తుపాకీతో కాల్చారు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి

ఫొటో సోర్స్, SUSHEEL SHUKLA

పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ మధ్యలో ఆపేసిందని ఓ యువతి ముఖంపై తుపాకీతో కాల్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో గమనిస్తే, స్టేజ్‌పై యువతి డ్యాన్స్ చేస్తూ ఆపేయగానే తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. తర్వాత ఆ యువతి స్టేజ్ మీద పడిపోయింది.

యువతిపై కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించామని పోలీసులు బీబీసీకి చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలోని టికారా గ్రామంలో డిసెంబర్ 1న గ్రామాధిపతి కుమార్తె పెళ్లి వేడుకలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాతే వెలుగులోకి వచ్చింది.

''కాల్పులకు పాల్పడిన వ్యక్తి పరిగెత్తడం ఆ వీడియోలో చూసి గుర్తించాం'' అని పోలీసులు తెలిపారు.

మహిళా డాన్సర్ పరిస్తితి విషమంగా ఉండడంతో కాన్పూర్ ఆస్పత్రిలో చేర్పించారు.

యూపీ

పోలీసుల కథనం

చిత్రకూట్ ఎస్పీ అంకిత్ మిట్టల్, "బులెట్ పేల్చిన వ్యక్తిని గుర్తించాం. అతను కౌశాంబీ జిల్లాలోని రాణీపూర్ గ్రామవాసి అని తెలిసింది. మేం రెండు బృందాలు అతని కోసం వెతుకుతున్నాం. త్వరలోనే పట్టుకుంటాం" అన చెప్పారు.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లి వేడుకల్లో హింస సర్వసాధారణంగా కనిపిస్తుంది. పెళ్లి సంబరాలను జరపుకునేందుకు కొందరు అతిథులు గాలిలోకి కాల్పులు జరపుతుంటారు.

2016లో పంజాబ్‌లో ఇదే తరహా ఘటన జరిగింది. పెళ్లి వేడుకల్లో తుపాకీ పట్టుకొని డ్యాన్స్ చేయడంతో అది కాస్తా పేలి గర్భిణి మృతి చెందింది.

అదే ఏడాది, హరియాణాలో జరిగిన ఒక పెళ్లి వేడుకల్లో కాల్పులు జరపడంతో, వరుడి అత్తతో సహా ముగ్గురు చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)