సజ్జనార్: అప్పుడు, ఇప్పుడు ఈయనే...

ఫొటో సోర్స్, ugc
దిశ అత్యాచారం, హత్య కేసులోని నలుగురు నిందితులు ఈరోజు తెల్లవారుఝామున చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు తెలంగాణ పోలీసులు చెప్పారు.
సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నిందితులను ఘటనా స్థలంలోకి తీసుకెళ్లగా, తప్పించుకొని దాడి చేయడానికి ప్రయత్నించగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
11 ఏళ్ల కిందట వరంగల్‌లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ఈ రెండు ఘటనల్లోనూ పోలీసు అధికారి వీసీ సజ్జనార్ కీలకంగా వ్యవహరించారు.

అప్పుడు వరంగల్‌లో ఏం జరిగిందంటే..
11 ఏళ్ల కిందట, 2008 డిసెంబర్ 10న వరంగల్‌లోని కిట్స్ కళాశాలలో బీటెక్ చేస్తున్న స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి జరిగింది.
స్వప్నిక తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో సహచర విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో ప్రణీత తీవ్రంగా గాయపడగా, స్వప్నిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
సంచలన సృష్టించిన ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రమంతటా ఆందోళనలు జరిగాయి. నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్లు వినిపించాయి.
అప్పుడు వరంగల్ ఎస్పీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
యాసిడ్ దాడి ఘటనలో ముగ్గురు యువకుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత సజ్జనార్ నేతృత్వంలోని పోలీసుల బృందం నిందితులు శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణలను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లారు.
అయితే, ఘటనా స్థలానికి తీసుకెళ్లిన తర్వాత నిందితులు తమ నుంచి ఆయుధాలు లాక్కొని దాడి చేయడానికి ప్రయత్నించారని, ప్రతిదాడిలో ముగ్గురిపై కాల్పులు జరపడంతో వారు చనిపోయారని పోలీసులు వెల్లడించారు.
నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత సజ్జనార్ బృందాన్ని స్థానికులు అభినందించారు. మానవ హక్కుల సంఘాలు ఈ ఘటనను ఖండించాయి.
2007లోనూ వరంగల్ కాశిబుగ్గకు చెందిన 11 ఏళ్ల బాలిక మండ మనిషాను కిడ్నాప్ చేసి హత్యచేసిన ఘటనలో ముగ్గురు నిందితులను ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామం వద్ద ఎన్‌కౌంటర్ చేశారు.
ఐపీఎస్ అధికారిణి సౌమ్య మిశ్రా అప్పుడు వరంగల్ ఎస్పీగా ఉన్నారు.

అదే పోలీస్.. అదే తరహాలో..
వరంగల్ యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన తరహాలోనే దిశ నిందుతుల ఎన్‌కౌంటర్ జరిగింది.
రెండు ఘటనల్లోనూ నిందితులు సీన్ రీ కన్‌స్ట్రక్చన్ తర్వాతే, తెల్లవారుజామునే ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.
వరంగల్ ఎన్‌కౌంటర్‌లో స్వయంగా పాల్గొన్న నాటి ఎస్పీ సజ్జనార్ దిశ ఎన్‌కౌంటర్ ఘటనలో స్వయంగా పాల్గొనకపోయినప్పటకీ ఆయన ఆధ్వర్యంలోనే ఈ కేసు విచారణ జరుగుతోంది.
ఈ ఎన్‌కౌంటర్‌పై ఆయన బీబీసీతో మాట్లాడూతూ, "సీన్ రీ కన్ స్ట్రక్ట్ చేస్తుండగా నిందితులు తిరగబడ్డారు. పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేయగా నలుగురూ చనిపోయారు. ఇప్పటివరకు ఇదీ మాకు తెలిసిన సమాచారం. మిగతా వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తరువాతే ధ్రువీకరించగలను. ఈ ఘటనలో మా పోలీసులు ఇద్దరికి గాయాలయ్యాయి' అని చెప్పారు.

ఫొటో సోర్స్, ugc
ఎవరీ సజ్జనార్
కర్నాటకకు చెందిన విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ 1996 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పోలీసు అధికారిగా పనిచేశారు.
వరంగల్, మెదక్, నల్లగొండ, కడపలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. కొన్నాళ్లు ఇంటెలిజెన్స్ ఐజీగానూ పనిచేశారు.
2018లో సైదరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.
వరంగల్‌లో యాసిడ్ దాడి చేసిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సమయంలో ఆయన ఆ జిల్లా ఎస్పీగా ఉన్నారు.
మెదక్‌లో ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఓ కానిస్టేబుల్‌ను హత్య చేసిన గంజాయి స్మగ్లర్‌ను ఎన్ కౌంటర్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ... మరికొందరి ఖండన
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసు అధికారి సజ్జనార్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. మరికొందరు ఈ ఘటనను ఖండించారు. తక్షణ న్యాయం పేరుతో ఇలా చేస్తే మాన హక్కులు, రాజ్యాంగం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
కొంతమంది తమ వాట్సాప్ స్టేటస్‌గా ఆయన రివాల్వర్ పట్టుకున్న ఫొటోను పెట్టుకున్నారు. వరంగల్ ఘటనను పునరావృతం చేశారంటూ మరికొందరు ఆయనను గుర్తు చేసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
వాస్తవానికి, దిశ ఘటన జరిగిన వెంటనే చాలా మంది నెటిజన్లు సజ్జనార్‌ను ఉద్దేశిస్తూ, మీరు వరంగల్‌లో చేసిన మాదిరిగానే వీరిని కూడా ఎన్‌కౌంటర్ చేయాలంటూ పోస్టులు పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''ఆ బుల్లెట్ దాచుకోవాలని వుంది ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది. నలుగురు చచ్చారు అనే వార్త లో ఇంత కిక్కు వుందా..?? ఈ రోజే నే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..!'' అంటూ సజ్జనార్ ఫొటోతో సినీనటుడు మంచు మనోజ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
‘‘ఇది న్యాయం కాదు, పోలీసులు చట్టాన్ని అతిక్రమించారు. ఇది ప్రమాదకరం’’ అంటూ డిసౌజా అనే జర్నలిస్టు ట్వీట్ చేశారు.
పోలీసులు ఇలా చేసి ఉండకూడదని, కోర్టు ద్వారా వారి నేరాలు నిరూపణ జరిగి, శిక్ష పడి ఉండాల్సిందని కూడా కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు.

"తెల్లవారుఝామున 3.30 గంటలకు సీన్ రీకన్‌స్ట్రక్షన్ అంటే నమ్మలేకపోతున్నాం. మొత్తానికి జరిగిన దారుణ నేరానికి నిందితుల ఎన్‌కౌంటర్‌తో ముగింపు పలికారు" అని జీవన్‌లాల్ వెలగ అనే యూజర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్థిక వృద్ధి అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి
- పిల్లలను ఎత్తుకెళ్తున్నారన్న వదంతులతో గర్భిణిపై దాడి
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- మోదీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ. 1.76 లక్షల కోట్ల నిధులు ఎందుకు తీసుకుంది?
- దళితుడి శవాన్ని వంతెన మీంచి కిందకు తాళ్ళు కట్టి ఎందుకు దింపారు...
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








