'దిశ' తల్లి: 'నా బిడ్డ కూడా ఒక చెల్లిలాంటిదేనని వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే... ఈరోజున వాళ్ళ తల్లులకు కూడా కడుపుకోత ఉండేది కాదు'

దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసు ఎన్‌కౌంటర్లో చనిపోయారు. ఆ విషయం తెలిసిన తరువాత 'దిశ' తల్లి స్పందన ఆమె మాటల్లోనే:
"ఆ అబ్బాయిలు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే.. నా అక్క, నా చెల్లిలాంటిదే కదా అని అనుకుని ఉంటే అక్కడ ఆ నలుగురు తల్లులు, ఇక్కడ నేను ఇవాళ ఇంత బాధపడే పరిస్థితి వచ్చేది కాదు. వాళ్లకు అలా అయినందుకు కూడా నేనెంతో బాధ పడుతున్నాను.
మా అమ్మాయి ఎంతో మంచిది. ఆమె ఎంతో మంచిగా ఆలోచించేది. ఆ మంచితనమే తనను తీసుకువెళ్ళిపోయిందేమో. నా గుండెలో ఎంత బాధ ఉందో చెప్పలేకపోతున్నా. ఈ బాధ అనుభవించేవాళ్ళకే తెలుస్తుంది. ఈ బాధ ఇంకెవ్వరికీ రాకూడదు.

ఫొటో సోర్స్, UGC
ఇవాళ తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగిందని తెలిసిన తరువాత ఏమనిపించింది?
ఆనందం.. బాధ అన్నీ ఉన్నాయి. అది మాటల్లో చెప్పలేను.
మా అమ్మాయి ఆత్మ శాంతించింది. పోలీసువాళ్ళకు, మీడియాకు, మా కాలనీ వాసులకు అందరికీ నమస్కారాలు. మాకు న్యాయం జరిగింది. కానీ, ఏ ఆడపిల్లకూ ఇలాంటిది జరగకూడదు.
మాకు న్యాయం జరుగుతందనుకోలేదు. నిర్భయకే ఇంతవరకూ న్యాయం జరగలేదు.
మా అమ్మాయి చాలా మంచిది. అమ్మాయి ఇక లేదంటే తట్టుకోలేకపోతున్నా. ఎవరైనా తన వైపు చూస్తేనే చాలా ఇబ్బంది పడేది. మొహమాటమే ఆమె ప్రాణం తీసిందనిపిస్తోంది.
సంఘటనా స్థలానికి వెళతారా?
నాకు ఎలాంటి ఆలోచన రావడం లేదు. నా బుర్ర పని చేయడం లేదు. నాకు మా అమ్మాయి గురించి తప్ప ఇంక వేరే ఏ ఆలోచన లేదు. మా అమ్మాయి లేకుండా మేం ఎలా బతకాలి. ?
చట్టాల్లో మార్పు రావాలి. ఎవరైనా ఇలాంటి నేరాలు చేస్తే అక్కడిక్కడే ఉరి తీసేట్లు చట్టాలు రావాలి. అమ్మాయి వంక చూస్తే ఇలా జరుగుతుందని తెలియాలి."
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఇవి కూడా చదవండి:
- పిల్లలను ఎత్తుకెళ్తున్నారన్న వదంతులతో గర్భిణిపై దాడి
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- మోదీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ. 1.76 లక్షల కోట్ల నిధులు ఎందుకు తీసుకుంది?
- దళితుడి శవాన్ని వంతెన మీంచి కిందకు తాళ్ళు కట్టి ఎందుకు దింపారు...
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








