హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

ఫొటో సోర్స్, UGC
- రచయిత, దీప్తి బత్తిని, బళ్ల సతీశ్, సంగీతం ప్రభాకర్, నవీన్ కుమార్ కె
- హోదా, బీబీసీ ప్రతినిధులు
హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు నిందితుల ‘ఎన్‌కౌంటర్’పై విచారణ జరిపేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8వ తేదీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఈ టీమ్‌కు నేతృత్వం వహిస్తారు.
వనపర్తి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె అపూర్వ రావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ అదనపు డీసీపీ సురేందర్ రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ పి శ్రీధర్ రెడ్డి, రాచకొండ ఐటీ సెల్‌కు చెందిన శ్రీధర్ రెడ్డి, కొరట్ల సీఐ రాజశేఖరరాజు, సంగారెడ్డి డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ వేణు గోపాల్ రెడ్డిలు ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో సభ్యులు.
నలుగురు నిందితులు పోలీసు కాల్పుల్లో చనిపోయిన కేసు దర్యాప్తును తక్షణం సిట్ బృందం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ చెప్పారు.
ఈ నలుగురి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఈ మృతదేహాలకు ఈనెల 9వ తేదీ సోమవారం రాత్రి 8 గంటల వరకు అంత్యక్రియలు నిర్వహించరాదని తెలంగాణ హైకోర్టు 7వ తేదీ శనివారం ఆదేశాలు జారీ చేసింది.
అప్పటి వరకూ మృతదేహాలను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే భద్రపరచాలని ఆదేశించింది.
ఎదురుకాల్పులపై పలు మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశాయి. కస్టడీలో ఉన్న నిందితులు పోలీసుల చేతుల్లో మరణించడంపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఫోరెన్సిక్ నిపుణుల చేత పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ ప్రక్రియను వీడియో తీయాలని విజ్ఞప్తి చేశాయి.
దీనికి హైకోర్టు స్పందిస్తూ.. వీడియో చిత్రీకరణతో పోస్టు మార్టం నిర్వహించాలని, ఆ వీడియోను శనివారం సాయంత్రానికల్లా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు అందించాలని ఆదేశించింది.
సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ కేసుపై తిరిగి విచారణ చేపడతామని ప్రకటించింది.

కాగా, ఈ కేసులో ఏ4 అయిన చెన్నకేశవులు మృతదేహాన్ని తమకు అప్పగించాలంటూ ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు నారాయణ్‌పేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
ఆ పోలీసులపై హత్యానేరం మోపాలి - మానవ హక్కుల వేదిక
హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు చనిపోవడానికి కారణమైన పోలీసులు అందరిపైనా హత్యానేరం మోపాలని, తక్షణం వారిని అరెస్ట్ చేసి దర్యాప్తు జరపాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది.
ఈ మేరకు మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి మాధవరావు, ఆంధ్ర, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్ జీవన్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కాగా, పోలీసులు జరిపిన ఎదురుకాల్పులపై సోషల్ మీడియాలో చాలామంది ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు.
‘‘ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి. వాడు పోలీసోడు అయ్యుండాలి’’ అంటూ టాలీవుడ్ నటుడు నాని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘హైదరాబాద్ పోలీసులను, పోలీసులను పోలీసుల్లా పని చేయనిచ్చిన నాయకత్వానికి అభినందనలు తెలుపుతున్నా’’ అంటూ బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ ట్వీట్ చేశారు. అయితే, పోలీసులు స్వీయ రక్షణ కోసం వేగంగా స్పందించారని వివరణ జత చేశారు.

ఉదయం ఏం జరిగింది?
దిశ అత్యాచారం, హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు ‘ఎన్‌కౌంటర్’ చేశారు. తెలంగాణ శాంతిభద్రతల అడిషనల్ డిజీ జితేందర్ బీబీసీకి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీనిపై నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని ఆయన బీబీసీతో అన్నారు.
సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ బీబీసీతో మాట్లాడుతూ, "సీన్ రీ కన్ స్ట్రక్ట్ చేస్తుండగా నిందితులు తిరగబడ్డారు. పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేయగా నలుగురూ చనిపోయారు. ఇప్పటివరకు ఇదీ మాకు తెలిసిన సమాచారం. మిగతా వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తరువాతే ధ్రువీకరించగలను. ఈ ఘటనలో మా పోలీసులు ఇద్దరికి గాయాలయ్యాయి' అని చెప్పారు.
"నేరం జరిగిన తీరును రీకన్‌స్ట్రక్ట్ చేసేందుకు నలుగురు నిందితులను ఘటనా స్థలానికి తీసుకువచ్చాం. ఆ సమయంలో వారు మా దగ్గరున్న ఆయుధాన్ని లాక్కొని మాపై కాల్పులు ప్రారంభించారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆ నలుగురు నిందితులూ మరణించారు" అని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘ఎన్‌కౌంటర్’ జరిగిన స్థలాన్ని పరిశీలించడానికి సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళారు.
పోలీసుల ‘ఎన్‌కౌంటర్’లో మొత్తం నలుగురు నిందితులూ చనిపోయారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది.
న్యాయం జరగదనుకున్నా: దిశ తల్లి
‘‘ఆ అబ్బాయిలు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే.. నా అక్క, నా చెల్లిలాంటిదే కదా అని అనుకుని ఉంటే అక్కడ ఆ నలుగురు తల్లులు, ఇక్కడ నేను ఇవాళ ఇంత బాధపడే పరిస్థితి వచ్చేది కాదు’’ అని దిశ తల్లి అన్నారు.
‘‘మా అమ్మాయి ఆత్మ శాంతించింది. పోలీసులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మాకు న్యాయం జరిగింది. ఇలా జరగదనుకున్నా. కానీ, చేసి చూపించారు. నిర్భయ కేసు ఇంకా అలానే ఉంది’’ అని అన్నారు.
ఇలాంటి నేరాలకు పాల్పడినవారిని అక్కడిక్కడే ఉరి తీసేలా చట్టాల్లో మార్పులు రావాలని ఆమె వ్యాఖ్యానించారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1
‘ఎన్‌కౌంటర్’ జరుగుతుందని తాను ఊహించలేదని.. అయితే, భవిష్యత్తులో అత్యాచారాలు జరగకుండా ఇలాంటి కఠిన చర్య అడ్డుకట్ట వేస్తుందని దిశ సోదరి అన్నారు.
‘‘మేం కోర్టు ద్వారా మాకు న్యాయం చేస్తారని అనుకున్నాం. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఈ చర్యతో మా సోదరి తిరిగిరాదని తెలుసు. కానీ, కాస్త సాంత్వన దొరికింది. దేశవ్యాప్తంగా చాలా మంది మాకు మద్దతుగా నిలిచారు. అందరికీ కృతజ్ఞతలు. పోలీసులకు కూడా చాలా త్వరగా చర్యలు తీసుకున్నారు’’ అని ఆమె బీబీసీ తెలుగుతో చెప్పారు.

‘ఎన్‌కౌంటర్’ ఘటనపై కొన్ని చోట్ల మహిళలు స్వీట్లు పంచుకుంటూ, టపాసులు కాల్చుతూ సంబరాలు జరుపుకుంటున్నారు.
దిశ కాలనీవాసులు ‘తెలంగాణ సీఎం జిందాబద్, తెలంగాణ పోలీస్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తూ బాణసంచా కాల్చారు.
‘ఎన్‌కౌంటర్’ జరిగిన స్థలంలో పోలీసులను అక్కడున్న జనాలు ఎత్తుకొని, హర్షం వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
కొద్దిగా ఆలస్యం జరిగినా సరైన చర్యే జరిగింది అని ఎంపీ జయాబచ్చన్ వ్యాఖ్యానించారు.
నిందితులు తప్పించుకోవాలని ప్రయత్నించినప్పుడు పోలీసులకు అంతకు మించిన మార్గం లేదు. న్యాయం జరిగిందనే అనుకోవాలి అని ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బగెల్ వ్యాఖ్యానించారు.
"ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ కచ్చితంగా నేరస్తులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మేం దీన్ని స్వాగతిస్తున్నాం. బిహార్‌లో కూడా మహిళలపై హింసకు సంబంధించిన కేసులు పెరిగిపోతున్నాయి. ఇక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు" అని ఆర్జేడీ నాయకురాలు రబ్రీ దేవి ఈ ‘ఎన్‌కౌంటర్’ ఘటనపై వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు - మేనకా గాంధీ
మరోవైపు, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ కూడా దీనిపై స్పందించారు.
"ఇప్పుడు జరిగిన ఘటన చాలా భయానకమైనది. మీరు ఎవరిని చంపాలనుకుంటే వారిని చంపకూడదు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. నిందితులకు కోర్టు ద్వారా మరణశిక్ష పడేలా చేయాల్సింది. న్యాయ ప్రక్రియకు ముందే మీరు వారిని కాల్చి చంపాలనుకుంటే, ఇక కోర్టులు, చట్టాలు, పోలీసులతో పనేముంది?" అని ఆమె అభిప్రాయపడ్డారు.
"పోలీసులు చాలా ధైర్యంగా వ్యవహరించారు. న్యాయం జరిగింది. దీనిపై న్యాయపరమైన ప్రశ్నల సంగతి వేరే అంశం. కానీ, దేశ ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారనిపిస్తోంది" అని బాబారాందేవ్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
"ఓ తల్లిగా, కూతురుగా, భార్యగా నేను దీన్ని స్వాగతిస్తున్నా. లేదంటే వాళ్లు ఏళ్ల తరబడి జైల్లో ఉండేవారు. నిర్భయ అసలు పేరు కూడా అది కాదు, ప్రజలే ఆ పేరు పెట్టారు. అయితే ఈ పేర్లు పెట్టడం కన్నా కూడా వారికి శిక్ష పడటమే ముఖ్యం" అని ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
"ఉత్తర్ ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిద్రాణంగా ఉంది. ఇక్కడి పోలీసులు, దిల్లీ పోలీసులు హైదరాబాద్ పోలీసులను చూసి ప్రేరణ పొందాలి. కానీ, దురదృష్టవశాత్తూ ఇక్కడి నేరస్తులను అతిథుల్లాగా చూస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రస్తుతం ఆటవిక రాజ్యం నడుస్తోంది" అని మాయావతి విమర్శించారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2
ఇదే న్యాయమా? కోర్టులను ఎత్తేద్దామా? : కల్పన కన్నబిరన్
‘‘నలుగురిని క్రూరంగా చంపారు. కోర్టులను ఎత్తేసి, ఈ హంగామా చూద్దామా?’’ అని లా ప్రొఫెసర్, మానవహక్కుల కార్యకర్త కల్పన కన్నబిరన్ ప్రశ్నించారు.
‘ఎన్‌కౌంటర్’పై ఆమె ఫేస్‌బుక్‌లో స్పందించారు.
‘‘ఆదిత్యనాథ్ ఓ రాష్ట్రాన్ని పాలిస్తుంటే, నిత్యానంద ఓ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉన్నావ్‌లో ఓ అత్యాచార బాధితురాలికి నిప్పటించారు. ఎన్‌కౌంటర్లలో ఎలాంటి న్యాయమూ లేదు. ఈ రక్త పాతాన్ని మనం సమర్థించకూడదు. పోలీస్ రాజ్యంలో భవిష్యత్తు ఉండదు. ప్రజాస్వామ్య ఉద్యమాల పునాదులపై తెలంగాణ నిర్మితమైందన్న విషయాన్ని మనం మరిచిపోకూడదు’’ అని అన్నారు.
సుప్రీం కోర్టు, హైకోర్టులు ఈ విషయంపై ఏమని స్పందిస్తాయని కల్పన ప్రశ్నించారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 3
అసహ్యం.. అనాగరికం: అక్కిరాజు భట్టిప్రోలు
దిశ కేసు నిందితుల ‘ఎన్‌కౌంటర్’ అసహ్యకరమైన, అనాగరికమైన చర్య అని రచయిత అక్కిరాజు భట్టిప్రోలు వ్యాఖ్యానించారు.
‘‘పోలీసులనే జడ్జీలను చేసేస్తే ఎంత ప్రమాదమో తెలీని ప్రజల అమాయకత్వం. ఎప్పుడు ఆ తుపాకీ నీవైపు ఎందుకు తిరుగుతుందో నీకు తెలీదు. పోయింది నిందితులు మాత్రమే కాదు. నీకూ, నాకూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కూడా హత్యకు గురయ్యాయి. ఇది మొదటి సారీ కాదు, చివరిసారి అయ్యే అవకాశమూ లేదు’’ అని ఫేస్‌బుక్ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.
కోర్టులద్వారా వేసే ఉరి శిక్షనే అనాగరికమని తొలగించిన దేశాలున్నాయని ఆయన అన్నారు.
'ఎన్ కౌంటర్ చేశారు' అన్న వాక్యమే తప్పని అక్కడిరాజు అన్నారు. ‘‘హత్యలు చేస్తారు. ఎంకౌంటర్లు జరగొచ్చు’’ అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, UGC
మహిళలు కోరుకునే న్యాయం ఇది కాదు: రెబెకా మమెన్ జాన్
ఈ ‘ఎన్‌కౌంటర్’ ఘటనపై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్, క్రిమినల్ లాయర్ రెబెకా మమెన్ జాన్ స్పందించారు. మహిళలు కోరుకునే న్యాయం ఇది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
‘‘వాళ్లే నేరం చేశారు అనడానికి మన దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయా? ఏ కోర్టు అయినా వాటిని పరిశీలించిందా? ఏ కోర్టు అయినా నేరాన్ని నిర్థరించిందా? ఒకవేళ వాళ్లే నేరం చేశారు అనుకుంటే, అది నిర్థరించడానికి ఓ పద్ధతి ఉంది. దాన్ని తప్పితే, తర్వాత మీ వంతే కావచ్చు’’ అని అన్నారు.
‘‘అత్యాచార బాధితులకు సహాయం చేయడం చాలా సుదీర్ఘమైన, కఠినమైన ప్రక్రియ. దాన్ని మీరెప్పుడూ పాటించలేదు. వాళ్లు ఏం కోరుకుంటున్నారో, ఏం ఎదుర్కొన్నారో మీకు అవగాహన లేదు. సిగ్గుతో మీ తలలు దించుకోండి, భయంతో కూడా. ఇది మిమ్మల్ని వెంటాడుతుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ANI
ఏడేళ్లుగా తొక్కని గడప లేదు: నిర్భయ తల్లి
పోలీసులు అమలు చేసిన ఈ శిక్షపై సంతోషం వ్యక్తం చేస్తున్నానని ‘నిర్భయ’ తల్లి ఏఎన్ఐ వార్తాసంస్థతో చెప్పారు.
పోలీసులు గొప్ప పనిచేశారని, దీనికి వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని ఆమె కోరారు.
‘‘న్యాయం కోసం ఏడేళ్లుగా నేను తొక్కని గడప లేదు. నిర్భయ కేసులో దోషుల్ని ఉరి తీయాలని ఈ దేశ న్యాయవ్యవస్థకు, ప్రభుత్వాన్ని కోరుతున్నా’’ అని అన్నారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 4
అత్యాచార నిందితులకు మరణ శిక్ష పడాలని కోరుకున్నామని, పోలీసులు అత్యుత్తమ న్యాయ నిర్ణేతలుగా నిలిచారని జాతీయ మహిళల కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ అన్నారు.
‘‘ఓ సాధారణ పౌరురాలిగా చాలా ఆనందపడుతున్నా. ఇలాంటి ముగింపే మేం కోరుకున్నాం. అయితే, ఇది న్యాయ వ్యవస్థ ద్వారా వస్తుందని అనుకున్నాం. సరైన మార్గాల్లో జరిగుండాల్సింది’’ అని వ్యాఖ్యానించారు.

బాధితురాలి మృతదేహాన్ని గుర్తించిన చోటనే..
నవంబర్ 28 ఉదయం చటాన్‌పల్లి వద్దే దిశ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ లారీ డ్రైవర్, ముగ్గురు క్లీనర్లను నిందితులుగా భావిస్తూ అరెస్టు చేశారు.
దిశ స్కూటీకి పంక్చర్ వేసి, దానిని బాగు చేయిస్తామని చెప్పి, కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, చనిపోయిన తర్వాత పెట్రోలు, డీజిల్ పోసి కాల్చామని ఆ నలుగురు నిందితులు తెలిపారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

నవంబర్ 27 సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన దిశపై శంషాబాద్ తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు.
నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.
దిశ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగింది.

దిశ కేసు దేశమంతా సంచలనం సృష్టించింది. అనేక మంది స్పందించారు. సంతాపం తెలిపారు. రోడ్ల మీదికొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు.
కేసు విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వచ్చింది. రాష్ట్ర హైకోర్టు సైతం ఇందుకు ఆదేశాలు జారీ చేసింది.
నలుగురు నిందితులను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ షాద్ నగర్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి.
- అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ పేరును 'దిశ'గా మార్చిన పోలీసులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ప్రభుత్వం ఏర్పాట్లు
- షాద్ నగర్ అత్యాచారం-హత్య: ‘ప్లీజ్ పాపా, కొంచెం సేపు మాట్లాడు, దెయ్యంలా వెంటపడిండు... నాకు భయం అయితాంది’
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
- మసీదు దేవుడి ఇల్లయితే, మహిళలకు తలుపులు ఎందుకు మూస్తున్నారు...
- డిజిటల్ డ్రెస్... ఓ భర్త తన భార్య కోసం దీన్ని దాదాపు 7 లక్షలకు కొన్నారు
- మా అమ్మకు వరుడు కావలెను
- సచిన్ రికార్డును బ్రేక్ చేసిన అమ్మాయి మళ్లీ అదరగొట్టింది
- భోపాల్ విషాదానికి 35 ఏళ్లు... ఫోటోలు చెప్పే విషాద చరిత
- శ్రీజ డెయిరీ: ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుల సంస్థ’.. ఇందులో సభ్యులు, యజమానులు అంతా మహిళలే
- ఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్: ఫోన్ కూడా లేని ఇంటి నుంచి గూగుల్ బాస్‌గా ఎదిగిన చెన్నై కుర్రాడు
- గురజాడ అప్పారావు... ఆధునిక స్త్రీ ఆయన ప్రతినిధి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








