సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు

ఫొటో సోర్స్, SirivennelaSitharamaShastry/FB
సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 66 ఏళ్లు.
కిమ్స్ ఆస్పత్రి వర్గాలు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేస్తూ, "ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడ్తున్న సీతారామశాస్త్రి సాయంత్రం 4.07 గంటలకు మృతి చెందారు" అని ప్రకటించాయి.
కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల (1986) సినిమాతో సినీ గేయరచయతగా అందరి దృష్టినీ ఆకర్షించిన చేంబోలు సీతారామశాస్త్రి ఆ చిత్రం పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు.
అయితే, ఆయన సినీ రంగానికి పరిచయమైంది మాత్రం అంతకు రెండేళ్ల ముందు వచ్చిన 'జననీ జన్మభూమి' చిత్రంతో. ఆ చిత్రానికి కూడా కె. విశ్వనాథే దర్శకుడు. తొలి సినిమాలో సీహెచ్ సీతారామశాస్త్రి (భరణి) అనే పేరుతో ఆయన 'తడిసిన అందాలలో...' అనే పాట రాశారు.
సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో సీతారామశాస్త్రి 1955 మే 20న జన్మించారు. ఆయన పదో తరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో బీఏ పూర్తి చేసిన సిరివెన్నెల కొంతకాలం రాజమహేంద్రవరంలో బీఎస్ఎన్ఎల్‌లో పని చేశారు.
'విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం..., ఆది భిక్షువు వాడినేమి కోరేది, చందమామ రావే...' వంటి పాటలతో తొలి చిత్రంతోనే తన ప్రత్యేకతను చాటుకున్న సీతారామశాస్త్రి క్లాస్, మాస్ పాటలతో సినీ ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నారు.
నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్‌లో దాదాపు 800ల చిత్రాల్లో 3 వేలకు పైగా పాటలు రాసిన సిరివెన్నెల ఉత్తమ సినీ గేయరచయితగా 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెల్చుకున్నారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.
సిరివెన్నెల 2019లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

ఫొటో సోర్స్, SirivennelaSitharamaSastry/FB
సినీ ప్రస్థానం
సిరివెన్నెల చిత్రంతో 1986లో తెలుగు సినీ పాటల ప్రియులకు పరిచయమైన సీతారామశాస్త్రి అదే ఏడాది వంశీ దర్శకత్వం వహించిన 'లేడీస్ టైలర్' చిత్రంతో పాపులర్ ప్రేమ గీతాలు రాయడంలోనూ తన కలానికి అంతే పదను ఉందని నిరూపించుకున్నారు.
ఇక, ఆ తరువాత ఆయన వెనుతిరిగి చూడలేదు. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి చిత్రాలకు ఆయన పాటలు రాశారు. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కల్పించాలని ఎన్నో సందర్భాల్లో చెప్పిన సీతారామశాస్త్రి ఆ దిశగా చెప్పుకోదగిన కృషి చేశారు.

ఫొటో సోర్స్, UGC
కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 'రుద్రవీణ' చిత్రం సిరివెన్నెల కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలోని 'తరలి రాద తనే వసంతం, నమ్మకు నమ్మకు ఈ రేయిని...' వంటి పాటలు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి.
ఏప్రిల్ 1 విడుదల, క్రిమినల్, మనీ, గోవిందా గోవిందా, శుభలగ్నం, ప్రేమకథ, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, గమ్యం వంటి చిత్రాల విజయాల్లో ఆయన పాటలు ఎంతో కీలక పాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.
తాజాగా, అల వైకుంఠపురములో... సీతారామశాస్త్రి రాసిన సామజవరగమన... పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. వేటూరి తరవాత తరంలో సినీ గీత రచనకు తిరుగులేని చిరునామాగా కొనసాగిన సిరివెన్నెల సీతారామశాస్త్రి నవతరం సోషల్ మీడియా జనరేషన్‌లోనూ తన పాపులారిటీని కొనసాగించడం విశేషం.
సీతారామశాస్త్రి చివరగా నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెండు పాటలు రాశారు. అవే ఆయన చివరి పాటలు కావడం విషాదకరం.
తెలుగు సినిమాకు తీరని లోటు...
తెలుగు సినిమా గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించానని అంటూ భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తెలుగు భాషకు పట్టం కడుతూ సీతారామశాస్త్రి రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సిరివెన్నెల సృష్టించారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గుర్తు చేసుకున్నారు.
సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీతారామాశాస్త్రి సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయిక అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని చెప్పిన కేసీఆర్, "ఆయన మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటు" అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సిరివెన్నెల మృతిపట్ల తీవ్ర సంతాపం తెలిపారు. సినీ రంగంలో విలువల శిఖరం సిరివెన్నెల అని ఆయన కొనియాడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
తరలి రాద తనే వసంతం’ అంటూ పాట రాసిన ఆయన తరలి రాని లోకాలకు వెళ్లిపోయారని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
"తెలుగు పాటని తన సాహిత్యంతో దశదిశల వ్యాపింపజేసిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నాకు ఎంతో ఆప్తులు. నేను నటించిన చిత్రాలకు వారు అద్భుతమైన పాటలు రాశారు. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను. వారి కుంటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని నటుడు నందమూరి బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
బాలకృష్ణ నటించిన 'జననీ జన్మభూమి' చిత్రమే గీతరచయితగా సిరివెన్నెలకు తొలి చిత్రం.
సిరివెన్నెల సీతారామశాస్త్రి అలుపెరుగని కలం యోధుడని హీరో జూనియర్ ఎన్టీయార్ అన్నారు. ఆయన మరణం సినీ సాహిత్యానికి తీరని లోటని జూనియర్ ఎన్టీయార్ తన సంతాప సందేశంలో అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
మమ్మల్ని ముందుండి నడిపే వెలుతురు ఆరిపోయిందని, ఆయన ఒక అక్షర తూటా అని తెలుగు సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఆయన మరణవార్తను బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను అని త్రివిక్రమ్ అన్నారు.
(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి)
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ కొత్త వేరియంట్ పేరు 'ఒమిక్రాన్', ఆందోళనకరంగా ఉందన్న డబ్ల్యూహెచ్‌వో
- ‘కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేసిన తండ్రిని చంపేసిన నలుగురు టీనేజీ కుర్రాళ్లు’
- యూరోపియన్ దేశాల్లో కోవిడ్ ఆంక్షలపై తిరగబడుతున్న జనాలు.. రెచ్చగొడుతున్న 3 అంశాలు..
- ఆంధ్రప్రదేశ్ వచ్చే ఏడేళ్లలో చెల్లించాల్సిన అప్పు రూ. 1,10,010 కోట్లు - ప్రెస్ రివ్యూ
- చైనీస్ ఫుడ్: '8,000 రెస్టారెంట్లలో ఆహారం రుచి చూశాక నాకు తెలిసిందేంటంటే...'
- అభినందన్ వర్థమాన్‌కు వీర్ చక్ర అవార్డు ఇవ్వడంపై పాకిస్తాన్ ఏమందంటే..
- ఆరంకెల జీతాలతో ఆకర్షిస్తున్న డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)