వైఎస్ జగన్: ‘చంద్రబాబుది ఓ డ్రామా.. ఆయన ఆరోపించినట్లు ఆ మాటలు అసెంబ్లీలో ఎవ్వరూ అనలేదు’

చంద్రబాబుది ఓ డ్రామా అని, ఆయన ఫ్రస్టేషన్‌లో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు బాహాటంగా చంద్రబాబును వ్యతిరేకించారని, కుప్పంలో కూడా ఇదే కనిపించిందన్నారు. కౌన్సిల్‌లో తమ పార్టీ బలం పెరిగిందని, దీంతో ఇవన్నీ తట్టుకోలేక సభలో చంద్రబాబు ప్రవర్తించారన్నారు.
చంద్రబాబు సభలో సంబంధంలేని టాపిక్ తీసుకొచ్చారని, దానిపై ఆయనే మాట్లాడారని, దీంతో అధికార పార్టీ సభ్యులు కూడా ప్రతిస్పందించారని, అయితే.. చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలైతే అధికార పార్టీ వారు ఎవ్వరూ అనలేదని జగన్ తెలిపారు.
ఆరోపణలకు ప్రత్యారోపణలుగా వంగవీటి మోహన రంగా హత్య, మాధవరెడ్డి హత్య, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖ.. వీటిపైన కూడా చర్చ జరగాలని అన్నారని జగన్ వివరించారు.
కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడారే తప్ప అధికార పార్టీ సభ్యులు మాట్లాడలేదన్నారు.
చంద్రబాబు తన కుటుంబం గురించి, తన చిన్నాన్న, అమ్మ, చెల్లెలు గురించి మాట్లాడారని జగన్ అన్నారు.
సభ రికార్డులు చూసినా ఈ విషయాలన్నీ తెలుస్తాయన్నారు.
చంద్రబాబు ఓవర్ రియాక్ట్ అయ్యి, ఏమేమో మాట్లాడుతున్నారని, ఆ విషయం ఆయనకే అర్థం కావట్లేదన్నారు. సభ నుంచి వెళ్లిపోతూ శపథాలు చేశారని అన్నారు.
‘‘నేనైనా, ఎవరైనా సరే.. నిమిత్త మాత్రులమే. దేవుడు ఎంతకాలం ఆశీర్వదిస్తే అంతకాలం పనిచేయగలుగుతాం. దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు.. ఈ రెండే రాజకీయాల్లో ముఖ్యం. మంచి చేసినంత కాలం దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రజలూ దీవిస్తారు. ఆ రెండూ ఉన్నంతకాలం ఎవ్వరూ అడ్డుకోలేరు’’ అని జగన్ అన్నారు.
తనకు కొన్ని మీడియా సంస్థల మద్దతు లేకపోవచ్చునని, అబద్ధాన్ని నిజం చేసే మేధావులు వారని, అయితే ప్రజలకు మంచి జరుగుతోందా? లేదా? అన్న విషయాన్ని దాచలేరన్నారు. ప్రజలకు మంచి జరిగినంత కాలం చంద్రబాబు ఎన్ని డ్రామాలు చేసినా.. కళ్లల్లో నీళ్లు తిరగకపోయినా, తిరిగినట్లు తనంతటతానే డ్రామాలు చేయొచ్చని అన్నారు.
ఎవరు ఎన్ని చేసినా చివరకు మంచే గెలుస్తుందన్నారు.
చంద్రబాబు నాయుడు తన చిన్నాన్న గురించి, తన చిన్నాన్న కొడుకు అయిన అవినాష్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని, ఒక చెయ్యి ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది? అని జగన్ ప్రశ్నించారు.
ఇవన్నీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగాయని అన్నారు. తన చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఓడించారని జగన్ ఆరోపించారు.
తన చిన్నాన్నను ఎవరైనా ఏదైనా చేసి ఉంటే.. అది చంద్రబాబు వాళ్లే చేసి ఉండాలని, చివరకు తన కుటుంబంలోనే చిచ్చు పెడుతున్నారని జగన్ అన్నారు.
పైన దేవుడు ఉన్నాడని, అన్నీ ఆయనే చూసుకుంటాడని జగన్ ముగించారు.
ఇవి కూడా చదవండి:
- మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాం: ప్రధాని మోదీ
- ఆంధ్రప్రదేశ్: దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్ష బీభత్సం, మనుషులు గల్లంతు... కొట్టుకుపోతున్న మూగజీవాలు
- అమెరికాను అధిగమించి అత్యంత సంపన్న దేశంగా అవతరించిన చైనా -మెకెన్సీ రిపోర్ట్
- దుస్తులు తొలగించకుండా తాకినా లైంగికంగా వేధించినట్లే: సుప్రీంకోర్టు
- ఎవరు మీలో కోటీశ్వరులు: రూ. కోటి గెల్చుకున్న రాజా రవీంద్ర బీబీసీ అడిగిన 5 ప్రశ్నలకు ఏమని బదులిచ్చారు?
- తైవాన్ ‘పాల సముద్రం’: సుందర ద్వీపం కింద విషం చిమ్మే సాగర రహస్యం
- ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- కేసీఆర్ ధర్నా చౌక్ బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది?
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















