‘వంగవీటి మోహన రంగా హత్య, మాధవరెడ్డి హత్యపైనా చర్చ జరగాలన్నారు.. అంతే’ - వైఎస్ జగన్మోహన్ రెడ్డి

వీడియో క్యాప్షన్, ‘చంద్రబాబుది ఓ డ్రామా.. ఆయన చెబుతున్న మాటలు అసెంబ్లీలో ఎవ్వరూ అనలేదు’

చంద్రబాబుది ఓ డ్రామా అని, ఆయన ఫ్రస్టేషన్‌లో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు బాహాటంగా చంద్రబాబును వ్యతిరేకించారని, కుప్పంలో కూడా ఇదే కనిపించిందన్నారు. కౌన్సిల్‌లో తమ పార్టీ బలం పెరిగిందని, దీంతో ఇవన్నీ తట్టుకోలేక సభలో చంద్రబాబు ప్రవర్తించారన్నారు.

చంద్రబాబు సభలో సంబంధంలేని టాపిక్ తీసుకొచ్చారని, దానిపై ఆయనే మాట్లాడారని, దీంతో అధికార పార్టీ సభ్యులు కూడా ప్రతిస్పందించారని, అయితే.. చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలైతే అధికార పార్టీ వారు ఎవ్వరూ అనలేదని జగన్ తెలిపారు.

ఆరోపణలకు ప్రత్యారోపణలుగా వంగవీటి మోహన రంగా హత్య, మాధవరెడ్డి హత్య, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖ.. వీటిపైన కూడా చర్చ జరగాలని అన్నారని జగన్ వివరించారు.

కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడారే తప్ప అధికార పార్టీ సభ్యులు మాట్లాడలేదన్నారు.

చంద్రబాబు తన కుటుంబం గురించి, తన చిన్నాన్న, అమ్మ, చెల్లెలు గురించి మాట్లాడారని జగన్ అన్నారు.

సభ రికార్డులు చూసినా ఈ విషయాలన్నీ తెలుస్తాయన్నారు.

చంద్రబాబు ఓవర్ రియాక్ట్ అయ్యి, ఏమేమో మాట్లాడుతున్నారని, ఆ విషయం ఆయనకే అర్థం కావట్లేదన్నారు. సభ నుంచి వెళ్లిపోతూ శపథాలు చేశారని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)