చంద్రబాబు నాయుడు: ‘నా భార్యను డర్టీ పాలిటిక్స్‌లోకి లాగారు.. ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు’

వీడియో క్యాప్షన్, చంద్రబాబు నాయుడు: ‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’

అసెంబ్లీలో ప్రతిపక్షాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందని, ఇలాంటి అసెంబ్లీలోకి మళ్లీ అధికారంలోకి వచ్చాకే అడుగుపెడతాననిఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంతటి ఘోరమైన సభను తాను ఇంత వరకు చూడలేదని, అధికార పార్టీ దీనిని కౌరవ సభలా నిర్వహిస్తోందని, ఆఖరికి ప్రతిపక్ష నేత కుటుంబంలోని మహిళలను కూడా సభలో ప్రస్తావిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య గురించి అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని గుర్తు చేసిన చంద్రబాబు నాయుడు తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)