పెగాసస్ స్పైవేర్‌: మోదీ ప్రభుత్వ తీరుకు నిరసనగా టీపీసీసీ ‘చలో రాజ్‌భవన్’ - Newsreel

సీపీకి వినతిపత్రం ఇస్తున్న దాసోజు శ్రవణ్ కుమార్

ఫొటో సోర్స్, Tpcc

పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి మోదీ ప్రభుత్వం విపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతరులపై నిఘా పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు జులై 22న 'చలో రాజ్‌భవన్' కార్యక్రమం చేపడుతున్నారు.

ఇందుకోసం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ను అనుమతి కోరారు.

జులై 22 ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ వద్దకు కాంగ్రెస్ నేతలు చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం అందిస్తారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి ఆధార్ సెంటర్‌కే వెళ్లాల్సిన పని లేదు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి ఆధార్ సెంటర్‌కే వెళ్లాల్సిన పని లేదు

ఆధార్‌లోని మీ ఫోన్‌ నెంబర్ ఇంటి దగ్గరే ఇకపై ఇలా మార్చుకోవచ్చు

మొబైల్ నంబర్‌‌ను ఆధార్‌ కార్డుతో లింక్ చేయడానికి ఇంతకు ముందులాగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. పోస్ట్‌మ్యాన్ సాయంతో ఇంటి దగ్గర, లేదంటే దగ్గర్లోని పోస్టాఫీసులో కూడా దీనిని అప్‌డేట్ చేసే అవకాశం ఉంది.

ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికెషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఒక ఒప్పందానికి వచ్చాయి.

దీని ప్రకారం మీ ఏరియాలోని పోస్ట్‌మ్యాన్ కూడా మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌‌ డేటాలో అప్‌డేట్ చేయగలరు.

పిల్లల ఆధార్ రిజిస్ట్రేషన్ కూడా త్వరలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు కార్యాలయాల్లో లభిస్తాయి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు కార్యాలయాల్లో త్వరలో పిల్లల ఆధార్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులకు చెందిన 650 శాఖలతోపాటు, 1 లక్షా 46 వేలమంది గ్రామీణ డాక్ సేవకులు ఈ సేవలకు అందుబాటులో ఉంటారు. ''ఆధార్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్‌ సర్వీసు ఇకపై పోస్టాఫీసుల్లో, పోస్ట్‌మెన్ దగ్గర కూడా లభ్యమవుతాయి'' అని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్, సీఈఓ జె.వెంకటరాము ఒక ప్రకటనలో వెల్లడించారు.ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్స్ మొబైల్ అప్‌డేట్ సేవలను మాత్రమే అందిస్తుంది. త్వరలోనే పిల్లల ఆధార్ రిజిస్ట్రేషన్ కూడా ఈ నెట్‌వర్క్ ద్వారా చేయవచ్చునని ఐపీపీబీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)