సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్ కంప్యూటర్లే కాకుండా మరికొందరి కంప్యూటర్లూ హ్యాక్ అయ్యాయా?

గాడ్లింగ్ కంప్యూటర్లలో ఫోల్డర్లు

ఫొటో సోర్స్, Arsenal report

భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారన్న ఆరోపణలతో అరెస్టయిన యాక్టివిస్ట్‌లు సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్‌ల కంప్యూటర్లను కొందరు హ్యాక్ చేసి వాటిలో తప్పుడు ఆధారాలు చొప్పించినట్లు అమెరికా ఫోరెన్సిక్ ఏజెన్సీ ఒకటి వెల్లడించిందని ఇటీవల 'వాషింగ్టన్ పోస్ట్' కథనం రాసింది.

గాడ్లింగ్ అరెస్ట్ కావడానికి రెండేళ్ల ముందే ఆయన కంప్యూటర్‌ను ఈమెయిళ్ల ద్వారా హ్యాక్ చేశారని.. ఆ మెయిల్స్‌ స్టాన్ స్వామి, ఇతర యాక్టివిస్టులకు కూడా కాపీ చేసి ఉన్నాయని, వారి కంప్యూటర్లూ హ్యాక్ అయి ఉండొచ్చని ఆ నివేదిక అనుమానించింది.

సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్‌ల న్యాయవాదుల వినతి మేరకు వారిద్దరి కంప్యూటర్లలోని ఎలక్ట్రానిక్ కాపీలు, వారి ఈమెయిల్ అకౌంట్లను మషాచూసెట్స్ కేంద్రంగా పనిచేసే డిజిటల్ ఫోరెన్సిక్ ఫర్మ్ 'ఆర్సెనల్ కన్సల్టింగ్' పరిశీలించింది.

రోనా విల్సన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోనా విల్సన్

గుర్తు తెలియని హ్యాకర్ హానికరమైన సాఫ్ట్‌వేర్ ఉపయోగించి గాడ్లింగ్, విల్సన్‌ల కంప్యూటర్లలో చొరబడి హిడెన్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి అందులో డజన్ల కొద్దీ డాక్యుమెంట్లను సేవ్ చేసినట్లు ఆర్సెనల్ కన్సల్టింగ్ తెలిపింది.

ఆ తరువాత దర్యాప్తు సంస్థలు ఆ డాక్యుమెంట్లనే ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు మావోయిస్టు పార్టీతో కలిసి కుట్ర పన్నారంటూ వారిని అరెస్ట్ చేశాయి.

గాడ్లింగ్, విల్సన్‌లవే కాకుండా ఇతరుల కంప్యూటర్లపైనా కూడా ఇదే హ్యాకర్ సైబర్ దాడి చేసి ఉండొచ్చని ఆర్సెనల్ తన నివేదికలో చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కాగా ఆర్సెనల్ కన్సల్టెన్సీ రీసెర్చర్ జువాన్ ఆండ్రెస్ గెరెరో‌ను ఉటంకిస్తూ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ 'సెంటినల్ వన్' ఓ ట్వీట్ చేసింది.

ఆర్సెనల్ పరిశీలించిన రెండు కంప్యూటర్లే కాకుండా మరెన్నో అలా హ్యాక్ అయి ఉండొచ్చని సెంటినల్ వన్ తన ట్వీట్‌లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)