లక్షద్వీప్: సినీనటి ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారు?

ఫొటో సోర్స్, FB/Aisha Lakshadweep
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
దేశ ద్రోహ చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు అభిప్రాయపడి కనీసం 15 రోజులు కూడా అవ్వకముందే, లక్షద్వీప్‌లో ఓ సినీనటిపై ఈ చట్టం కింద కేసు నమోదు అయ్యింది.
లక్షద్వీప్ గవర్నర్ ప్రఫుల్లా ఖూడా పటేల్‌పై ఓ మలయాళీ టీవీ ఛానెల్‌లో చేసిన వ్యాఖ్యలకుగాను ఐపీసీలోని సెక్షన్ 124బీ కింద నటి ఆయేషా సుల్తానాపై కేసు నమోదు చేశారు.
టీవీలో చర్చ సమయంలో.. ‘‘కరోనా మహమ్మారిని చైనా వ్యాపింపజేసినట్లే.. లక్షద్వీప్ ప్రజలపై భారత్ ప్రభుత్వం ఈ బయోలాజికల్ వెపన్‌ను రుద్దుతోంది’’అని ఆమె వ్యాఖ్యానించారు.
లక్షద్వీప్‌లో ఏం జరుగుతోంది?
‘‘ఆయేషా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యతిరేకమైనవి’’అంటూ కేరళ బీజేపీ ఉపాధ్యక్షుడు అబ్దుల్లా కుట్టి వ్యాఖ్యానించారు. బీజేపీ లక్షద్వీప్ వ్యవహారాలను ఈయనే చూసుకుంటున్నారు.
ప్రఫుల్ పటేల్.. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం లక్షద్వీప్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈయన చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో లక్షద్వీప్ పేరు వార్తల్లో మార్మోగుతోంది.
లక్షద్వీప్‌లో గోమాంసంపై పటేల్ నిషేధం విధించారు. మద్యం విక్రయాలపైనున్న ఆంక్షలను ఎత్తివేశారు. లక్షద్వీప్‌లో ఏదైనా ప్రాంతాన్ని ‘‘డెవలప్‌మెంట్ జోన్’’గా ప్రకటించే అధికారాలు కల్పిస్తూ.. కొత్తగా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటుచేయాలని ఆయన ప్రతిపాదించారు.
ఈ మార్పులపై లక్షద్వీప్ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది. కొన్నిచోట్ల వారాలపాటు నిరసనలు కూడా జరిగాయి. వీటిపై టీవీలో చర్చ జరుగుతుండగా ఆయోషా తాజా వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ‘‘బయోలాజికల్ వెపన్’’ పదాన్ని తాను ఉపయోగించి ఉండొచ్చని ఆయేషా అన్నారు. పటేల్‌ను తమపై కేంద్రం రుద్దుతోందని చెప్పడానికే ఆ పదాన్ని ఉపయోగించానని వివరించారు.
‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశం కోసం నిలబడాలని నేను చదువుకున్నాను. ఈ విషయాన్ని నేను ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, కొంతమంది నన్ను దేశ ద్రోహి అంటున్నారు. దీనికి కారణం నేను టీవీ చర్చలో బయోలాజికల్ వెపన్ అనే పదం ఉపయోగించడమే. నేను పటేల్‌పై ఆ పదం ఎందుకు ఉపయోగించానో అందరికీ తెలుసు’’అని ఆమె ఫేస్‌బుక్ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.
ఈ విషయంపై ఆయేషాను బీబీసీ సంప్రదించింది. అయితే, ఆమె స్పందించలేదు.
‘‘నేను కూడా ఆ చర్చలో పాల్గొన్నాను. పటేల్ తీసుకున్న చర్యలపై మేం మాట్లాడుతున్నాం. అప్పుడే ఆ పదాన్ని ఆయేషా ఉపయోగించారు. ఆమె చెప్పాలి అనుకునే విషయాలను అక్కడున్న బీజేపీ ప్రతినిధులు సరిగా చెప్పనివ్వలేదు’’అని లక్షద్వీప్ ఎంపీ, ఎన్‌సీపీ నాయకుడు మహమ్మద్ ఫైజల్ వ్యాఖ్యానించారు.
‘‘లక్షద్వీప్‌లో క్వారంటైన్ నిబంధనలను పటేల్ సడలించారని ఆయేషా అన్నారు. పటేల్ నిర్ణయంతోనే ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు అవకాశంగా తీసుకున్నారు. అన్ని వ్యాఖ్యలనూ దేశ ద్రోహం కింద చూడకూడదని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదు’’.
విమర్శిస్తే దేశద్రోహమా
ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ స్పందించారు. ‘‘ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశ ద్రోహంగా చూడకూడదు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు పదేపదే చెబుతూ వస్తోంది. అయినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఆయేషాపై మోపిన కేసును వెనక్కి తీసుకోవాలి’’అని శశిథరూర్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
లక్షద్వీప్ బీజేపీ నాయకుడు సీ అబ్దుల్ హాజీ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ దేశద్రోహం కేసును పోలీసులు నమోదు చేశారు.
ఈ కేసు నిలబడుతుందా?
ఆయేషాను విచారణకు పిలుస్తారా? అని బీబీసీ అడిగిన ప్రశ్నకు పోలీసులు స్పందించారు. ‘‘ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇంతకుమించి ఏమీ చెప్పలేం’’అని లక్షద్వీప్ ఎస్పీ శరత్ సిన్హా చెప్పారు.
మరోవైపు ఆయేషా వ్యాఖ్యలతో పాకిస్తాన్ మీడియా వేడుకలు చేసుకుందని బీజేపీ నాయకుడు అబ్దుల్లా కుట్టి వ్యాఖ్యనించారు. అయితే, కొందరు బీజేపీ నాయకులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఈ అంశంపై కుట్టి స్పందిస్తూ ‘‘కొన్ని సమస్యలు ఉన్నాయి. మేం పరిష్కరించుకుంటాం’’అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కోర్టులో ఈ కేసు చెల్లుబాటుకాదని శశిథరూర్ అన్నారు. ‘‘దేశద్రోహం కేసు పెట్టడానికి అవసరమైన అభియోగాలు ఈ కేసులో లేవు. కాబట్టి ఈ కేసును కోర్టు కొట్టేస్తుంది. అయితే, అప్పటివరకు ఆయేషా ఇబ్బంది పడాలి. ఇది అధికారాలను దుర్వినియోగం చేయడమే. ఆమెపై పెట్టిన కేసును కొట్టివేయాలి’’అని శశిథరూర్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ వ్యాక్సీన్: భారత్‌లో టీకా కార్యక్రమం అభివృద్ధి చెందిన దేశాల కన్నా వేగంగా జరుగుతోందన్న మోదీ మాటల్లో నిజమెంత?
- BBCISWOTY: క్రీడల్లో మహిళల గురించి భారతీయులు ఏమనుకొంటున్నారు?
- శ్రీలంక: సముద్రంలోకి విషం చిమ్మిన ఎక్స్‌ప్రెస్ పెర్ల్
- ఎల్జీబీటీ: స్వలింగ సంపర్కానికి చరిత్ర ఉందా...దానిని భావితరాలకు అందించాలన్న డిమాండ్ ఎందుకు వినిపిస్తోంది?
- క్విజ్: పీవీ సింధు గురించి మీకేం తెలుసు?
- కేరళ: కుటుంబ సభ్యులకు తెలియకుండా పదకొండేళ్ల పాటు ప్రియురాలిని ఇంట్లోనే దాచిన ప్రియుడు
- కోవిడ్-19 వ్యాక్సీన్: రాష్ట్రాల దగ్గర లేదు...కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలా దొరుకుతోంది?
- జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారన్ బఫెట్.. అందరూ పన్ను ఎగవేతదారులేనా
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- కరోనా కాలంలో మోదీ ప్రభుత్వం సామాన్యుల జేబును భద్రంగా చూసుకుందా?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








