'Pawri girl': అయిదు సెకన్ల వీడియో భారత్, పాకిస్తాన్‌లను 'ఏకం' చేసింది

ఫొటో సోర్స్, DANANEERR
- రచయిత, మంజా అన్వర్
- హోదా, బీబీసీ ఉర్దూ, ఇస్లామాబాద్
సోషల్ మీడియాలో ఓ యువతి వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఆ యువతి తన చేతితో మొబైల్ కెమెరా పట్టుకుని ‘ఇది నా కారు’ అంటూ మొదట తన కారును చూపిస్తారు. తర్వాత ‘ఇది మేము’ అంటూ స్నేహితులను చూపెడతారు. తర్వాత ‘ఇక్కడ మా పార్టీ జరుగుతోంది’ అని చెబుతుంటారు.
స్నేహితులతో కలిసి ఆ అమ్మాయి చేసిన ఆ నాలుగు సెకన్ల వీడియో చూస్తుండగానే వైరల్ అయిపోయింది. అంతే కాదు, ఆ వీడియోతో అనేక మీమ్స్ తయారువుతున్నాయి.
భారత్‌కు చెందిన ఒక సంగీత దర్శకుడు ఈ వీడియోను ఉపయోగించి ఏకంగా మాషప్ సాంగ్ కూడా తయారు చేశారు.
'మీమ్'లతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయిన ఈ అమ్మాయి పేరు దనానీర్. పాకిస్తాన్‌లోని పెషావర్ వాసి. 19 ఏళ్ల దనానీర్ ముబీన్ తనను తాను 'కంటెంట్ క్రియేటర్'గా చెప్పుకుంటారు.
మేకప్, ఫ్యాషన్ డిజైన్ల నుంచి మెంటల్ హెల్త్ వరకు ఆమె అనేక విషయాలపై వీడియోలు చేస్తుంటారు.
దనానీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు పది లక్షలకు పైగా వ్యూలు వచ్చాయి. వీడియో వైరల్ అయిన తర్వాత దనానీర్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 2 లక్షలు దాటింది.

ఫొటో సోర్స్, @DANANEERR
కావాలనే ఈ వీడియో చేశారా ?
ఈ వీడియో చేయాలని తాను ముందుగా అనుకోలేదని దనానీర్ బీబీసీతో అన్నారు. స్నేహితులతో కలిసి ఖైబర్ పఖ్తున్ఖ్వాన్‌లోని నాథియా గలీ అనే ప్రాంతానికి వెళ్లారు దనానీర్. భోజనం చేయడానికి ఆగినప్పుడు ఆమె సరదాగా ఈ వీడియో చేసి దాన్ని అప్‌లోడ్ చేశారు.
ఈ వీడియోలో వినిపించినట్లుగా తన గొంతు ఉండదని దనానీర్ చెప్పారు. కావాలని కాస్త గొంతు మార్చి కామిక్ స్టైల్లో అలా చెప్పానని ఆమె వెల్లడించారు.
ఉద్దేశపూర్వకంగానే ‘పార్టీ’ అనే మాటకు బదులు ‘పావ్‌రీ’ అన్నానని, ఇది తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్‌ను నవ్వించడానికి చేసిన ప్రయత్నమని ఆమె చెప్పుకొచ్చారు.
దనానీర్‌పై మీమ్‌లు చేసిన వారిలో పాకిస్తానీలు మాత్రమే కాదు, ఇండియన్లు కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, @YMSTUDIOSPAGE
మాషప్ వీడియోపై ఆమె ఏమన్నారు ?
ప్రపంచమంతా విడిపోయి ఉందని, అలాంటి సమయంలో అందరినీ కలిపే అంశం ఏదైనా ఉంటే అంతకంటే కావాలసింది ఏంటని దనానీర్ అన్నారు.
“నా వీడియో కారణంగా మేము, మా పొరుగువారు(భారతదేశం) కలిసి పార్టీ చేసుకోవడం సంతోషంగా ఉంది” అన్నారు దాననిర్.
తన మాషప్ వీడియోను పోస్ట్ చేస్తూ “ఈ రోజు నుంచి మనం పార్టీ చేసుకోకూడదు.ఎందుకంటే అందులో ఫన్ ఉండదు. ఇక నుంచి మనం ‘పావ్‌రి’ చేసుకోవాలి, అందులోనే మజా ఉంటుంది” అని సంగీత దర్శకుడు యష్ రాజ్ ముఖాటే అనే కామెంట్ చేశారు.

ఫొటో సోర్స్, @DANANEERR
ఇష్టమైన మీమ్ ఏంటి ?
ప్రత్యేకంగా ఇష్టమైన మీమ్ అంటూ తనకు ఏదీ ఉండదని దనానీర్ అంటారు. మీమ్స్ విషయంలో పాకిస్తానీలకు క్రియేటివిటీ ఎక్కువని, హృదయాన్ని తాకేలా ఉంటాయని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, @DANANEERR
వైరల్ అవుతుందని ఊహించారా ?
“ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నప్పుడు ఇది వైరల్ కావాలనిగానీ, అవుతుందనిగానీ నేను అనుకోలేదు” అన్నారు దనానిర్. అందరినీ నవ్వించాలని కోరుకున్నానని, అనుకున్నదానికంటే ఎక్కువే చేయగలిగానని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
“నేను మా ఇంట్లో కొంచెం ఫన్నీగా ఉంటాను. నాకు సన్నిహితులైన వ్యక్తుల దగ్గర నేను సరదాగా మాట్లాడుతుంటాను. ఈ విషయం మా ఇంట్లో వాళ్లకు, స్నేహితులకు తెలుసు” అన్నారు దనానిర్.

ఫొటో సోర్స్, @THECHAAIGUY

ఫొటో సోర్స్, @ZINDAGI
#PawriHoRahiHai హ్యాష్‌ట్యాగ్ పాకిస్తాన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. భారతదేశంతోపాటు అనేక దేశాలలో పలువురు ప్రముఖులు ఈ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోను మీమ్స్ చేస్తూ కొందరు సరదా విషయాలు చెప్పగా, మరికొందరు సామాజిక సమస్యలను ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి:
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- ప్రజాస్వామ్యం నుంచే నిరంకుశత్వం పుడుతుందని ప్లేటో ఎందుకు అన్నారు?
- అమెజాన్ అడవుల్లో 'బంగారు నదుల' గుట్టు బయటపెట్టిన నాసా అరుదైన ఫొటోలు
- మోదీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టాలని ట్విటర్ ప్రయత్నిస్తోందా... భారత ఐటీ చట్టాలు ఏం చెబుతున్నాయి?
- పశ్చిమ బెంగాల్: ‘జై శ్రీరాం’ అంటే తృణమూల్ కాంగ్రెస్‌కు కోపం ఎందుకు?
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- మీరు కరోనాసోమ్నియాతో బాధపడుతున్నారా? దీన్ని ఎదుర్కోవడం ఎలాగో తెలుసా?
- కోవిడ్-19: చిన్న వయసులోనే తోడు కోల్పోయి ఒంటరైన జీవితాలు
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









