హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి... టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన ఎంఐఎం

GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి

ఫొటో సోర్స్, GadwalVijayalakshmi/twitter

ఫొటో క్యాప్షన్, గద్వాల విజయలక్ష్మి
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి అయిన విజయలక్ష్మికి ఎంఐఎం మద్దతు తెలిపింది. డిప్యూటీ మేయర్‌గా మోతే శ్రీలత ఎన్నికయ్యారు.

బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్‌గై ఎన్నికైన విజయలక్ష్మి టీఆర్ఎస్ సీనియర్ నేత కె. కేశ్వరావు కుమార్తె. డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన మోతె శ్లీలత తార్నాక నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

మేయర్ పదవి కోసం బీజేపీ నుంచి ఆర్కేపురం డివిజన్ నుంచి ఎన్నికైన రాధ ధీరజ్ రెడ్డి నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారి కలెక్టర్ శ్వేతా మహంతి ఓటింగ్ నిర్వహించారు. ఆ తరువాత విజయలక్ష్మి మేయర్‌గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఎంఐఎం మద్దతు ఇవ్వడంతో టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుంది.

అంతకు ముందు జీహెచ్ఎంసీకి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి అనుమతించడంతో కార్పొరేటర్లు తమకు అనువైన భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలలో కార్పొరేటర్లు ప్రమాణం చేశారు.

హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత

ఫొటో సోర్స్, Mothe Srilatha/FB

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత

గురువారం ఉదయం నుంచి ఏం జరిగింది...

ఇవాళ హైదరాబాద్ మేయర్ ఎన్నిక జరగబోతోంది. ప్రాంతీయ పార్టీల్లో కూడా సీల్డ్ కవర్ సంస్కృతిని ప్రారంభిస్తూ, టీఆర్ఎస్ పార్టీ రహస్యంగా తమ అభ్యర్థి పేరును ప్రకటించబోతోంది.

ఈరోజు ఉదయం తెలంగాణ భవన్‌లో సమావేశం పూర్తయింది. మేయర్, డిప్యూటి మేయర్ అభ్యర్థుల పేర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన సీల్డు కవర్‌లో ఉంటాయి.

ఎన్నిక కోసం టీఆర్ఎస్ అభ్యర్థులు బస్సులో జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయల్దేరారు.

అయితే, కె. కేశవ రావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతలు మేయర్, డిప్యూటి మేయర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక

ఎన్నిక ఎప్పుడు

మొదట కార్పొరేటర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకోసం కలెక్టర్ శ్వేతా మహంతి ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తారు.

ఈ ప్రక్రియను సీనియర్ ఐఎఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా పర్యవేక్షిస్తారు. ఇప్పటికే ఉన్నతాధికారులు దానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో అభ్యర్థులు ప్రమాణం చేస్తారు.

ఈ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేసారు. ట్రాఫిక్ మళ్లించారు. ఎన్నికకు సంబంధం లేని జీహెచ్ఎంసీ ఉద్యోగులను కూడా కార్యాలయంలోకి రానివ్వడం లేదు.

మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఇప్పటికే తమ కార్పొరేటర్లకు విప్ జారీ చేశాయి. తమ ఎక్స్ అఫీషియో సభ్యులను రంగంలోకి దించాయి. అయితే సంఖ్యాపరంగా సాధారణ మెజార్టీ ఈ ఎన్నికకు సరిపోతుంది కాబట్టి టిఆర్ఎస్ విజయం లాంఛన ప్రక్రియ మాత్రమే.

ఉదయం పదిన్నర తరువాత సమావేశం ప్రారంభం అవుతుంది. ఎన్నికైన ఒక జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మరణించడంతో మిగిలిన 149 మంది ప్రమాణం చేస్తారు.

ఎన్నిక ప్రక్రియ మొత్తం పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 12.30 కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థులు

పకడ్బందీ లెక్కలు

సాధారణ మెజార్టీతో గెలుపు సాధ్యమని తేలడంతో ఎన్ని ఓట్లు వాడాలి, ఎవర్ని వాడాలి అనే అంశంపై టిఆర్ఎస్ తెర వెనుక విస్తృత కసరత్తు చేసింది.

మొత్తం ఎన్నికైన సభ్యులు కాకుండా, మరో 44 మంది ఎక్స్ అఫీషియోలు ఉన్నారు. అయితే టిఆర్ఎస్ పార్టీ ఎక్స్ అఫీషియోలు అందర్నీ ఉపయోగించకుండా, కొందరి ఓట్లు భవిష్యత్తు మునిసిపల్ ఎన్నికలకు పక్కన పెడుతోంది. పూర్తి లెక్కలు ఎన్నికలు పూర్తయ్యాకే తెలుస్తాయి.

వీడియో క్యాప్షన్, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో వెళ్తూ గోరటి వెంకన్న పాట
BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)