వాట్సాప్ ప్రైవసీ పాలసీ: ఫిబ్రవరి 8 నుంచి అకౌంట్ల నిలిపివేత ఉండదు.. మూడు నెలల తర్వాతే కొత్త నిబంధనలు - News reel

వాట్సాప్

ఫొటో సోర్స్, EPA

ఇటీవల తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీని మూడు నెలల తర్వాతే అమలు చేస్తామని వాట్సాప్ తెలిపింది.

ఈ ప్రైవసీ పాలసీపై వాట్సాప్ చాలా విమర్శలు ఎదుర్కొంటోంది. లక్షల మంది వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రాం లాంటి యాప్‌లకు మారినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో వాట్సాప్ తాజా నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి 8 నుంచి ఈ పాలసీని అమలు చేయాలని వాట్సాప్ తొలుత భావించింది. అయితే వినియోగదారుల వ్యక్తిగత గోప్యతా హక్కులను దీనిలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని వార్తలు వెల్లువెత్తాయి. దీంతో తమ కొత్త పాలసీతో వ్యక్తిగత గోప్యతా హక్కులపై ఎలాంటి ప్రభావమూ ఉండదని వాట్సాప్ తాజాగా వివరణ ఇచ్చింది.

‘‘కొత్త అప్‌డేట్ విషయంలో ప్రజల్లో చాలా సందేహాలున్నాయి. ముఖ్యంగా తప్పుదోవ పట్టించే వార్తలు ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నాయి. అందుకే వాస్తవాలేమిటో ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నాం’’అని తమ వెబ్‌సైట్‌లో వాట్సాప్ రాసుకొచ్చింది. ఫిబ్రవరి 8 తర్వాత ఏ అకౌంట్లను నిలిపివేయబోమని స్పష్టతనిచ్చింది.

‘‘కొత్తగా తీసుకొస్తున్న మార్పులన్నీ మే నుంచే అమలులోకి వస్తాయి’’అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)