ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో.. రావణ పాత్రపై వ్యాఖ్యలకు సైఫ్ అలీ ఖాన్ క్షమాపణ చెప్పారు... ఎందుకంటే

సైఫ్ అలీ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రభాస్ రాముడుగా నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రంలో పురాణ పాత్ర రావణాసురుడి గురించి చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ క్షమాపణలు కోరారు. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలనేది తన ఉద్దేశం కాదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

ప్రభాస్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు. తన పాత్ర గురించి ఆయన ఇటీవల ఒక వార్తా పత్రికతో మాట్లాడారు.

"ఒక రాక్షస రాజు పాత్ర పోషించడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇందులో వినోదం కూడా ఉంటుంది. లక్ష్మణుడు తన చెల్లెలు శూర్ఫణక ముక్కు కోయడం వల్లే రావణుడు ప్రతీకారంతో రాముడితో యుద్ధం చేశాడని, సీతను అపహరించాడని ఆ పాత్రకు తగిన కారణం కూడా ఉంటుంది" అన్నారు.

ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియాలో సైఫ్‌కు వ్యతిరేకంగా పోస్టులు చేయడం మొదలుపెట్టారు.

ఆయన ఈ వ్యాఖ్యలు హిందువులను అవమానించడమేనని చాలా మంది అన్నారు. కొంతమంది ఈ సినిమాను బహిష్కరించాలని కూడా అపీల్ చేయడం ప్రారంభించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

దీంతో సైఫ్ అలీ ఖాన్ తన వ్యాఖ్యలపై ఒక ప్రకటన జారీ చేశారు.

"ఒక ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయని, కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని నాకు తెలిసింది. నాకు అలాంటి ఉద్దేశం ఏమాత్రం లేదు. నేను నిజాయితీగా అందరినీ క్షమించమని కోరుతున్నా. నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా" అని చెప్పారు.

సైఫ్ ఈ సినిమాను చెడుపై మంచి సాధించిన విజయానికి వేడుకలా వర్ణించారు.

"శ్రీరాముడు ఎప్పుడూ నాకు సత్యానికి, శౌర్యానికి ప్రతీకగా నిలిచారు. ఆదిపురుష్ చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే వేడుక గురించి. మహాకావ్యాన్ని ఏ లోపం లేకుండా అందించేందుకు మా మొత్తం టీమ్ కలిసి పనిచేస్తోంది" అన్నారు.

ఆదిపురుష్ ఎలాంటి సినిమా?

ప్రభాస్ లీడ్ రోల్ చేస్తున్న ఆదిపురుష్ సినిమాను తెలుగు, హిందీలలో తీయడంతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా డబ్ చేయనున్నారు.

రామాయణం ఆధారంగా తీస్తున్న ఆదిపురుష్‌కు ఓం రావుత్ డైరెక్టర్. ఆయన 'తానాజీ: ద అన్‌సంగ్ వారియర్' సినిమాకు దర్శకత్వం వహించారు.

ఆదిపురుష్ సినిమా ఇంకా మొదలవలేదు. వచ్చే ఏడాది దీని షూటింగ్ ప్రారంభం కానుంది. 2022లో విడుదల అవుతుందని అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)