రైతుల నిరసన: కేంద్రంతో చర్చల్లో రైతు సంఘాల ప్రతినిధుల ‘మౌన వ్రతం’

రైతుల నిరసనలు

రైతు సంఘాల ప్రతినిధులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో.. తాము 'మౌన వ్రతం' పాటించామని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలన్న తమ డిమాండ్‌ను అంగీకరిస్తున్నదీ లేనిదీ ఒక్క ముక్కలో.. 'యస్ ఆర్ నో' తేల్చి చెప్పాలని కోరుతూ తాము మౌనం పాటించామని వారు వివరించారు.

శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ కీలక చర్చలు జరిగాయి. తదుపరి చర్చల కోసం డిసెంబర్ 9వ తేదీన మరోసారి సమావేశం అయ్యేందుకు రైతులకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

"డిసెంబర్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం, వారి ప్రతిపాదనలను మాకు పంపుతుంది, వాటి గురించి మాలో మేము చర్చించుకున్న తరువాత అదే రోజు ప్రభుత్వంతో మళ్లీ సమావేశమవుతాం" అని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపినట్లుగా ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

''మేం ఏడాదికి సరిపడా సరుకులు తెచ్చుకున్నాం. గత కొద్ది రోజులుగా రోడ్డు మీదే ఉన్నాం. మేం రోడ్డు మీదే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటే మాకేం ఇబ్బంది లేదు. హింసా మార్గం అనుసరించబోం. నిరసన ప్రాంతాల్లో మేం ఏం చేస్తున్నామో ఇంటెలిజెన్స్ బ్యూరో మీకు సమాచారం ఇస్తుంది'' అని రైతు సంఘాల నాయకులు సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో చెప్పారని ఏఎన్ఐ పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''మాకు కార్పొరేట్ వ్యవసాయం వద్దు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం లబ్ధి పొందుతుంది.. రైతులు కాదు'' అని వారు స్పష్టంచేశారు.

ఈ అంశంపై గట్టి ప్రతిపాదనలు రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నుంచి కొంత సమయం కోరిందని, తదుపరి సమావేశం డిసెంబర్ 9న జరగనుందని ప్రెస్ ట్రస్ట్ ఇండియా పేర్కొంది.

వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఈ నెల 8వ తేదీన భారత్ బంద్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరింత మంది రైతులు దిల్లీ వైపు తరలి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కొనసాగుతుందని, ఏపీఎంసీని బలోపేతం చెయ్యడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రైతులకు చెప్పామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు.

‘‘ఈ కొత్త చట్టాలు ఎంఎస్‌పీపై ప్రభావం చూపవని, ఇందులో ఏమైనా సందేహాలుంటే వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ఆయన తెలిపినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

దిల్లీలో రైతుల నిరసన ప్రదర్శన

ఫొటో సోర్స్, Hindustan Times

ఫొటో క్యాప్షన్, దిల్లీలో రైతుల నిరసన ప్రదర్శన

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులతో శనివారం ఐదో విడత చర్చలకు ముందు ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ పాల్గొన్నారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని నివాసం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలను ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మరోవైపు.. దిల్లీ సరిహద్దుల్లో మాత్రం రైతుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

"ప్రభుత్వం చర్చలు మాటిమాటికీ వాయిదా వేస్తోంది, ఈరోజు జరిగే చర్చలనే చివరివిగా భావించాలని అన్ని రైతు సంఘాలూ నిర్ణయించాయ"ని ఆందోళనలు చేస్తున్న రైతులు ఏఎన్ఐతో చెప్పారు.

కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలూ వెనక్కు తీసుకోవాలని, ఎంఎస్‌పీ కొనసాగిస్తామని తమకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రైతుల నిరసనలు

అటు, కిసాన్ మహా పంచాయత్ అధ్యక్షుడు రాంపాల్ సింగ్ మరోసారి రైతుల డిమాండ్ల గురించి చెప్పారు.

"ఈరోజు సమావేశంలో వేరే ఏ అంశాల గురించీ చర్చించం. చట్టాలు రద్దు చేయాలనే డిమాండ్ చేస్తాం" అన్నారు.

కేంద్రంతో జరిగే చర్చల్లో రైతుల సందేహాలు దూరం అవుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌధరి ఏఎన్ఐతో అన్నారు.

"ఇవి విపక్షాల రాజకీయాలు, అవి వ్యతిరేకతలు రెచ్చగొడుతున్నాయి. ఈ చర్చలు సఫలమైతే, ప్రదర్శనలు చేస్తున్న రైతులు వెనక్కు తగ్గుతార"ని చెప్పారు.

దిల్లీలో రైతుల నిరసన ప్రదర్శన

ఫొటో సోర్స్, Hindustan Times

పరిష్కారం కాకుంటే పార్లమెంటు ముట్టడి-రైతులు

కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు ఇప్పటికీ దిల్లీ-నోయిడా లింక్ రోడ్డుపై చిల్లీ బార్డర్ దగ్గర ధర్నా చేస్తున్నారు.

"ఈరోజు ప్రభుత్వంతో జరిగే చర్చల్లో ఎలాంటి పరిష్కారం లభించకపోతే, పార్లమెంటును ముట్టడిస్తామ"ని చెప్పారు.

నోయిడా లింక్ రోడ్డుపై గౌతమ్ బుద్ధ ద్వారం దగ్గర రైతులు ధర్నా చేస్తుండడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు.

నోయిడా నుంచి దిల్లీ వచ్చే వారు డీఎన్‌డీ టోల్ రోడ్‌ను ఉపయోగించుకోవాలని దిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

మరోవైపు రైతుల నిరసన ప్రదర్శనలతో వల్ల దిల్లీ-యూపీలను కలిపే జాతీయ రహదారిపై ఘాజీపూర్ బోర్డర్ దగ్గర రాకపోకలను కూడా నిలిపివేశారు.

దిల్లీ-హరియాణా మధ్య ఝాటికారా బోర్డర్ నుంచి ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. టికరీ, ఝరోదా సరిహద్దులు మూసివేశారు.

రైతుల నిరసనలు

సరిహద్దుల్లో రైతులు ఏం చేస్తున్నారు

దిల్లీ-హరియాణా బోర్డర్‌లో నిరసన ప్రదర్శనల్లో ఉన్న రైతులకు స్థానికులు సాయం చేస్తున్నారు. రాత్రి రైతులకు టీ కూడా ఇచ్చారు.

కొన్ని స్వచ్ఛంద సంస్థలు రైతులకు మందులు కూడా అందిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఈ మందులు రైతులకు ఉపయోగపడతాయని వారు చెబుతున్నారు.

గురువారం రైతు సంఘాల నేతలు, ప్రభుత్వం మధ్య జరిగిన నాలుగో దశ చర్చల విఫలమయ్యాయి.

రైతుల నిరసనలు

డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపు

రైతు సంఘాలు డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించకపోతే. ఆ రోజు దిల్లీలోని అన్ని టోల్ ప్లాజాలనూ ముట్టడిస్తామని హెచ్చరించాయి.

శనివారం జరిగే చర్చల్లో ప్రభుత్వం మా డిమాండ్లు అంగీకరించకపోతే, మా నిరసనలు మరింత తీవ్రం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత గుర్నామ్ సింగ్ చడూనీ చెప్పారు.

"వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోకపోతే, ముందు ముందు దిల్లీలోపలికి వచ్చే అన్ని రహదారులనూ అడ్డుకుంటాం" అని హెచ్చరించారు.

గత 9 రోజులుగా హరియాణా, పంజాబ్, మిగతా రాష్ట్రాల రైతుల దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)