జీహెచ్ఎంసీ ఎన్నికలు: ముగిసిన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు 35.80 శాతం పోలింగ్ నమోదు

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు - శాతం పోలింగ్ నమోదయింది.
ఉదయం నుంచీ పోలింగ్ చాలా నెమ్మదిగానే సాగింది. ఉదయం 9 గంటలకు 3.1 శాతం, 11 గంటలకు 8.9 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 18.2 శాతం, 3 గంటలకు 25.66 శాతం, 4 గంటలకు 29.76 శాతం, సాయంత్రం 5 గంటలకు 35.80 శాతం పోలింగ్ నమోదు అయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మధ్యాహ్నం వరకూ వృద్ధులూ, మహిళలే పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడానికి వచ్చారు. వికలాంగులు, నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారు చాలా మంది ఓట్లు వేయడంలో ముందున్నారు.
హైదరాబాద్ పాత బస్తీలో పోలింగ్ చాలా తక్కువ శాతం నమోదు అయింది.
ఎన్నికల ఏర్పాట్లలో కోవిడ్ జాగ్రత్తలు, దుబ్బాకతో పోలిస్తే తక్కువనే చెప్పాలి. దుబ్బాక ఎన్నికల్లో భారత ఎన్నికల సంఘం సిబ్బంది అందరికీ ఫేస్ షీల్డులు ఇచ్చారు. లోపలికి వచ్చేప్పుడు శానిటైజర్, ఒక పాలిథీన్ గ్లౌజ్ ఇచ్చారు.

కానీ హైదరాబాద్ ఎన్నికల్లో శానిటైజర్ పెట్టినా, తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలని ఒత్తిడి చేయలేదు. అలాగే గ్లౌజులు ఇవ్వలేదు.
పలువురు సినీ నటులు, అధికారులు, రాజకీయ నాయకులు ఓటు హక్కు వినియోగించుకుని సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెట్టారు.
ఓటింగ్ శాతం తక్కువ ఉండడంతో, ఐకియా ఓపెనింగ్ రోజు ఫోటోలు పెట్టిమరీ జనాన్ని బయటకు రావాల్సిందిగా అభ్యర్థించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
26వ నంబరు డివిజన్ ఓల్డ్ మలక్ పేటలో సీపీఐ అభ్యర్థి పోటీ చేస్తుండగా అక్కడ పొరబాటున సీపీఎం గుర్తు వచ్చింది. సీపీఎం గుర్తు సుత్తి, కొడవలి, నక్షత్రం కాగా, సీపీఐ గుర్తు కంకి కొడవలి. దీంతో అక్కడి అభ్యర్థి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా, అక్కడ ఎన్నిక నిలిపివేశారు.
తిరిగి మూడో తేదీన అక్కడ ఎన్నిక జరుగుతుంది. దీంతో ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఈ ఎన్నిక ఆపడానికి కారణమైన అక్కడి సీపీఐ అభ్యర్థి ఫాతిమాను, స్థానిక ఎంఐఎం నాయకుడు అహ్మద్ బలాల బెదిరించారనీ, ఆయనపై కేసు నమోదు చేయాలనీ సీపీఐ పార్టీ డిమాండ్ చేసింది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గతంలో నిజామాబాద్ లోనూ, ఇప్పుడు హైదరాబాద్ లోనూ రెండుసార్లు ఓటు వేశారనీ, ఇది అనైతికం అంటూ కాంగ్రెస్ ఆరోపించగా, ఆమె తన ఓటును హైదరాబాద్ కి బదిలీ చేయించుకున్నారని ఆమె కార్యాలయం వివరణ ఇచ్చింది.
ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పై బీజేపీ ఫిర్యాదు చేసింది.
ఇవి కూడా చదవండి:
- చిదంబరం నటరాజ ఆలయం.. భూ అయస్కాంత క్షేత్రం నడిబొడ్డున ఉందా?
- జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు పెరిగాయా?
- తుపాన్లకు పేర్లను ఎవరు పెడతారు?
- ఎడారిలో అంతుచిక్కని లోహస్తంభం... అకస్మాత్తుగా ప్రత్యక్షం.. అదే తీరులో అదృశ్యం.. ఏలియన్స్ పనా?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- టెడ్ గోయి: రెండు సార్లు... బికారి నుంచి బిలియనీర్‌గా ఎదిగిన డోనట్ కింగ్
- కన్యత్వాన్ని పునరుద్ధరిస్తామంటూ క్లినిక్‌ల అనైతిక వ్యాపారం
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- పంజాబ్ రైతుల మాదిరిగా.. వేరే రాష్ట్రాల రైతులు ఎందుకు ఆందోళనలు చెయ్యట్లేదు?
- OIC విదేశాంగ మంత్రుల సమావేశంలో కశ్మీర్ ప్రస్తావన పాకిస్తాన్ విజయమేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








