OIC విదేశాంగ మంత్రుల సమావేశంలో కశ్మీర్ ప్రస్తావన పాకిస్తాన్ విజయమేనా

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లామిక్ దేశాల సంస్థ (OIC) సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో చేసిన తీర్మానాన్ని భారత్ కొట్టిపారేసింది. ఈ తీర్మానంలో కశ్మీర్ గురించి ప్రస్తావించారు.
ఓఐసీలో ఆమోదించిన తీర్మానంలో భారత్ గురించి వాస్తవానికి విరుద్ధంగా, అనుచితంగా ప్రస్తావించారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ చెప్పింది.
నైజర్ రాజధాని నియామేలో నవంబర్ 27, 28న ఓఐసీ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ (CFM) సమావేశం జరిగింది. ఇదే సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో కశ్మీర్ ప్రస్తావన కూడా ఉంది.
ఓఐసీ సభ్య దేశాల్లో ఒకటైన పాకిస్తాన్ తరపున విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన కశ్మీర్ అంశాన్ని గట్టిగా లేవనెత్తారు.
ఓఐసీ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై పాకిస్తాన్ సంతోషంగా ఉంది. ఈ తీర్మానాన్ని నియామే డిక్లరేషన్ అంటున్నారు. పాకిస్తాన్ దీన్ని స్వాగతించింది.
భారత్ గత ఏడాది ఆగస్టు 5న కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది. అప్పటి నుంచి అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఈ అంశాన్ని లేవనెత్తుతోంది. కానీ ఇప్పటివరకూ అది అందులో పెద్దగా విజయం సాధించలేకపోయింది. ఓఐసీ కూడా దీనిపై ఇప్పటివరకూ గట్టిగా మాట్లాడలేదు.

ఫొటో సోర్స్, @SMQureshiPTI
ఖండించిన భారత్
ఓఐసీలోని సీఎఫ్ఎం ఆమోదించిన తీర్మానంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది.
"నైజర్ రాజధాని నియామేలో జరిగిన ఓఐసీ 47వ సీఎఫ్ఎం సమావేశంలో భారత్ గురించి వాస్తవానికి విరుద్ధంగా, అనుచితంగా, అకారణంగా ప్రస్తావిస్తూ ఆమోదించిన తీర్మానాన్ని మేం తిరస్కరిస్తున్నాం. భారత అంతర్గత వ్యవహారాల గురించి చర్చించడానికి ఓఐసీకి ఎలాంటి హక్కూ లేదని మేం ఎప్పుడూ చెబుతూనే వస్తున్నాం. జమ్ము-కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. దీనిపై మాట్లాడ్డానికి ఓఐసీకి ఎలాంటి హక్కూ లేదు" అని దానిలో చెప్పారు.
"మత సహనం, తీవ్రవాదం, మైనారిటీలను హింసించడంలో ఘోరమైన రికార్డు ఉన్న ఒక దేశం.. భారత్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడానికి ఓఐసీ వేదికను దుర్వినియోగం చేసేందుకు అనుమతించడం విచారకరం. భవిష్యత్‌లో భారత్ గురించి ఇలాంటి ప్రస్తావనలు చేయకుండా చూడాలని ఓఐసీకి మేం గట్టిగా చెబుతున్నాం" అని పేర్కొంది.
ఓఐసీ విదేశాగ మంత్రుల సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో కశ్మీర్‌ను కూడా చేర్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అయితే కశ్మీర్ అంశాన్ని ఓఐసీ సీఎఫ్ఎం ఎజెండాలో మాత్రం చేర్చలేదు. కశ్మీర్ వివాదంపై ఓఐసీ ఎప్పుడూ ఒకే మాట చెబుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానం ప్రకారం దీనికి శాంతిపూర్వక పరిష్కారం కనుగొనాలని అంటోంది.
అయితే, ఓఐసీ తీర్మానంలో కశ్మీర్ ప్రస్తావన లాంఛనమేనని, దాని గురించి భారత్ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్నారు. పాకిస్తాన్ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఈ సమావేశంలో కశ్మీర్ అంశాన్ని ఒక ప్రత్యేక ఎజెండాగా చేర్చలేదు.
ఓఐసీలో సౌదీ అరేబియా, యూఏఈ ఆధిపత్యం ఉంది. ఈ రెండు దేశాలతో పాకిస్తాన్ సంబంధాలు అంత మెరుగ్గా లేవు. పాకిస్తాన్ తాము ఇచ్చిన రుణాలను త్వరగా చెల్లించాలని సౌదీ అరేబియా కోరుతోంది. ముఖ్యంగా ఓఐసీకి సమాంతరంగా టర్కీ, ఇరాన్, మలేషియాతో కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించినప్పటి నుంచి ఇది జరుగుతోంది. గత వారం పాకిస్తాన్ పౌరుల కోసం కొత్త వీసాలు జారీ చేయడంపై యూఏఈ తాత్కాలిక నిషేధం విధించింది.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఓఐసీ సమావేశంలో ఈ అంశాలు కూడా లేవనెత్తారు. కానీ ఇప్పటివరకూ దీనిపై ఆ దేశాలు ఎలాంటి గట్టి హామీ ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Getty Images
నియామే డిక్లరేషన్‌లో కశ్మీర్ ప్రస్తావన పాక్ విజయమా
గత ఏడాది మార్చిలో అబుదాబిలో ఈ సమావేశం జరగింది. దీనికి భారత అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కూడా ఆహ్వానించారు.
దీనిని పాకిస్తాన్ వ్యతిరేకించింది. ప్రారంభ వేడుకలను బహిష్కరించింది. అప్పుడు సుష్మా స్వరాజ్ ఓఐసీ సీఎఫ్ఎం సమావేశంలో ప్రసంగించారు. అప్పుడు చేసిన తీర్మానంలో కశ్మీర్ గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. అందులో భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను తిరిగి పంపించాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.
ఓఐసీ విదేశాంగ మంత్రుల సమావేశంలో చేసే తీర్మానాల్లో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం కొత్త విషయమేం కాదు. ఇంతకు ముందు కూడా దానిని ప్రస్తావించేవారు.
నియామే డిక్లరేషన్‌లోని 8వ ఆపరేటివ్ పారగ్రాఫ్‌లో యూఎన్ భద్రతామండలి తీర్మానానికి అనుగుణంగా జమ్ము-కశ్మీర్ వివాదానికి శాంతిపూర్వక పరిష్కారం కనుగొనాలని ఓఐసీ కోరుకుంటోందని, ఎప్పుడూ తాము అదే కోరుకుంటున్నామని చెప్పింది.

ఫొటో సోర్స్, @SMQureshiPTI
లాంఛనప్రాయమే
గత ఏడాది జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత ఓఐసీ విదేశాంగ మంత్రుల సమావేశం జరగడం ఇదే మొదటిసారి. దీంతో, కశ్మీర్ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా ఈసారి ఏదైనా ప్రకటన జారీ చేస్తారని పాకిస్తాన్ ఆశించింది. కానీ అలా జరగలేదు.
భారత్‌లో పాకిస్తాన్ రాయబారిగా ఉన్న అబ్దుల్ బాసిత్ ట్విటర్‌లో దీనిపై ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో ఆయన నియామే డిక్లరేషన్ గురించి చాలా చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"ఆగస్టు 5 తర్వాత ఇది తొలి ఓఐసీ విదేశాంగ మంత్రుల సమావేశం. ఇందులో భారత్ గురించి గట్టిగా ఏదైనా ప్రకటన వస్తుందని మేం ఆశించాం. భారత నిర్ణయాన్ని ఖండిస్తారని మాకు అనిపించింది. కానీ అలా జరగలేదు. డిక్లరేషన్‌లో పాకిస్తాన్‌కు అంత సంతోషం ఇచ్చే విషయమేం లేదు".
"ఇందులో పాలస్తీనా, అజర్‌బైజాన్, తీవ్రవాదం గురించి ప్రస్తావించినట్లు కశ్మీర్ గురించి చెప్పలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అందులో కనీసం ప్రస్తావించినందుకు సంతోషించాలి. భారత్ చర్యలను ఖండించి ఉండాల్సింది. కానీ, అలా జరగలేదు. నైజర్‌తో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కాన్ఫరెన్స్ జరిగిన కన్వెన్షన్ సెంటర్ కూడా భారత్ సాయంతోనే నిర్మించారు" అన్నారు.
మాల్దీవులు కూడా ఓఐసీ సభ్య దేశం. ఈ సమావేశంలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ పాల్గొన్నారు.
నవంబర్ 27న ఆయన తన ట్విటర్‌లో నియామేలో సమావేశం జరగబోయే కన్వెన్షన్ సెంటర్ ఫొటోలు పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
వాటితోపాటూ ఓఐసీ 47వ సీఎఫ్ఎం సమావేశం నియామేలోని అందమైన మహాత్మాగాంధీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగబోతోందని రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
అయితే ఓఐసీ సమావేశంలో కశ్మీర్ ప్రస్తావనను పాక్ తన విజయంగా చూస్తోంది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ట్విటర్‌లో "నియామే డిక్లరేషన్‌లో జమ్ము-కశ్మీర్ వివాదాన్ని చేర్చడం అనేది, ఓఐసీ కశ్మీర్ అంశంలో ఎప్పుడూ అండగా ఉంటుందనే విషయాన్ని చెబుతోంది" అని పెట్టింది.
కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని భారత్ రద్దు చేసినప్పటి నుంచీ పాకిస్తాన్ ఓఐసీ విదేశాంగ మంత్రుల సమావేశానికి పిలుపునివ్వాలని డిమాండ్ చేస్తోంది. కానీ దాని గోడు ఎవరూ పట్టించుకోలేదు.
దాంతో, ఓఐసీ నుంచి ఏకంగా తప్పుకుంటామని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఈ ఏడాది ఆగస్టులో బెదిరించే వరకూ వెళ్లింది. దీనిపై సౌదీ అరేబియా ఆగ్రహించడంతో పాకిస్తాన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తర్వాత పరిస్థితిని చక్కదిద్దడానికి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా సౌదీకి వెళ్లాల్సి వచ్చింది.
కశ్మీర్ అంశంలో ఇస్లామిక్ దేశాల మద్దతు కూడగట్టడంలో కూడా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విఫలమయ్యారని పాకిస్తాన్‌లో వరుస విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ సౌదీ అరేబియాకు దూరమై టర్కీకి చేరువ అవుతోందా... ఎందుకు?
- 26/11 ముంబయి దాడులకు పన్నెండేళ్లు... హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ ఇప్పుడే ఎందుకు శిక్షిస్తోంది?
- పాకిస్తాన్‌లో ఏం జరుగుతోంది? ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలుతుందా?
- ఇండియా-పాకిస్తాన్ ఎల్ఓసీ: సరిహద్దు రేఖను పొరపాటున దాటినా... వెనక్కి రావడం కష్టమే
- 26/11 ముంబయి దాడులు: ‘ఆ మారణకాండ నుంచి నేనెలా బైటపడ్డానంటే..’
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








