ఆ విగ్రహం ధ్వంసం చేశారనటం ఫేక్ న్యూస్: ఏపీ పోలీసులు

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీ రాసిన 'మత ప్రచారకులను రావొద్దంటున్న ఈ బోర్డులు నిజంగానే ఉన్నాయా?' కథనానికి ఫేస్‌బుక్ కామెంట్లలో.. ''నరసరావుపేటలో దారుణం. శృంగేరీ శంకర మఠం సమీపంలో ఉన్న సరస్వతీ విగ్రహం దారుణంగా ద్వoసం.. విగ్రహంపై మద్యం పోసి బాటిళ్లతో కొట్టారు.. ఎందుకింత కక్ష..ఏంటీ పైశాచికత్వం?!'' అంటూ ఓ ఫొటో పోస్టు చేశారు.
అదే ఫొటో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అయితే అది ఫేక్ న్యుస్ అని గుంటూరు (రూరల్) జిల్లా పోలీసులు దృవీకరించారు. ''ఉదయం నరసరావుపేటలో సరస్వతీ దేవీ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నట్లు వచ్చిన న్యూస్ పూర్తిగా సత్యదూరం, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు'' అని పోలీసులు ట్విటర్ ద్వారా తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆ విగ్రహం ధ్వంసం గురించి ఆ స్థల యజమాని వివరణ ఇస్తున్న వీడియో కూడా ఒకటి పోస్టు చేశారు. రెండు సంవత్సరాల కిందటే ఆ విగ్రహం పగిలిందని వివరించారు స్థల యజమాని కపిలవాయి విజయ కుమార్.
''ఈ స్థలాన్ని 20 సంవత్సరాల క్రితం కృష్ణవేణి కాలేజీకి అద్దెకు ఇవ్వడం జరిగింది. రెండు సంవత్సరాల కిందట వారు బిల్డింగులు కూలకొట్టినప్పుడే ఈ విగ్రహం పగిలిపోయింది. కానీ సోషల్ మీడియాలో ఇది ఇప్పుడే పగలగొట్టారని కొంత మంది చేస్తున్న ప్రచారం అవాస్తవం'' అని ఆయన ఆ వీడియోలో తెలిపారు.
కపిలవాయి విజయ కుమార్‌తో బీబీసీ మాట్లాడింది. ‘‘విగ్రహం కాలేజిలో ప్రతిష్టించిన విగ్రహం కాదు. కృష్ణవేణి కాలేజి వారు పక్కనే ఉన్న బిల్డింగు స్లాబు కూలగొట్టే క్రమంలో పగిలిపోయింది. అందుకే ఆ విగ్రహం అక్కడే ఉంచేశారు. ఇప్పుడు కొందరు దాన్ని మతం పేరుతో ప్రచారం చేస్తున్నారు" అని ఆయన వివరించారు.
దీనిపై ఆంధ్రప్రదేశ్ డిజీపీ గౌతమ్ సావంగ్ బీబీసీతో మాట్లాడుతూ.. ''కేసు నమోదు చేశాము. అవాస్తవ ప్రచారానికి పాలుపడ్తున్న వారిపై చర్యలు తీసుకుంటాము'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- Fake News -'ఫేక్ న్యూస్' గుర్తించడం ఎలా- - BBC News తెలుగు
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- ఇంతకూ బిర్యానీ హైదరాబాద్‌ది కాదా?
- నమ్మకాలు - నిజాలు: అలర్జీలు ఆడవాళ్లకేనా?
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








