తామరైపాక్కంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి

ఫొటో సోర్స్, SPB/ FB
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ఈ రోజు ఉదయం తామరైపాక్కంలోని ఆయన ఫామ్‌హౌస్‌లో జరిగాయి.
పోలీసు గౌరవ వందనంతో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1
ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలుకు అంత్యక్రియలు జరపనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి శుక్రవారం ప్రకటించారు. ఆ మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

కరోనా కారణంగా ఈ అంత్యక్రియలకు గరిష్టంగా 100కంటే ఎక్కువమందికి అనుమతి లేదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.
అయినప్పటికీ తామరైపాక్కంలోని బాలసుబ్రహ్మణ్యం ఫామ్‌హౌస్ వద్దకు వేలాది మంది అభిమానులు వచ్చి, ఆయన్ను కడసారి చూసి, వీడ్కోలు పలికారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2
శుక్రవారం ఆయన్ను కడసారి దర్శించుకునేందుకు చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న ఆయన నివాసానికి వేలాది అభిమానులు తరలి వచ్చారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
అభిమానుల తాకిడి పెరుగుతున్నందున ఎస్‌పీబీ భౌతిక కాయాన్ని ఆయన ఇంటి నుంచి అంత్యక్రియలు జరిగే తామరైపాక్కం ఫామ్‌హౌస్‌కు తరలించాలని ఆయన కుటుంబీకులకు అధికారులు సూచించారు.
శుక్రవారం సాయంత్రం 7.45 గంటలకు అంబులెన్స్ ద్వారా బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని తామరైపాక్కం తీసుకెళ్లారు.
దారిలో అభిమానులు ఆయన మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు ఎదురెళ్లి నివాళులర్పించారు. పూలు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
పోలీసు ఆంక్షలు
కోవిడ్-19 వ్యాప్తి కారణంగా బాలు అంత్యక్రియలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు సాధారణ ప్రజలకు అనుమతిలేదని తిరువళ్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అరవిందన్ సూచించారు. కరోనా వ్యాప్తి కారణంగా రద్దీని నివారించాల్సి ఉందని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
ఒక్క తమిళనాడులోనే కాదు భారత ప్రజలందరి హృదయాలలో నిండిపోయిన ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంకు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగతాయని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.
సమాజంలో పేరు ప్రతిష్టలున్న వ్యక్తులకు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడం ఆనవాయితీ. తమిళనాడులో చిత్ర పరిశ్రమకు చెందిన శివాజీ గణేశన్ మరణించినప్పుడు ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆ తర్వాత ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యానికి ఆ గౌరవం దక్కింది.

కర్ణాటక సంతాపం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళిగా కర్ణాటక ప్రభుత్వం ఒక రోజు సంతాప దినం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాల మీద ఉన్న త్రివర్ణ పతాకాలను సగం వరకు అవనతం చేస్తారు.
ఎస్పీ బాలుకు చెన్నై సూపర్ కింగ్స్ నివాళి
గాయకుడు ఎస్‌పీబీకి నివాళిగా శుక్రవారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు సభ్యులు బ్లాక్ బ్యాండ్స్ ధరించి మ్యాచ్‌లో పాల్గొన్నారు.

కన్నీరుపెట్టిన అభిమానులు
బాలసుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తామరైపాక్కం ఫామ్‌హౌస్‌కు తరలించడానికి ముందు ఆయన్నుకడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తారు.
నుంగంబాక్కంలోని ఆయన నివాసం వద్ద కిలోమీటర్ల మేర అభిమానులు బారులు తీరారు. అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులు బాలసుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు.
కరోనా కారణంగా వ్యక్తిగతంగా ఆయన్ను కడసారి చూసేందుకు రాలేకపోయిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా 2020 ఎన్నికల సర్వే: ట్రంప్, బైడెన్లలో పైచేయి ఎవరిది?
- ప్రపంచ గర్భ నిరోధక దినం: కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కరోనావైరస్: చెంచాడు గోధుమ పిండి చాలు మీ శానిటైజర్ మంచిదో కాదో చెప్పడానికి
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










