అనుష్కశర్మకు సునీల్ గావస్కర్ మీద కోపం ఎందుకు వచ్చింది... అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సునీల్ గావస్కర్ తీరుపై సినీ నటి అనుష్క శర్మ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని అనుష్క శర్మ పెళ్లాడిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్‌లో కోహ్లీ కెప్టెన్సీ వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు చేతిలో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో ఐదు బంతులు ఎదుర్కొన్న కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేసి, ఔటయ్యాడు.
కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సునీల్ గావస్కర్ టీవీలో వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు.

ఫొటో సోర్స్, IPL
ఈ సమయంలో అనుష్క గురించి ప్రస్తావిస్తూ గావస్కర్ చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
‘‘లాక్‌డౌన్‌లో కోహ్లీ కేవలం అనుష్క బౌలింగ్‌తోనే ప్రాక్టీస్ చేశారు. అది వీడియోలో చూశాం. దాని వల్ల జరిగేదేం లేదు’’ అని గావస్కర్ అన్నారు.
అయితే, ఆయన వ్యాఖ్యలు ద్వంద్వార్థం ధ్వనించేలా ఉన్నాయంటూ చాలా మంది సోషల్ మీడియాలో స్పందించారు. గావస్కర్ క్షమాపణలు చెప్పాలని కూడా కొంతమంది డిమాండ్ చేశారు.
గావస్కర్ వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుగా చిత్రీకరిస్తున్నారన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి.
‘‘లాక్‌డౌన్ సమయంలో అనుష్కతో క్రికెట్ ఆడుతూ కోహ్లీ కనిపించారు. వారి ఇరుగుపొరుగు వాళ్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గావస్కర్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు. కావాలని దాంట్లో తప్పుడు అర్థం వెతుకుతున్నారు’’ అని జాయ్ భట్టాచార్య్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మరోవైపు గావస్కర్ తీరును తప్పుపడుతూ అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.
‘‘మిస్టర్ సునీల్ గావస్కర్, మీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓ క్రికెటర్ ఆటతీరుకు అతడి భార్యది బాధ్యత అవుతుందనేలా మీరు ఎలా మాట్లాడతారు? క్రికెటర్ల వ్యక్తిగత జీవితాలను కొన్నేళ్లుగా మీరు గౌరవిస్తూ వచ్చారని నాకు తెలుసు. నా విషయంలో మాత్రం మీరు అలా ఎందుకు ఉండరు?’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
‘‘గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో నా భర్త ఆటతీరును వర్ణించేందుకు మీ వద్ద వేరే వాక్యాలు, పదాలు ఉండే ఉంటాయి. నా పేరును ప్రస్తావిస్తేనే వాటికి అర్థం వస్తుందా? ఇది 2020. అయినా, నాకు మాత్రం ఏమీ మారినట్లుగా అనిపించడం లేదు. క్రికెట్‌లోకి నన్ను లాగకుండా ఉండే పరిస్థితి ఎప్పుడు వస్తుందో? మీరు ఒక గొప్ప క్రీడాకారులు. మీ మాటలకు చాలా విలువ ఉంటుంది. కానీ, మీ వ్యాఖ్యలను విన్నప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలియజేయాలనుకున్నా’’ అంటూ అనుష్కశర్మ ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ పోస్టు పెట్టిన తర్వాత ట్విటర్‌లో #AnushkaSharma, #SunilGavaskar హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్త్ సహా చాలా మంది అనుష్కకు మద్దతుగా పోస్టులు పెట్టారు.
‘‘ఇలాంటి చెత్త మాటలు ఎవరు మాట్లాడినా, బహిరంగంగా వ్యతిరేకించాలి’’ అని బర్ఖా దత్త్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
సినీ నటి జరీన్ ఖాన్ కూడా అనుష్కను సమర్థిస్తూ ట్వీట్ పెట్టారు.
‘‘ఇది ఇక మాట్లాడక తప్పని పరిస్థితి. మీకు అలా అనిపించడం లేదా?’’ అని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఈ ఏడాది మేలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తమ ఇంటి టెర్రస్‌పైన క్రికెట్ ఆడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సునీల్ గావస్కర్ ఈ వీడియో గురించి తన వ్యాఖ్యానంలో ప్రస్తావించారని, ఆయన్ను అనవసరంగా తప్పుపడుతున్నారని చాలా మంది అభిప్రాయపడ్డారు.
నిజానికి, గావస్కర్ వ్యాఖ్యల్లో ఒకటి రెండు పదాలను తప్పుడు అర్థం వచ్చేలా మార్చి, ఆయన వ్యాఖ్యలేనంటూ కొంతమంది ట్విటర్‌లో ప్రచారం చేశారు.
ఇవి కూడా చదవండి:
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)