ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం: కోట్ల హృదయాలను గెల్చుకున్న స్వరం

వీడియో క్యాప్షన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం: గాన గంధర్వుడు ఇక లేరు

గాన గంధర్వుడిగా ఎందరి నుంచో ప్రశంసలు అందుకున్న విఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు.

సుమధుర గాత్రంతో సినీ సంగీత అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన బాలు తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాటలు పాడారు. వెండితెర మీద కనిపిస్తున్న నటులే పాడుతున్నారా అనిపించేలా వారికి గాత్రం ఇవ్వడం ఆయన ప్రత్యేకత.

దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ తన గాత్ర మాధుర్యంతో కోట్లాది ప్రజలను మైమరపించిన బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త తెలిసి దేశవ్యాప్తంగా సినీ రంగంతో పాటు ఇతర రంగాలకు చెందినవారి నుంచి సంతాపాలు వెల్లువెత్తున్నాయి.

ఇది ఈ గానగంధర్వుడి సంగీత యాత్రను స్మరించుకునే వీడియో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)