నరేంద్ర మోదీ వెబ్‌సైట్, యాప్‌ ట్విటర్ అకౌంట్ హ్యాక్

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Reuters

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్, యాప్‌కు చెందిన ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ట్విటర్ తెలిపింది.

క్రిప్టోకరెన్సీ ద్వారా విపత్తు ఉపశమన చర్యలకు నిధులు సాయం చేయాలంటూ ఈ ఖాతా నుంచి వరుస ట్వీట్లు వచ్చాయి. దీంతో ట్విటర్ అప్రమత్తమైంది.

ఈ హ్యాకింగ్‌ను తాము నిర్ధారించుకున్నామని, ఇలాంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ట్విటర్ తెలిపింది.

అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తర్వాత జరిగిన హై ప్రొఫైల్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ ఇదే.

''మేం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. హ్యాకింగ్‌కు గురైన ఇతర అకౌంట్ల వివరాలను ఇప్పుడే అంచనా వేయలేం''అని బీబీసీకి ట్విటర్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

ప్రధాన మంత్రి జాతీయ ఉపశమన నిధికి క్రిప్టోకరెన్సీ ద్వారా దానం చేయాలంటూ చేసిన ఆ ట్వీట్లను ప్రస్తుతం ట్విటర్ అకౌంట్ నుంచి తొలగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)