పాస్‌వర్డ్‌లు మార్చుకోండి: ట్విటర్

ఫొటో సోర్స్, Getty Images
యూజర్లు వెంటనే తమ పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలని ట్విటర్ కోరింది. నెట్‌వర్క్‌లో లోపం కారణంగా ఈ మార్పు చేసుకోమని సూచించింది.
అయితే ఈ లోపం వల్ల పాస్‌వర్డ్‌లు తస్కరణకు గురికాలేదని.. వాటిని ఎవరూ దుర్వినియోగం చేయలేదని తమ అంతర్గత దర్యాప్తులో గుర్తించామని తెలిపింది.
అయినా సరే పాస్‌వర్డ్‌ను మార్చుకోవడం వల్ల మరింత జాగ్రత్తగా ఉండొచ్చని సూచించింది.
ఈ లోపం వల్ల ఎన్ని పాస్‌వర్డ్‌లు ప్రభావితమయ్యాయో మాత్రం ట్విటర్ వెల్లడించలేదు.
అయితే ప్రభావితమైన పాస్‌వర్డ్‌ల సంఖ్య గణనీయంగానే ఉంటుందని.. కొన్ని నెలల కిందటి నుంచే వాటిని దుర్వినియోగం చేసి ఉంటారని భావిస్తున్నారు.
కొన్ని వారాల కిందట ట్విటర్ ఓ బగ్‌ను గుర్తించిందని ఓ ఉద్యోగి రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.
ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ కూడా తాజా బగ్‌పై ఓ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ట్విటర్ బ్లాగ్ ప్రకారం... హ్యాషింగ్ (పాస్‌వర్డ్‌లను గుర్తులుగా మార్చే ప్రక్రియ)లో సమస్య వచ్చింది. అయితే హ్యాషింగ్ ప్రక్రియకు ముందుగానే ఒక బగ్ పాస్‌వర్డ్‌లను అంతర్గత కంప్యూటర్‌లలో స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు.
దీనికి తాము చాలా చింతిస్తున్నట్లు ట్విటర్ తన బ్లాగ్‌లో వెల్లడించింది.

పాస్‌వర్డ్‌లను మార్చిన వెంటనే టూ ఫ్యాక్టర్ ఆథంటికేషన్‌ను యాక్టివేట్ చేసుకోవాలనీ సూచించింది. దీని వల్ల తమ ఖాతాల హ్యాకింగ్ ముప్పు తగ్గుతుందని వివరించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








