వికాస్ దుబే పోలీసు ‘ఎన్‌కౌంటర్’లో మృతి... కాన్పూర్‌కు తరలిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించాడన్న పోలీసులు

ఫొటో సోర్స్, ANI
కాన్పూర్ ‘ఎన్‌కౌంటర్’లో ప్రధాన నిందితుడు వికాస్ దుబే మృతి చెందాడు. ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉజ్జయిని నుంచి రోడ్డు మీదుగా కాన్పూర్‌కు తీసుకెళ్తుండగా కాన్వాయిలోని ఒక వాహనం బోల్తా పడింది.
ఆ సమయంలో అతడు ఒక పోలీసు అధికారి నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులు జరుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారని, దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని పోలీసు అధికారి మీడియాతో చెప్పారు. ఆ కాల్పుల్లో వికాస్ దుబే చనిపోయారని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఏఎన్ఐ వార్తా సంస్థ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో తప్పించుకోవడానికి ప్రయత్నించిన వికాస్ దుబేపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన వికాస్‌ను ఆస్పత్రికి తరలించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
వికాస్ దుబేను ఉజ్జయిని నుంచి రోడ్డు మార్గంలో కాన్పూర్‌కు తీసుకువస్తున్నప్పుడు కాన్పూర్ చేరుకోగానే ఎస్టీఎఫ్ కాన్వాయిలో ఒక వాహనం బోల్తా పడిందని ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.
ప్రమాద సమయంలో పోలీసు అధికారి నుంచి వికాస్ పిస్తోలు లాక్కుని కాల్పులు జరిపారని, దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిం దనిచెప్పారు.
ఈ ఘటనలో వికాస్ దుబే మరణించినట్లు పీటీఐ వార్సా సంస్థ ధ్రువీకరించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
వాహనం బోల్తా పడటంతో కొంతమంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని, అదే సమయంలో వికాస్ దుబే తప్పించుకోవడానికి ప్రయత్నించారని ఆ అధికారి చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
పోలీసు అధికారి నుంచి పిస్టల్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. లొంగిపోవాలని పోలీసులు కోరినప్పటికీ అతను కాల్పులు ప్రారంభించాడు. దీనికి ప్రతిస్పందనగా పోలీసులు కూడా కాల్పులు జరిపారని సమాచారం.
అయితే, వికాస్‌కు ఎన్ని బుల్లెట్లు తగిలాయన్న దానిపై ఆయన ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే వికాస్ దూబే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. "వికాస్ దూబేకు నాలుగు బుల్లెట్లు తగిలాయి. మూడు గుండెల్లో, ఒకటి చేతికి తగిలింది. వికాస్‌ను చనిపోయిన స్థితిలో ఇక్కడకు తీసుకొచ్చారు" అని కాన్పూర్ జీఎస్‌వీఎం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్‌బీ కమల్ మీడియాతో చెప్పారు.
ఎన్‌కౌంటర్లో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారని, వారికి మల్టిపుల్ ఇంజూరీ అయ్యాయని చెప్పారు. ఇద్దరు పోలీసులకు బుల్లెట్లు రాసుకుంటూ వెళ్లాయని, వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వివరించారు.
మధ్యప్రదేశ్ హోంమంత్రి దీనిపై స్పందిస్తూ, చట్టం తన పని తాను చేసిందని అన్నారు. ఎన్‌కౌంటర్‌పై ప్రశ్నలు లేవనెత్తుతున్న వారికి సమాధానంగా ఆయన, "నిన్న సజీవంగా ఎందుకు పట్టుకున్నారు అన్నవారే, ఈరోజు ఎందుకు చంపేశారు అంటుండం చాలా విషాదకరం. వీరందరూ నిన్నొకటి, ఇవాళ మరో మాట మాట్లాడుతున్నారు" అన్నారు.
యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా సహా చాలా మంది రాజకీయ నాయకులు వికాస్ దుబే ఎన్‌కౌంటర్లో చనిపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు.
కాన్పూర్ పోలీసుల ప్రకటన

ఫొటో సోర్స్, SAMEERATMAJ MISHRA
కాన్పూర్ పోలీసులు జారీ చేసిన ఒక మీడియా ప్రకటనలో ఘటన ఎలా జరిగిందో చెప్పారని బీబీసీ సహచర ప్రతినిధి సమీరాత్మజ్ మిశ్రా తెలిపారు.
వారి ప్రకటన ప్రకారం, "వికాస్ దుబేను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత పోలీసులు, ఎస్టీఎఫ్ టీమ్ ఈరోజు జులై 10న కాన్పూర్ సిటీకి తీసుకొస్తున్నారు. కాన్పూర్ సిటీ భౌతీ దగ్గర పోలీసు వాహనానికి ప్రమాదం జరగడం వల్ల బోల్తా పడింది. దాంతో అందులో కూర్చున్న నిందితుడు, పోలీసులు గాయపడ్డారు. అదే సమయంలో నిందితుడు వికాస్ దుబే గాయపడ్డ పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని, పారిపోయే ప్రయత్నం చేశాడు".
"అతడిని వెంటాడిన పోలీస్ టీమ్ లొంగిపోవాలని అతడిని హెచ్చరించింది. కానీ అతడు వినలేదు. పోలీసు టీంలో వారిని చంపాలనే ఉద్దేశంతో కాల్పులు జరపడం ప్రారంభించాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాంరు. దాంతో వికాస్ దుబే గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం" అని చెప్పారు.
అంతేకాకుండా, వికాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ బీజేపీ నేత వసీంబారీ కుటుంబం హత్య కేసులో 10 మంది పోలీసుల అరెస్ట్
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
- కరోనావైరస్ నుంచి కోలుకున్న వందేళ్ల వృద్ధుడు
- టాంజానైట్ రాళ్లు రెండు దొరికాయి.. రాత్రికి రాత్రే కుబేరుడయ్యాడు
- పిల్లలపై కరోనావైరస్ ప్రభావం అంతంత మాత్రమే - తాజా సర్వే
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్ లాక్డౌన్: మనుషులు సహజంగా బద్ధకస్తులా?
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








