కరోనావైరస్: కోవిడ్-19 చికిత్సకు మందును విడుదల చేసిన గ్లెన్‌మార్క్...

ఫొటో సోర్స్, ANI
కోవిడ్-19 వ్యాధిని నయం చేయడంలో తమ యాంటీవైరల్ ఔషధం మెరుగైన ఫలితాలను ఇచ్చిందని భారత్‌లోని గ్లెన్‌మార్క్ ఫార్మా సంస్థ ప్రకటించింది.
స్వల్ప స్థాయి నుంచి ఒక మోస్తరు తీవ్రతతో కోవిడ్-19తో బాధపడుతున్న వారి మీద తమ యాంటీ వైరల్ మందు ఫావిపిరవిర్ మెరుగ్గా పని చేసిందని, రోగుల్లో 88 శాతం మెరుగుదల కనిపించిందని గ్లెన్‌మార్క్ వెల్లడించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
అయితే, ఈ ఔషధంతో చేసిన పరిశోధనలలో గర్భిణులను, పాలిచ్చే తల్లులను చేర్చలేదని ఆ సంస్థ వివరించింది.
నోటి ద్వారా తీసుకునే ఫావిపిరవిర్ మందును గ్లెన్‌మార్క్ 'ఫ్యాబిఫ్లూ' అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది.
"ఆ యాంటీ వైరల్ మందు రకరకాల ఆర్ఎన్ఏ వైరస్‌పై పని చేస్తుంది. 20 నుంచి 90 ఏళ్ళ మధ్య వయసు వారిలో ఈ మందును పరీక్షించినప్పుడు చెప్పుకోదగిన మెరుగుదల కనిపించింది. ఫావిపిరవిర్ మందును కోమార్బిడ్ పరిస్థితుల్లో అంటే మధుమేహం, హృద్రోగాలతో కూడా బాధపడుతున్న రోగులకు కూడా ఇవ్వవచ్చు" అని గ్లెన్‌మార్క్ తన ప్రకటనలో తెలిపింది.

భారత అత్యున్నత ఔషధ నియంత్రణ సంస్థ ఈ యాంటీ వైరల్ మందు ఫావిపిరవర్‌కు 'నియంత్రిత అత్యవసర ఉపయోగానికి' అనుమతి ఇచ్చిందని ఏఎన్ఐ వార్తా సంస్థ శుక్రవారం రిపోర్ట్ చేసింది.
తాజాగా ఈ సంస్థ ఈ మందు ఉత్పత్తికి, పంపిణీకి భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ నుంచి అనుమతి పొందింది.
గ్లెన్‌మార్క్ సంస్థ ఈ ఔషధాన్ని తన పరిశోధన-అభివృద్ధి బృందంతోనే విజయవంతంగా అభివృద్ధి చేసింది.
ఈ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సాల్దాన్హా, "దేశంలో కరోనావైరస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న సమయంలో ఈ అనుమతి లభించింది. నిజానికి, దేశంలో విస్తరిస్తున్న వైరస్ కేసులు మన ఆరోగ్య వ్యవస్థను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఫ్యాబిఫ్లూ ఔషధం కోవిడ్ రోగులకు సమర్థ చికిత్సగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం" అని అన్నారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- మహిళలు తమకి కావలసినప్పుడు గర్భం ధరించగలిగే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- ‘చైనా సైనికుడి ఎడమ కంటిపై కాల్చాను.. కుళాయి నుంచి నీరు కారినట్లు శరీరం నుంచి రక్తం కారింది’
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- ‘హిందీ-చీనీ భాయీ భాయీ’ విని విని చెవులు పగిలిపోయాయి.. చైనా యుద్ధ బందీ అయిన భారత సైనికుడి కథ
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- లాక్ డౌన్ ముగిసిందని పార్టీ చేసుకున్నారు.. 180 మందికి కరోనావైరస్ అంటించారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








