కేరళలో ఏనుగు మృతి: ‘పంది టపాకాయ’లకు బలవుతున్న ఏనుగులు ఎన్నో...

- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
అడవి జంతువులు పొలాల్లోకి రాకుండా అడ్డుకోడానికి పైనాపిల్ లేదా మాంసంలో ముడి పేలుడు పదార్థాలు పెట్టే పద్ధతికి కేరళ స్థానిక నిఘంటువులో స్థానం కల్పించారు. దానిని మలయాళంలో ‘పన్ని పడాకం’ అంటారు. అంటే ‘పంది టపాకాయ’ అని అర్థం.
ఈ టపాకాయలను స్థానికంగా దొరికే పేలుడు పదార్థాలతో లేదంటే పండుగ సమయాల్లో ఉపయోగించే టపాకాయల నుంచి తీసి తయారు చేస్తారు. పేలుడు పదార్థాలు, రకరకాల ఉచ్చులు ఉపయోగించడం ఒక్క కేరళకే పరిమితం కాదని, భారతదేశమంతటా అది ఉందని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు.
“ఇవి ఏనుగుల కోసం ఉద్దేశించినవి కావు. వాటిని ముఖ్యంగా పొలాల్లోకి ప్రవేశించి, పంటలను నాశనం చేసే అడవి పందులను చంపడానికి పెడుతుంటారు” అని వైల్డ్ లైఫ్ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఫోరెస్ట్రీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జాకబ్ చీరన్ బీబీసీకి చెప్పారు.
మన్నక్కాడులో ఒక గర్భంతో ఉన్న ఏనుగు టపాకాయ కూరిన పైనాపిల్‌ను తిని చనిపోవడం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిలించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ “ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది, ముగ్గురు అనుమానితులపై దృష్టి పెట్టాం” అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
“ఇద్దరు నిందితులను ప్రస్తుతం విచారిస్తున్నారు. మేం ఈ కేసులో ఇంకా ప్రాథమిక అరెస్టులు ఏవీ చేయలేదు” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, MOHAN KRISHNAN
ఇలాంటి ఘటనలు ఎన్నో
18 ఏళ్ల క్రితం ఇలాంటి ఘటనే జరగడంతో ఒక మగ ఏనుగు నోట్లో తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పుడు డాక్టర్ చీరన్ దానికి ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ సమయంలో సీనియర్ పశువైద్యుడు ప్రొఫెసర్ కేసీ పనిక్కెర్, డాక్టర్ పీబీ గిరిదాస్ ఆ ఏనుగుకు మత్తుమందు ఇచ్చి చీరన్‌కు సహకరించారు.
“కానీ మేం ఆ ఏనుగును కాపాడలేకపోయాం. ఎందుకంటే కింది దవడ, పై దవడలకు తీవ్ర గాయాలు అయిన ఏ జంతువైనా బతకడం చాలా కష్టం” అని చీరన్ చెప్పారు.
ఇటీవల ఏప్రిల్‌లో కూడా కొల్లం జిల్లాలోని పునలూర్ అటవీ ప్రాంతంలో పథనపురం దగ్గర ఒక 9 ఏళ్ల మగ ఏనుగు పిల్ల ఈ టపాకాయల బారిన పడింది.
“ఏనుగులు ఈ పద్ధతిలో చనిపోవడం సాధారణంగా జరగదు. జనం ఈ టపాకాయలను అడవి పందులు చంపడానికి పెడతారు. ఏనుగులు సాధారణంగా కాఫీ, ఇతర తోటలపై దాడి చేయవు. అవి వరి, అరటి పంటలపైకి వెళ్తాయి” అని కేరళ మాజీ చీఫ్ ఫారెస్ట్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ ఈకే ఈశ్వరన్ చెప్పారు.
గతవారం పదవీ విరమణ చేసిన ఈశ్వరన్ “అడవి పందులు దేశమంతా ఉంటాయి. అందుకే, అడవి పందులు గాయపడిన ఘటలను మనం పెద్దగా పట్టించుకోం. ఏనుగులు చనిపోయిన ఇటీవలి ఘటనలు చాలావరకూ ప్రమాదవశాత్తూ జరిగాయి. పథనపురంలో ఉపయోగించింది స్థానిక టపాకాయ, దాన్ని నమలడం వల్ల అది పేలింది” అన్నారు.

వేరే దారి లేదా?
కానీ, అడవి జంతువులను భయపెట్టి తరిమేయాలంటే ఉన్న ఒకే ఒక దారి టపాకాయలేనా?
“అలా ఏం లేదు. ఎరవేసే పదార్థాలుగా మేం పిలిచుకునే వస్తువులు చాలా రకాలు ఉన్నాయి. వాటిని విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నారు. వాటిలో ఉచ్చులు, జా ట్రాప్స్, డెడ్ ఫాల్ ట్రాప్స్, స్పైక్స్ లాంటివి చాలా ఉన్నాయి. కొందరు మొక్కల నుంచి నిపుణులు సేకరించే విషాలు కూడా ఉపయోగిస్తారు. ఇలా వేటాడడం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో జరుగుతోంది”. అని వైల్డ్ లైఫ్ ఫస్ట్ అనే స్వచ్చంద సంస్థకు చెందిన ప్రవీణ్ భార్గవ్ చెప్పారు.
“ఈ పేలుడు పదార్థాలను ‘సైలెంట్ కిల్లర్స్’ అంటారు. తుపాకీలతో కాల్పులు జరిపితే గార్డులు ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్లి వాళ్లను పట్టుకుంటారు. అందుకే ఇలాంటి సైలెంట్ కిల్లర్స్ వల్ల వారి గురించి ఎవరికీ తెలీకుండా ఉంటుంది. కేరళలోనే కాదు ఇది దేశమంతటా జరుగుతోంది” అన్నారు.
“వన్యప్రాణుల నివాస స్థానాలకు రెండు రకాల ముప్పు ఎదురవుతోంది. ఇలాంటి పరికరాలతో వేటాడడం వాటిలో ఒకటి. దాన్ని అడ్డుకోడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి. కానీ, వాటిని అమలు చేయడమే సమస్య. ఇక మనుషుల ఒత్తిడికి దూరంగా జంతువులకు, వాటి ఆవాసాలకు మనం స్థలం ఎలా కేటాయిస్తాం అనేది రెండోది” అని భార్గవ్ చెప్పారు.
సంఘర్షణ పరిస్థితులను తగ్గించగలం కానీ, వాటిని పూర్తిగా తొలగించలేమని ఆయన అంగీకరించారు.

ముఖ్యమంత్రి ఆక్రోశం
కానీ ముఖ్యమంత్రి విజయన్ తన వరుస ట్వీట్లలో “మనుషులు-వన్యప్రాణుల మధ్య ఘర్షణ ఘటనలు పెరగడం వెనుక కారణాలను గుర్తించడానికి ప్రయత్నిస్తాం. పర్యావరణ మార్పులు స్థానిక సమాజాలు, జంతువులపై ప్రతికూల ప్రభావం చూపుతూ ఉండచ్చు” అన్నారు.
బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి మనేకా గాంధీ పేరు ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అందులో ఆయన “ఇది చెప్పాక, కొంతమంది ఈ విషాదాన్ని విద్వేష ప్రచారానికి ఉపయోగించారు అనే వాస్తవం చూసి మేం బాధపడుతున్నాం. తప్పుడు వివరణల ఆధారంగానే అబద్ధాలు ఏర్పడతాయి. సత్యాన్ని రూపుమాపడానికి అరకొర నిజాలను, తప్పుడు ప్రాధాన్యతలను ఆశ్రయించారు” అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మరో ట్వీట్‌లో ఆయన “కేరళ సమాజం అన్యాయానికి వ్యతిరేకంగా వెల్లువెత్తే ఆగ్రహాన్ని గౌరవిస్తుంది. ఇందులో ఏదైనా ఆశాజనకంగా ఉందంటే, అది అన్యాయానికి వ్యతిరేకంగా మన గళాన్ని వినిపించగలం అనే విషయం మనకు తెలియడమే. మనం ప్రతిసారీ, ప్రతిదగ్గరా అన్ని రకాలుగా అన్యాయంతో పోరాడే వాళ్లం అవుదాం” అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








