డోనల్డ్ ట్రంప్: ‘భారత్, చైనాల సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధం’

ఫొటో సోర్స్, Getty Images
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
భారత్, చైనా రెండింటికీ ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మరోవైపు భారత్‌తో సరిహద్దుల్లో పరిస్థితి ‘పూర్తి స్థిమితంగా, నియంత్రణలోనే’ ఉందని చైనా వ్యాఖ్యానించినట్లు పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది.
భారత్, చైనా మధ్య వివాదాలను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునేందుకు అవసరమైన వ్యవస్థలు ఉన్నాయని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఝాఓ లిజియాన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు.
‘‘ప్రాంతీయ సార్వభౌమత్వాన్ని, శాంతిని, సరిహద్దు ప్రాంతాల్లో సుస్థిరతను పరిరక్షించుకునేందుకు మేం కట్టుబడి ఉన్నాం. చైనా-భారత్ సరిహద్దుల్లో పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉంది. చర్చలు, సంప్రదింపుల ద్వారా మేం సమస్యలను పరిష్కరించుకోగలం’’ అని అన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
చైనా మీడియా ఏం రాసిందంటే...
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదమై నెలకొన్న ఉద్రిక్తతల గురించి చైనా మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి.
లద్దాఖ్‌లోని వివాదాస్పద గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో సరిహద్దు వెంబడి భారత్ ‘అక్రమంగా’ సైనికపరమైన వ్యవస్థలను నిర్మించిందని చైనా మీడీయాలో కథనాలు ప్రసారమయ్యాయి.
ఏకపక్ష చర్యలకు భారత్ దూరంగా ఉండాలని, లేకపోతే పరిస్థితులు మరింత సంక్లిష్టమవుతాయని లిజియాన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, AFP/getty
దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ అంశంపై భారత్, చైనా చర్చలు జరుపుతున్నాయని మే 21న ఆయన వెల్లడించినట్లు చైనా ప్రభుత్వ పత్రిక పీపుల్స్ డైలీ రాసింది.
నేపాల్‌తోనూ భారత్‌కు సరిహద్దు వివాదం రాజుకున్న సమయంలోనే ఈ వివాదం కూడా తెరపైకి వచ్చింది.
అయితే, మిగతా కీలకమైన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ వివాదాలు ఓ మార్గంగా కొన్ని భారత మీడియా సంస్థలు చూస్తున్నాయి.

ఫొటో సోర్స్, Pti
‘భారత్ ఆలోచించి వేసిన అడుగు’
రెండు దేశాలతో భారత్‌కు ఏర్పడిన వివాదాలు యాదృచ్ఛికంగా ఏర్పడినవి కాదని, బాగా ఆలోచించి భారత్ వేసిన అడుగని గ్లోబల్ టైమ్స్ కథనం రాసింది.
భారత సైనికులు కావాలనే చైనా సైనికులతో ఘర్షణకు దిగారని వ్యాఖ్యానించింది.
భారత్ ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగితే, రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం పడుతుందని ఆ కథనంలో అభిప్రాయపడింది.
‘‘కరోనావైరస్ మహమ్మారి కారణంగా చైనా ఆర్థికవ్యవస్థ నెమ్మదించిందని, పశ్చిమ దేశాలు చైనా పారదర్శకంగా వ్యవహరించలేదని ఆరోపణలు చేస్తుండటంతో భారత్‌కు పెద్ద అవకాశం దొరుకుతుందని భారత్‌లో కొందరు భావిస్తున్నారు. సరిహద్దు వివాదాలతో వారికి ప్రయోజనం’’ అని గ్లోబల్ టైమ్స్ రాసింది.

ఫొటో సోర్స్, ETIENNE OLIVEAU/GETTY IMAGES
‘చైనా ఆక్రమణవాద విధానాలు’
చైనా ఒత్తిడికి భారత్ తలొగ్గద్దని భారతీయ వార్తా పత్రికలు కథనాలు రాశాయి.
సరిహద్దు రేఖ వద్ద చైనా ఆక్రమణలు భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలని ప్రముఖ హిందీ దినపత్రికలు తమ కథనాల్లో అభిప్రాయపడ్డాయి.
రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు కొత్తేమీ కాదని మరో పత్రిక రాసింది. ‘‘చైనా ఆక్రమణవాద విధానాలను అందరూ చూస్తున్నారు. భారత్‌పై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో ఆ దేశం ఇలా చేస్తోంది. సరిహద్దు పంచుకుంటున్న దేశాలను బెదిరించే ప్రయత్నం చేస్తోంది’’ అని అభిప్రాయపడింది.
చైనా ఒత్తిడికి ఎదురుగా భారత్ గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక మే 25న ప్రచురించిన కథనంలో రాసింది.
చైనా ఆలోచన ధోరణి మారాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక అభిప్రాయపడింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, చైనాల మధ్య తాజా సరిహద్దు వివాదం ఏమిటి?
భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తూర్పు లద్దాఖ్ సహా లైన్ ఆఫ్ కంట్రోల్‌లోని పలు వివాదాస్పద ప్రాంతాల్లో రెండు దేశాలు తమ బలగాలను భారీ ఎత్తున పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
2017లో తలెత్తిన డోక్లం వివాదం తర్వాత మళ్లీ సరిహద్దుల్లో ఈ స్థాయిలో బలగాలను మొహరించడం ఇదే తొలిసారి.
ఇప్పటికే ఆ ప్రాంతానికి చైనా 2వేల నుంచి 2,500 మంది బలగాలను తరలించిందని భారత మిలటరీకి చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఆ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలను కూడా చేపడుతోందని ఆయన తెలిపారు.
అటు చైనా కూడా ఇదే తరహా ఆరోపణలు చేసింది. గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్ అనధికారిక నిర్మాణాలను చేపడుతోందని చైనా ఆరోపించింది.
అయితే చైనా ఆరోపణల్ని గత వారంలో భారత విదేశాంగ శాఖ ఖండించింది. తాము సరిహద్దు నియమాలకు లోబడి గస్తీ కాస్తుంటే పదే పదే చైనా బలగాలు అడ్డొస్తున్నాయని ఆరోపించింది.
భారత్ సరిహద్దుల్లోని దుందుడుకు చర్యల కారణంగానే రెండు దేశాల బలగాల మధ్య ఘర్షణ జరిగిందన్న చైనా ఆరోపణల్ని కూడా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఖండించారు.
మరోవైపు తాజా ఉద్రిక్త పరిస్థితులపై చర్చించేందుకు భారత రక్షణ శాఖ రాజ్ నాథ్ సింగ్ మంగళవారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ సహా త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు.
సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. ప్రస్తుతం చైనా వ్యవహరిస్తున్న తీరును రాజ్ నాథ్ సింగ్‌కు ఆర్మీ చీఫ్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ‘నక్సలైట్ల కుట్ర కేసులు’ ఎన్నిసార్లు రుజువయ్యాయి?
- భీమా-కోరెగాంలో దళితులు విజయోత్సవం ఎందుకు జరుపుకొంటారు?
- విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. ఫ్యాక్టరీ అత్యవసరంగా తెరిచేందుకు అనుమతి
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- ట్విటర్: డోనల్డ్ ట్రంప్ ట్వీట్‌కు ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిక.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








