సైక్లోన్ ఆంఫన్: పశ్చిమ బెంగాల్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే

నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే

ఫొటో సోర్స్, DD India

సైక్లోన్ ఆంఫన్‌కు తీవ్రంగా ప్రభావితమైన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.

శుక్రవారం ఉదయం 10.50కి ప్రధాని కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, గవర్నర్ ధన్‌కర్, రాష్ట్ర సీనియర్ బీజేపీ నేతలు స్వాగతం పలికారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

మధ్యాహ్నం ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ సర్వేలో ఆయనతోపాటూ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ కూడా ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‌కు మొదట కేంద్రం వెయ్యి కోట్ల నిధులు అందిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారని పీఎంఓ ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కో మృతుడి కుటుంబానికి 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రధాని ప్రకటించారని తెలిపింది.

ఈ పర్యటనలో ప్రధానితోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, బాబుల్ సుప్రియో, ప్రతాప్ చంద్ర సారంగి, దేబశ్రీ చౌధురి కూడా ఉన్నారు.

తుపాను అనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, నరేంద్ర మోడీ ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఈ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు.

మమతా బెనర్జీ గురువారం ఒక్కో మృతుడి కుటుంబానికి 2 లక్షల పరిహారం ప్రకటించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాథమిక పునరావాస చర్యలకు వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్ విడుదల చేశారు.

ఆంఫన్ తుపాను వల్ల పశ్చిమ బెంగాల్‌లో 77 మంది మృతిచెందగా, భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని ఆరు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. రాజధాని కోల్‌కతా సహా చాలా ప్రాంతాల్లో మురికివాడలు ధ్వంసమయ్యాయి. వేల చెట్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)