కరోనావైరస్: కొత్త సినిమాలు విడుదలయ్యేదెప్పుడు? షూటింగ్‌లు మళ్లీ మొదలయ్యేదెప్పుడు ?

ఫొటో సోర్స్, facebook.com/AlwaysRamCharan/
సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే సమయానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలీవుడ్ ప్రేమికులంతా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రిలీజ్ కానున్న సూపర్ కాప్ సిరీస్ 'సూర్యవంశీ' చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూశారు.
కానీ కరోనావైరస్ కారణంగా కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ వారి ఆశలపై నీళ్లు చల్లేసింది. ప్రస్తుతానికి ఆ సినిమా విడుదల వాయిదా పడింది. ఎప్పుడు విడుదలవుతుందన్న సంగతి తెలియదు.
అలాగే 1983లో భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ సాధించిన సందర్భం నేపథ్యంలో రూపొందించిన స్పోర్ట్స్ బయోపిక్ “83” ప్రీమియర్ ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది.
కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పడుకొనే నటిస్తున్నారు. ప్రస్తుతానికి అది కూడా వాయిదా పడింది. నిజానికి ఆ నిర్ణయం తనను చాలా నిరాశ పరిచిందని కబీర్ ఖాన్ ఓ యూట్యూబ్ ఛానెల్‌తో చెప్పారు.
“ప్రపంచానికి మా చిత్రాన్ని చూపించాలని ఎంతో ఆశ పడ్డాం. కానీ కొన్ని సార్లు మనం ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రపంచమంతా మునివేళ్లపై నిల్చొని ఉంది. ఈ పరిస్థితుల్లో సినిమా చూడాలని ఎవ్వరూ అనుకోరు” అని ఖాన్ వ్యాఖ్యానించారు.
షూటింగ్‌లు నిలిచిపోయాయి
ఈ కరోనా ప్రభావం కేవలం సినిమాల విడుదలపై మాత్రమే కాదు... షూటింగ్‌లపై కూడా పడింది.
కంగనా రనౌత్ తన కొత్త చిత్రం 'తలైవి' చిత్రీకరణ కోసం తమిళనాడులో జరిగే షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది.
“45 రోజుల పాటు అక్కడ జరిగే షూటింగ్‌లో నేను పాల్గొనాలి. కానీ సామాజిక దూరం నియమానికి భంగం కల్గుతుందన్న కారణంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో షూటింగ్ నిలిపేసి తిరిగి నేను ముంబయి వచ్చేశాను” అని పింక్ విల్లా అనే బాలీవుడ్ న్యూస్ వెబ్‌సైట్‌కు ఆమె చెప్పారు.
దీపికా పదుకొనె కూడా తన కొత్త చిత్రం షూటింగ్ కోసం శ్రీలంక వెళ్లాల్సి ఉంది. కానీ అప్పటికి కొన్ని రోజుల క్రితమే కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది.
“ముంబయి విడిచి వెళ్లలేదు కాబట్టి సరిపోయింది. ఇంకెక్కడైనా అయితే మేం ఉండలేం” అని ప్రముఖ పాత్రికేయుడు రాజీవ్ మసంద్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో దీపిక చెప్పుకొచ్చారు.
టాలీవుడ్‌లోనూ అదే పరిస్థితి. షూటింగ్ జరుగుతున్న చాలా సినిమాలు సగంలోనే ఆగిపోయాయి. తెలంగాణలో కరోనావైరస్ కేసులు బయటపడ్డ కొద్ది రోజులకే మార్చి 31 వరకు సినిమా షూటింగ్‌లన్నీ నిలిపేస్తున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఆ తర్వాత కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రస్తుతానికి అదే స్థితి కొనసాగుతోంది.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

దీంతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ నిలిచిపోయింది.
ఇక సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న 'ఆచార్య' చిత్రీకరణ కూడా ఆగిపోయింది. తన చిత్ర యూనిట్ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్రీకరణను వాయిదా వేస్తే మంచిదని దర్శకుడు కొరటాల శివను కోరగానే ఆయన అంగీకరించారంటూ స్వయంగా చిరంజీవి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇలా అనేకమంది ఇతర నటీ నటుల చిత్రాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరి ఇంట్లో వాళ్లే
ఇక బిజీ బిజీగా ఉండే నటీ నటులకు ఊహించని విధంగా ఒక్కసారిగా కావాల్సినంత ఖాళీ సమయం దొరికింది. అంతే.. కొందరు తాము ఇంట్లో చేస్తున్న పనులన్నింటినీ షూట్ చేసి సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటే.. మరి కొందరు కరోనా జాగ్రత్తల గురించి అభిమానులకు సూచనలిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కరోనావైరస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తూ టాలీవుడ్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్‌లు సంయుక్తంగా ఓ వీడియో సందేశాన్ని ప్రజలకు అందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కరోనావైరస్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో రూపొందించిన పాటలో చిరంజీవి, అక్కినేని నాగార్జున, సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ్‌లు కలిసి నటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇక 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత ఇంకా స్క్రిప్టులు వినే పనిలోనే ఉన్న మహేశ్ బాబు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు తన అభిమానులకు ట్విటర్ ద్వారా సూచనలు ఇస్తూనే.. తన ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్న సన్నివేశాల ఫొటోలను షేర్ చేస్తున్నారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
బాలీవుడ్ విషయానికొస్తే... దీపికా, కత్రినా కైఫ్ ఇంట్లో వస్తువుల్ని సర్దడం, వంట చేయడం, గిన్నెలు తోమడం వంటి ఇంటి పనుల్లో బిజీ అయిపోయారు. అలాగే తాము చేస్తున్న పనుల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.
ఆలియా భట్, హృతిక్ రోషన్ వంటి సెలబ్రిటీలు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకునే పనిలో ఉన్నారు.
అయితే కొందరు సెలబ్రిటీలు తమ వర్కౌట్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చెయ్యడంపై ఫరాఖాన్ వంటి దర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్కౌట్ వీడియోలను పోస్ట్ చెయ్యడం ఆపకపోతే అలాంటి ప్రముఖుల్ని అన్‌ఫాలో చేస్తానని కూడా హెచ్చరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
“ప్రపంచమంతా కోవిడ్-19 మహమ్మారి బారిన పడి అల్లాడిపోతూ ఉన్న ఈ సమయంలో మీకేం పట్టడం లేదా? మీకు అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయన్న సంగతి మాకు తెలుసు. కానీ ఈ పరిస్థితుల్లో మీ ఫిగర్ ఎలా ఉంటే ఎవరికి కావాలి? ఈ సంక్షోభ సమయంలో మాలో చాలా మందికి ఎన్నో ఇతర భయాలున్నాయి” అని మండిపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
మరికొంత మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా టాలీవుడ్ హీరోలు నడిచిన బాటలోనే నడించారు. నటుడు కార్తీక్ ఆర్యన్ సామాజిక దూరం గురించి చెబుతూ చేసిన స్పూఫ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా కోటి మంది వీక్షించారు.

ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి
ఇక కరోనా విషయంలో బాలీవుడ్, టాలీవుడ్ నటులంతా సాయం చెయ్యడంలో వెనకడుగు వెయ్యలేదు. స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనుష్క శర్మ, పవన్ కల్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, మహేశ్ బాబు, నాగార్జున, ఇలా ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు పీఎం కేర్స్ ఫండ్‌కి విరాళాలు అందించారు.
అలాగే సినీరంగంలోని కార్మికుల్ని ఆదుకునేందుకు అమితాబ్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్... ఇలా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్‌లో వారికోసం ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి సాయం అందిస్తున్నారు.
మరో నటి ప్రియాంక చోప్రా కరోనావైరస్ మహమ్మారిపై పోరాడుతున్న వివిధ రంగాలకు చెందిన మహిళలను ప్రతి వారం నలుగుర్ని చొప్పున్న ఎంపిక చేసి వారందరికీ ఏడు కోట్ల రూపాయలను అందించాలని నిర్ణయించుకున్నారు.

ఫొటో సోర్స్, UGC
మున్ముందు భారీ మార్పులు?
అయితే ప్రస్తుతం లాక్ డౌన్‌ను మరింత కాలం పొడిగించే అవకాశం ఉండటంతో మున్ముందు బాలీవుడ్‌లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నారు.
నిర్మాత కరణ్ జోహార్ తన తర్వాత చిత్రం షూటింగ్‌ను ఏప్రిల్‌లో మొదలు పెట్టాల్సి ఉంది. ఆ చిత్రం కోసం యూరప్‌లో ఇప్పటికే సెట్ల నిర్మాణాన్ని ఆయన చిత్ర బృందం పూర్తి చేసింది.
అయితే రాజీవ్ మసంద్‌తో మాట్లాడిన కరణ్ జోహార్ భవిష్యత్ గురించి ఇప్పడేం చెప్పలేమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆయన నిర్మించిన రెండు చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మరో ఏడు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.
“కేవలం ధర్మ ప్రొడక్షన్స్ విషయంలోనే కాదు... ఇతర స్టూడియోల పరిస్థితి కూడా అలాగే ఉంది. మళ్లీ పరిస్థితులు ఎప్పుడు కుదుటపడతాయన్న సంగతి తెలియదు. సినిమాల విషయంలో పరిస్థితి ఏ స్థాయికి దిగజారుతుందో కూడా తెలియదు” అని కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు.
సినిమాల విడుదల వాయిదా పడటం వల్ల నష్టాలు తప్పవని నిపుణులు చెబుతుండగా ఈ విషయంలో కబీర్ ఖాన్ మాత్రం కాస్త ఆశావహంగా ఉన్నారు. ఇండస్ట్రీ మొత్తం ఓ నాలుగు నెలల్లో కుదుటపడుతుందని అన్నారు.
దేశంలో నిరుపేదలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలతో పోల్చితే తమ సమస్యలు ఏ పాటివన్న సంగతి చాలా మంది బాలీవుడ్ స్టార్లకు, దర్శకులకు తెలుసు.
ఇంట్లో కూర్చొని వార్తలు చూస్తూ ఉంటే హృదయం ద్రవించుకుపోతోందని వికీ కౌశల్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. దీపికా పదుకొనే కూడా సానుకూల దృక్పథాన్ని, ఆనందాన్ని ఇచ్చే ఇతర విషయాలపైనే దృష్టి పెట్టాలని చెప్పుకొచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఇక టాలీవుడ్ ప్రముఖులైతే ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు కురిపిస్తూనే... తాము తగిన జాగ్రత్తలు పాటిస్తున్నామని, తమ అభిమానులు ప్రజలు కూడా పాటించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా
- కరోనా లాక్డౌన్: ఈ కార్మికుడు భార్యను ఎక్కించుకుని సైకిల్‌పై 750 కిలోమీటర్లు ప్రయాణించాడు
- కరోనావైరస్-నిరుద్యోగం: ఉద్యోగం పోతే ఎలా.. ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి
- కరోనా లాక్డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా
- వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








