క్రికెట్ స్పోర్ట్ కాదు.. క్రీడగా గుర్తించేందుకు నిరాకరించిన రష్యా ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images
అధికారిక గుర్తింపు కలిగిన క్రీడల జాబితాలో క్రికెట్‌ను చేర్చేందుకు రష్యా క్రీడల మంత్రిత్వ శాఖ నిరాకరించింది.
క్రికెట్ ప్రపంచకప్ 2019 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు.. అంటే జూలై 15వ తేదీన ఈ నిర్ణయం వెలువడింది. ఇంగ్లండ్, న్యూజీలాండ్ దేశాల జట్ల మధ్య క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనంత ఉత్కంఠతో జరిగిన ఆ మ్యాచ్ స్కోర్లు, సూపర్ ఓవర్ స్కోర్లు సమం కావటంతో ఎక్కువ బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
రష్యాలో అధికారికంగా గుర్తింపు పొందిన క్రీడల జాబితాలో ఫుట్‌బాల్, ఐస్ హాకీ, వాలీబాల్ వంటి క్రీడలతో పాటు గోళీల ఆటలాంటి పెటాన్క్, మేక-పులి.. చెస్ ఈ రెండింటి సమ్మేళనం లాంటి డ్రాట్స్, మినీ గోల్ఫ్ వంటివి కూడా ఉన్నాయి.
అయితే, అధికారిక క్రీడల జాబితాలో చేర్చనంత మాత్రాన రష్యాలో క్రికెట్ ఆడటం నిషేధం అని కాదు. కానీ, ప్రభుత్వం నుంచి క్రికెట్‌కు, క్రికెట్ ఆడే వారికీ ఎలాంటి ప్రోత్సాహం, నిధులు లభించవు.
మంత్రిత్వ శాఖ రిజిస్టర్‌లో క్రికెట్‌ను కూడా చేర్చాలని ప్రయత్నించినప్పటికీ.. దరఖాస్తులో లోపాల వల్లనే దీనిని తిరస్కరించారని మాస్కో క్రికెట్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సభ్యుడు అలెగ్జాండర్ సోరోకిన్ చెప్పారు.
అయితే, క్రికెట్‌కు ప్రభుత్వ గుర్తింపు కోసం వచ్చే ఏడాది కూడా దరఖాస్తు చేస్తామని, అప్పుడు కచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన టీఏఎస్ఎస్ వార్తా సంస్థకు వెల్లడించారు.
థాయ్ బాక్సింగ్‌గా పేరొందిన ముయ్ థాయ్‌ను కూడా రష్యా క్రీడగా గుర్తించలేదు.
క్రికెట్‌ను రష్యా క్రీడగా గుర్తించలేదన్న వార్త వెలువడగానే సోషల్ మీడియా యూజర్లు దీనిపై స్పందించారు.
''రెండు వందల కోట్ల మంది ప్రజలు నిరంతరం క్రికెట్ చూస్తుంటారు. భారత్, పాకిస్తాన్, ఒకప్పుడు బ్రిటిషర్లు పాలించిన ఇతర దేశాల్లో ఇది ఎంతో ఆదరణ ఉన్న క్రీడ. అందుకే రష్యాలో ఈ ఆంగ్లో-శాక్సన్ ఆట గురించి వారు కొంచెం భయపడ్డారు'' అని యెఖిడ్నియె ట్విటీ అనే ప్రముఖ ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు.
''క్రీడల శాఖ క్రికెట్, థాయ్ బాక్సింగ్‌లను రష్యాలో అధికారిక క్రీడలుగా గుర్తించేందుకు నిరాకరించింది. అయితే, రష్యాలో క్రికెట్ ఫెడరేషన్, ఒక జాతీయ టీమ్ కూడా ఉన్నాయి'' అని ఆర్‌బీసీ బిజినెస్ డైలీ ట్వీట్ చేసింది.
16వ శతాబ్ధంలో ఇంగ్లండ్‌లో పుట్టిందని భావిస్తున్న క్రికెట్ తర్వాతి కాలంలో బ్రిటిష్ రాజ్యం అధికారంలో ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చందింది. 19వ శతాబ్ధం నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. 1900 వేసవి ఒలంపిక్స్‌లో క్రికెట్ భాగమైంది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రష్యాకు 2017లో అసోసియేట్ మెంబర్ హోదాను ఇచ్చింది. దీంతో ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనే అవకాశం రష్యా క్రికెట్ జట్టుకు లభించింది.
రష్యా క్రికెట్ జట్టు 2007 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోంది.
ఇవి కూడా చదవండి:
- తొడ కొడుతున్న కబడ్డీ - హైదరాబాద్‌లో నేడే ప్రొకబడ్డీ సీజన్ 7 షురూ
- వరల్డ్ కప్‌లో 10 జట్లే ఉండటానికి బీసీసీఐ అత్యాశే కారణమా
- ఇకపై టెస్టు మ్యాచ్ నాలుగు రోజులేనా?
- రష్యా విప్లవ చరిత్రను కళ్లకు గట్టే పోస్టర్లు
- ఐసీసీ ప్రపంచకప్ 2019 జట్టు ఇదే, టీమిండియా నుంచి ఇద్దరికి చోటు
- బెన్ స్టోక్స్: ఇంగ్లండ్‌కు వరల్డ్ కప్ అందించిన ‘న్యూజీలాండర్’
- ‘రాజకీయ వేత్తలకు వల వేసే రష్యా గూఢచారి’ అరెస్టు
- భారత్-రష్యా: ఆయుధాలు, మసాలాలు కాకుండా ఇంకేం ఇచ్చిపుచ్చుకుంటున్నాయంటే..
- క్రికెట్ ప్రపంచ కప్ విజేత ఇంగ్లండ్... ఫైనల్, సూపర్ ఓవర్ టై.. ఉత్కంఠభరిత మ్యాచ్ సాగింది ఇలా
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?
- జింబాబ్వేను సస్పెండ్ చేసిన ఐసీసీ.. క్రికెట్లో రాజకీయ జోక్యంతో జాతీయ జట్టుపై నిషేధం
- సరిగ్గా 36 ఏళ్ల క్రితం భారత్ ప్రపంచ కప్ గెలిచిన రోజున దిల్లీలో ఏం జరిగింది..
- డక్‌వర్త్ లూయిస్: అసలు ఈ రూల్ ఎలా పుట్టింది... విజేతను ఎలా నిర్ణయిస్తారు...
- అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం: ఫేస్‌బుక్ నుంచి పేపాల్ వరకు అన్నిటినీ వాడేసిన రష్యా
- అపోలో-11 కన్నా పదేళ్ళ ముందే చంద్రుని మీదకు ఉపగ్రహాన్ని పంపిన రష్యా...
- ‘స్టాలిన్ మృతి’: బ్రిటిష్ కామెడీ సినిమాపై మండిపడుతున్న రష్యా
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- క్రికెట్లో ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్ ఫుట్‌బాల్‌లో ఎందుకు వెనకబడింది?
- బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడా సంస్థా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








